Today Rasi Phalalu : ఈ రాశివారు ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి
Today Rasi Phalalu : నేటి రాశి ఫలాలు తేదీ 19.09.2023 మంగళవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ రాశి ఫలితం ఎలా ఉందో చూసుకోండి.
తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 19.09.2023, వారం: మంగళవారం, తిథి : చవితి నక్షత్రం : స్వాతి, మాసం : భాద్రపదం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేషరాశి
మేషరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. తల, కాళ్ళు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. వృత్తులో వారికి సమీప వ్యక్తుల సహకారం వలన అభివృద్ధి కలుగుతుంది. మిత్రులతో సంభాషించడం వలన మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటాయి. వాహనం ఇచ్చే విషయంలో జాగ్రత్తలు వహించండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
వృషభరాశి
వృషభరాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ భాగస్వామికి నచ్చకపోవచ్చు. ముఖ్యులతో సంభాషించేటప్పుడు అచి, తూచి వ్యవహరించడం మంచిది. స్త్రీలు క్రీడా, కళాత్మక పోటీల్లో రాణిస్తారు. ప్రముఖుల కలయికతో పనులు పూర్తవుతాయి. మీ సమస్య ఒకటి సానుకూలం కావటంతో మానసికంగా కుదుటపడతారు. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.
మిథునరాశి
మిథునరాశివారికి ఈ రోజు మీకు ఊహించని ఖర్చులు అధికం అగుట వలన ఆందోళన చెందుతారు. సోదరీ సోదరుల మధ్య ఏకీభవం కుదరదు. టి.వి. రేడియో రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది. మిమ్మల్ని హేళన చేసే వారు మీ సహాయాన్ని అర్ధిస్తారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. తలపెట్టిన పనులు విసుగు కలిగిస్తాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
కర్కాటకరాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి పంపకాలకు సంబంధించిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమగుతుంది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి పై అధికారులను మెప్పిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.
సింహరాశి
సింహరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకులు అధికం. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. ప్రస్తుత వ్యాపారాలపైనే దృష్టి సారించండి. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. రవాణా రంగాలలోనికి వారికి చికాకులు అధికమగుతాయి. హోల్‌సేల్ కంటే రిటైల్ వ్యాపారలే బాగుంటాయి. గృహమునకు కావలసిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక విషయంలో మిత్రులపై ఉంచిన మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. మరింత శుభఫలితాలు పొందాలంటే రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.
తులా రాశి
తులారాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది. వృత్తిపరమైన చికాకులు క్రమంగా తొలగిపోగలవు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఏకాగ్రత బాగా అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యులతో సంభాషించేటప్పుడు అచి తూచి వ్యవహరించడం మంచిది. 'పైవేటు సంస్థలలోని వారికి ఓర్చు, అంకితభావం చాలా ముఖ్యం. మరింత శుభఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.
ధనూ రాశి
ధనూరాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. స్త్రీల అనాలోచిన వ్యాఖ్యలు చర్చలు సమస్యలకు దారితీస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వల్ల అప్రమత్తత, ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
మకర రాశి
మకర రాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. మీ సంతానం మొండి వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా మాట్లాడండి. ఉద్యోగస్తుల (శ్రమకు గుర్తింపు లేకపోగా మాటపడవలసి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు ప్రణాళికలు రూపొందిస్తారు. మీరు చేసిన పనికి ప్రత్యుపకారం పొందుతారు. దేవీ ఉపాసన చేయడం మంచిది. రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.
కుంభ రాశి
కుంభరాశి వారికి ఈ రోజు మీకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ధనం ఎంతో కొంత పొదుపు చేయాలన్నమీ సంకల్పం నెరవేరదు. దంపతుల మధ్య దాపరికం అపార్జాలకు దారితీస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుండి ఒత్తిడి పెరుగుతుంది. సమయోచితంగా నిర్ణయం తీసుకుని ఒక సమస్యను అధిగమిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం తలపెదతారు. చిట్స్, ఫైనాన్స్, వ్యాపారులకు ఖాతాదారుల నుంది ఒత్తిడి అధికమగుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.