Today Rasi Phalalu : ఈ రాశి వారు తోటి ఉద్యోగులతో వాదనలను మానుకోవాలి-today horoscope in telugu check your astrology prediction on sunday 10th september 2023 ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Check Your Astrology Prediction On Sunday 10th September 2023

Today Rasi Phalalu : ఈ రాశి వారు తోటి ఉద్యోగులతో వాదనలను మానుకోవాలి

HT Telugu Desk HT Telugu
Sep 10, 2023 02:00 AM IST

Today Rasi Phalalu : ఈరోజు రాశి ఫలాలు తేదీ 10.09.2023 శనివారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

ఈరోజు రాశి ఫలాలు
ఈరోజు రాశి ఫలాలు (pixabay)

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 10.09.2023, వారం: ఆదివారం, తిథి : ఏకాదశి నక్షత్రం : హస్త, మాసం : శ్రావణం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

ట్రెండింగ్ వార్తలు

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. గృహ వాతావరణం అనుకూలం. జీవిత భాగస్వామి మరియు సంతానంతో గడపడానికి సమయం కేటాయిస్తారు. తగిన ఆదాయ వనరులు కలుగుతాయి. విద్యార్థులు సోమరితనాన్ని వీడి చదువులో ఆసక్తి చూపుతారు. మేషరాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు సుబ్రహ్మణ్యుని పూజించడం మరియు సూర్యభగవానుని ఆరాధించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. సూర్యాష్టకం చదువుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని తెలియ చేస్తున్నాను.

వృషభరాశి

వృషభరాశివారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. శుభవార్తలు వింటారు. సామాజిక జీవనం గౌరవప్రదంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. ప్రభుత్వం నుండి గౌరవము దక్కుతుంది. శతృజయం. మిత్రలాభం. స్నేహితుల వలన ధనయోగం. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది. వృషభరాశి వారు ఈరోజు క్రిష్టాష్టకం పఠించడం వల్ల వృషభరాశి వారికి మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మిథునరాశి

మిథునరాశివారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రమోషన్‌ లేదా వేతన పెంపు కలుగుతుంది. వృత్తి విషయాల్లో పైపుణ్యం, పురోగతి. ఆనందముగా గడుపుతారు. మంచి ఆరోగ్యం. సంపదలో వృద్ధి కలుగును. ధైర్య స్థానములో సూర్యుడు శత్రువులను అధిగమించడానికి మీకు కొత్త శక్తిని ఇస్తాడు. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. నాణ్యమైన వృత్తి వ్యాపార నైపుణ్యాలను ఇతరులతో సత్సంబంధాలు కొనసాగించడానికి మంచిది. తోటి ఉద్యోగులతో వాదనలను మానుకోవాలి. ఆర్థిక వనరులు పెరిగి లాభాల బాటలో ఉంటారు. ఇతరులకు తోచిన సహాయం చేస్తారు. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.

సింహరాశి

సింహరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. (గ్రహస్థితి సామాన్యం. బుధుని సంచారం వలన అనుకూలించును. విద్యార్థతలకు అనుకూలమైనటువంటి సమయం. మీ మాట తీరుతో అన్నింటా గెలుస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. సింహరాశివారికి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆర్యోగపరంగా జాగ్రత్తలు వహించాలి. మాతృవర్గంతో విభేదాలు ఏర్పడును. వ్యాపారంలో హెచ్చుతగ్గులుండును. సొంత వ్యాపారాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికం. స్త్రీలకు, విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు లాభదాయకరం. రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు సరైన సమయం. స్నేహితులు సహకరిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు కలుగును. తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మానసిక ప్రశాంతత. దూర ప్రాంతంలో భూమిని కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కలసివచ్చేటటువంటి రోజు. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహా ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు. జీవిత భాగస్వామితో అభిప్రాయఖేదాలేర్చడును. ఎక్కువ శ్రమ పడకుండా లాభాలు పొందుతారు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్ట్రకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. క్షీరాన్నాన్ని ఆలయాల్లో ప్రసాదంగా పంచడం మంచిది.

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. సమస్యలలో చిక్కుకుంటారు. ప్రయాణములో అవరోధములు. ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ విషయాలలో అసంతృప్తి. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. బంధువులు, పూర్వపు మిత్రుల కలియిక. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలించును. విద్యార్థులకు అనుకూల సమయం. ప్తీలకు మధ్యస్థం. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వలతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వ్యాపారం పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందముగా గడుపుతారు. ప్రీలకు, విద్యార్థులకు అనుకూల సమయం. రైతాంగం, రాజకీయ నాయకులకు కలసివచ్చేటటువంటి రోజు. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగును.

WhatsApp channel