Today Horoscope : వీరు లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి-today horoscope in telugu check your astrology prediction on friday 15th september 2023 ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Check Your Astrology Prediction On Friday 15th September 2023

Today Horoscope : వీరు లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి

నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు (pixabay)

Today Horoscope : నేటి రాశి ఫలాలు తేదీ 15.09.2023 శుక్రవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ రాశి ఫలితం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 15.09.2023, వారం: శుక్రవారం, తిథి : పాద్యమి పూర్తి, నక్షత్రం : ఉత్తర పూర్తి, మాసం : భాద్రపదం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

ట్రెండింగ్ వార్తలు

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. బంధువులతో ఆనందముగా గడుపుతారు. ఏ పని తలపెట్టినా జయం చేకూరుతుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారున్నారు జాగ్రత్తలు వహించండి. దైవదర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్షి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

వృషభరాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. భాగస్వామితో భేదాభిప్రాయములు కలుగును. అధికారులతో మాట్లేటడప్పుడు ఆచితూచి వ్యవహరించండి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

మిథున రాశి

మిథునరాశివారికి ఈ రోజు మీరు అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు మధ్యస్థంగా ఉంటుంది. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కొంటారు. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. ఒక స్థిరాస్తి అమర్చుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. మీ వాహనాలను ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి

కర్మాటక రాశివారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో పై అధికారుల మన్ననలు పొందెదరు. వ్యాపారస్తులకు లాభదాయకము. మీ కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు. ఆచి తూచి మాట్లాడాలి. దానివల్ల మీకు గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. స్రీలకు అనుకూలం. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నది. కుటుంబ సభ్యుతో ఆలయ సందర్భ్శనాలు చేస్తారు. సోదరుల మధ్య అనుబంధం మెరుగుపడుతుంది. మీ సంతానం విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరించండి. హోటల్‌, క్యేటరింగ్‌ రంగాలలో వారికి అభివృద్ధి. అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రులతో ఆనందముగా గడుపుతారు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని సూచన. స్రీలకు అంత అనుకూలంగా లేదు. స్రీలు పరిచిత వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వాహనం కొనుగోలు చేస్తారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. సభలు, సమావేశాలలో పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. విదేశీ ప్రయాణాలలో అడ్డంకులు తొలగిపోతాయి. స్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. దైవ, సేవా, పుణ్య కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావటంతో మానసిక ప్రశాంతత పొందుతారు. రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. ముఖ్యుల కోసం విరివిగా ధనవ్యయం చేస్తారు. ఎలక్టికల్‌, ఎలక్షానిక్‌, కంప్యూటర్‌ రంగాలవారికి పురోభివృద్ధి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు పనిలో చికాకులు, ఇబ్బందులు అధికమవుతాయి. విద్యుత్‌, రవాణా రంగాలలోని వారికి చికాకులు ఏర్పడతాయి. వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారులకు కలసివచ్చే సమయం. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. పుణ్య క్షేత్ర సందర్శనకు ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరించడం మంచిది. స్త్రీలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వృత్తిపరంగా ఆదాయం బాగుంటుంది దైవదర్శనం అతికష్టంమీద అనుకూలించును. బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారులకు వ్యాపారంలో అభివృద్ధి. ఖర్చులు భారమనిపించవు. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్తీలకు పనివారితో చికాకులు, ఇబ్బందులు కలుగు సూచన. అయినవారే సాయం చేసేందుకు వెనుకాడుతారు. మీ సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలపండి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

WhatsApp channel