Today Horoscope : ఈ రాశివారికి ఏలినాటి శని ప్రభావం.. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త
Today Horoscope : ఈరోజు రాశి ఫలాలు తేదీ 20.09.2023 బుధవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ రాశి ఫలితం ఎలా ఉందో చూసుకోండి.
తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 20.09.2023, వారం: బుధవారం, తిథి : పంచమి, నక్షత్రం : విశాఖ, మాసం : భాద్రపదం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
ట్రెండింగ్ వార్తలు
మేషరాశి
మేషరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. జన్మరాశియందు గురు రాహువులు ప్రభావం వలన పనుల్లో ఒత్తిళ్ళు ఉన్నప్పటికి మిగతా గ్రహాల అనుకూల ప్రభావంచేత వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలించును. చంద్రుని ప్రభావంచేత ఈరోజు మీరు చేసే పనుల్లో శ్రమకు తగిన ఫలితం లభించును. పనుల్లో చికాకులు, ఆలస్యం వంటివి కలగడం వలన వేదనకు గురవుతారు. విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నే? నర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
వృషభరాశి
వృషభరాశివారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. తృతీయ స్థానములో శుక్రుడు, చతుర్ధ స్థానములో బుధుడు, పంచమ స్థానములో కుజుడు, రవిల యొక్క అనుకూలత వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలసివస్తుంది. చంద్రుని ప్రభావం వలన మీరు చేసే పనుల్లో మీకు సత్ఫలితం కలుగుతుంది. వ్యాపారస్తులకు ఆర్థికపరంగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు తగిన ఫలితం లభిస్తుంది. భగవద్గీత వినడం, చదవడం వల్ల, కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి.
మిథునరాశి
మిథునరాశివారికి ఈ రోజు మీకు చంద్రుని ప్రభావం వలన అంత అనుకూలంగా లేదు. మీరు చేసే పనుల్లో మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. శతృ బాధ అధికముగా ఉండును. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.
కర్కాటకరాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. బుధవారానికి అధిపతి అయిన బుధుడు ధనస్థానములో ఉండటం చేత వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. భాతృ స్థానములో కుజుని ప్రభావం వలన భాతృ వర్గీయులతో జరుపు చర్చలు సఫలీకృతమగును. ఆరోగ్య మరియు కుటుంబ విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహరాశి
సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. జన్మరాశియందు రవి, బుధుల ప్రభావం అలాగే వ్యయస్థానము నందు శుక్రుని ప్రభావం వలన అధిక ఖర్చులు ఇబ్బందిపెట్టును. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు శారీరక శ్రమ, కుటుంబమునందు అశాంతి ఏర్చడు సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయం. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. లాభ స్థానములో శుక్రుడు, వ్యయస్థానములో బుధుడు ప్రభావం వలన అలాగే జన్మస్థానములో రవి ప్రభావంచేత కొంత ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు లాభదాయకం. ధనపరమనటువంటి సమస్యలు తొలగును. వృత్తి ఉద్యోగపరంగా కలసివచ్చును. శ్రీకృష్ణుడిని పూజించాలి. కృష్ణాష్టకం పఠించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్చించాలి. భగవద్గీత వినదం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
తులా రాశి
తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. జన్మరాశియందు కేతువు ప్రభావం వలన చేసే పనులయందు ఇబ్బందులు ఏర్పడును. రవి, బుధ, శుక్రుల అనుకూలత వలన ప్రయాణాలు కలసివచ్చును. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయి. అర్జ్భాష్టమ శని వలన పని ఒత్తిళ్ళు, చేసే పనులయందు ఇబ్బందులు కలుగును. అనారోగ్య సమస్యలు వేధించును. మిగతా గ్రహాల అనుకూలత వలన మీయొక్క కృషితో పట్టుదలతో మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు మధ్యస్థం. వ్యాపారస్తులకు అనుకూలం. విద్యార్థులకు కష్టపడవలసిన సమయం. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూరాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. తృతీయంలో శని అనుకూల ప్రభావం,పంచమంలో గురు, రాహువులు అనుకూలత వలన వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కలసివచ్చే స్థితి. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. ప్రయాణాలు కలసివస్తాయి. విద్యార్థులకు అనుకూలం. వ్యాపారస్థులకు శుభ ఫలితాలున్నాయి. వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
మకర రాశి
మకరరాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఏలినాటి శని అంత్య భాగములో ఉన్నప్పటికి, భాగ్యములో రవి, కుజుల ప్రభావం, కళత్రంలో శుక్రుని ప్రభావం, చతుర్ధస్థానములో గురు, రాహువుల అనుకూల స్ధితి వలన కుటుంబ సభ్యులతో ఆనందముగా ఉంటారు. ప్రయాణాలు కలసివస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. జన్మశని ఏలినాటి శని ప్రభావం వలన కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు వేధించును. చేసే పనుల్లో ఇబ్బందులు అధికముగా ఉండును. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా జాగ్రత్తలు వహించాలి. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయి. ఏలినాటి శని ప్రభావం వలన ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు అధికం. వ్యాపారస్తులకు అప్పులతో వ్యాపారం చేయవలసిన సమయం. అప్పులకు దూరంగా ఉ డాలి. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.