Today Horoscope : ఈ రాశివారు మూర్ఖపు వాదనలకు దూరంగా ఉండాలి.. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు-today horoscope in telugu check you zodiac sign prediction on monday 18th september 2023 ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Check You Zodiac Sign Prediction On Monday 18th September 2023

Today Horoscope : ఈ రాశివారు మూర్ఖపు వాదనలకు దూరంగా ఉండాలి.. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు

ఈరోజు రాశిఫలాలు
ఈరోజు రాశిఫలాలు

Today Horoscope : ఈరోజు రాశి ఫలాలు తేదీ 18.09.2023 సోమవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ రాశి ఫలితం ఎలా ఉందో చూసుకోండి.

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 18.09.2023, వారం: సోమవారం, తిథి : తదియ, నక్షత్రం : చిత్త, మాసం : భాద్రపదం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

ట్రెండింగ్ వార్తలు

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. బుధుడు రవితో కలసి పంచమ స్థానములో అనుకూలంగా ఉ౦డటంచేత సంతాన సౌఖ్యం. కుటుంబ సౌఖ్యం పొందెదరు. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా అనుకూలం. స్త్రీలకు అనుకూలమైన సమయం. విద్యార్థులకు కలసివచ్చే రోజు. మేషరాశివారు ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు మరియు ధనమును పొందెదరు.

వృషభరాశి

వృషభరాశివారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. రవి, బుధుల కేంద్రంలో అనుకూల ప్రభావంచేత వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. దశమంలో శని అనుకూల ప్రభావం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు ఈరోజు కలసివచ్చును. విద్యార్థులకు అనుకూలం. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.

మిథునరాశి

మిథునరాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. కేంద్రం నందు కుజుని ప్రభావం వలన ఒత్తిళ్ళు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కుటుంబములో సమస్యలు, మనస్పర్థలు వేధించును. ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థముగా ఉన్నది. మిథునరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. బుధుడు ధనస్థానములో ఉండటంచేత వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. భాతృ స్థానములో కుజుని ప్రభావం వలన భాతృ వర్గీయులతో జరుపు చర్చలు సఫలీకృతమగును. ఆరోగ్య మరియు కుటుంబ విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన మరియు పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. జన్మరాశియందు రవి, బుధుల ప్రభావం అలాగే వ్యయస్థానము నందు శుక్రుని ప్రభావం వలన అధిక ఖర్చులు ఇబ్బందిపెట్టును. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు శారీరక శ్రమ, కుటుంబమునందు అశాంతి ఏర్చడు సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయం. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు బుధుని ప్రభావం వలన అనుకూలమైన ఫలితాలు కలుగును. వ్యాపారస్తులకు వ్యాపారసంబంధమైన ఖర్చులు కలిగినప్పటికి లాభదాయకంగా ఉండును. ప్తీ సౌఖ్యం పొందెదరు. స్త్రీలకు కుటుంబములో సమస్యలు వేధించును. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. జన్మరాశియందు కేతువు, వ్యయస్థానమునందు కుజుని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడు సూచన. ఉద్యోగస్తులకు దశమంలో శుక్రుని ప్రభావం వలన అనుకూల ఫలితాలు కలుగును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికముగా ఉండును. ప్రయాణములు కలసివచ్చును. కుటుంబ సౌఖ్యం పొందెదరు. తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. బుధవారానికి అధిపతి అయిన బుధుడు దశమంలో రవితో కలసి అనుకూలంగా సంచరించడం వలన ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలం. లాభంలో కుజుని ప్రభావం వలన ప్తీలకు కుటుంబ సౌఖ్యం కలుగును. విద్యార్థులకు సత్ఫలితం కలుగును. వృశ్చికరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. గురుడు భాగ్యములో రవితో కలసి ఉండటం చేత వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉందును. స్త్రీలకు కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధించును. విద్యార్థులకు అన్ని విధాలుగా ఈరోజు కలసివచ్చును. శని మరియు గురు, రాహువుల అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధనూరాశివారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

మకరరాశి వారికి ఆయుః స్థానమందు రవి, బుధుల ప్రభావం వలన మనస్తాపమును శారీరక శ్రమ మరియు అనారోగ్యం కలుగు సూచన. ఆరోగ్య విషయాలయందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించండి. గురు, రాహువులు మరియు కుజుని అనుకూల ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి బుధుడు, రవితో కలసి కళత్రములో సంచరించుటచేత వ్యాపారస్తులకు సత్ఫలితాలు కలుగును. చంద్రుని అనుకూల ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. మూర్ఖపు వాదనలకు దూరంగా ఉండాలని సూచన. విద్యార్థులకు ఈరోజు కలసివచ్చును. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం కలుగును. కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. శత్రు స్థానములో రవి బుధుల సంచారం వలన నరఘోష అధికమగును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఏలినాటి శని ప్రభావం వలన అనవసర ధన వ్యయం కలుగును. వాక్‌ స్థానములో గురు, రాహువుల ప్రభావం వలన చర్చలకు, గొడవలకు దూరంగా ఉండాలి. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

WhatsApp channel