సెప్టెంబరు 9 రాశి ఫలాలు.. వీరు దశరథ ప్రోక్త శని స్తోత్రం చదవాలి
Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు తేదీ 09.09.2023 శనివారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 09.09.2023
వారం: శనివారం, తిథి: దశమి
నక్షత్రం: ఆరుద్ర, మాసం: శ్రావణం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేషరాశి
మేషరాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు చేసేటటువంటి పనులు సత్ఫలితాలు ఇస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా, ఆహ్లాదంగా గడుపుతారు. ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోరాదు. రాజకీయ నాయకులకు, స్త్రీలకు కలసివచ్చే సమయం. విద్యార్థులకు మధ్యస్థ సమయం. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం, సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు ఆనందకరమైన వాతావరణం. వ్యాపారస్తులకు అనుకూల సమయం. విద్యార్థులు మధ్యస్థం నుండి అనుకూలం. స్త్రీలు ఇష్టమైన వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు చేయుదురు. సోదరవర్గంతో ఆనందముగా గడిపెదరు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలం. వ్యాపారస్తులకు లాభాలతో కూడినటువంటి సమయం. స్త్రీలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. రైతాంగం, సినీరంగంవారికి మధ్యస్థ సమయం. విద్యార్థులకు అనుకూలం. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికి మీయొక్క ప్రణాళికలతో మీ పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు ధనపరమైనటువంటి సమస్యలను అధిగమించెదరు. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు. రైతాంగం, సినీరంగం వారికి మధ్యస్థ సమయం. విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి
సింహరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం ఉండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికం. వ్యాపారస్తులకు ఖర్చులు అధికం. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం, సుప్రభాతం వినడం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కలసివచ్చును. ఖర్చులు అధికమగును. నూతన వస్తువుల కోసం మీ యొక్కధనాన్ని వృథా చేసేదరు. ఉద్యోగస్తులకు అనుకూలం. వ్యాపారస్తులకు లాభదాయకం. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది.
తులా రాశి
తులారాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా ఉన్నది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చేసే ప్రతి పని కలసివచ్చును. పైఅధికారుల మన్నననలు పొందెదరు. వ్యాపారస్తులకు లాభదాయకం. స్త్రీలకు మధ్యస్థం సమయం. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోరాదు. విద్యార్థులకు కలసివచ్చేటటువంటి రోజు. రైతాంగం, సినీరంగం, రాజకీయ రంగం వారికి కలిసివచ్చే రోజు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. పనుల్లో ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసెదరు. పై అధికారులతో మన్ననలు పొందెదరు. వ్యాపారస్తులు శుభవార్తలు వింటారు. స్త్రీలకు అనుకూలం. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థము నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబ మరియు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికి పనులు సకాలంలో పూర్తి చేయుదురు. వ్యాపారస్తులకు లాభదాయకం. రైతాంగం, సినీరంగం వారికి కలసివచ్చే రోజు. వేంకటేశ్వరస్వామిని పూజించడం, సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్ళు, ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడును. రైతాంగానికి ప్రతికూల సమయం. విద్యార్థులకు మధ్యస్థం సమయం. ఆరోగ్య మరియు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. దత్తాత్రేయ దర్శనం శుభప్రదం. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. చికాకులు, సమస్యలు అధికము. ఆచితూచి వ్యవహరించాలి. అప్పులు చేయడం, అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు అధికం. రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. వ్యాపారస్తులు ధనపరమైనటువంటి విషయాల్లో జాత్రలు వహించాలి. రావలసిన ధనము సమయానికి చేతికి అందదు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. గొడవలకు దూరంగా ఉండాలి. ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చికాకులు కలుగుతాయి. స్నేహితులు కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు చెడు సమయం. స్త్రీలకు అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. అప్పులకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000