Today Horoscope : నేటి రాశిఫలాలు : ఈరోజు దత్తాత్రేయుని ఆరాధిస్తే.. పలు రాశులవారికి మంచిది..-today horoscope in telugu based on career and life for 15th september 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 15th September 2022

Today Horoscope : నేటి రాశిఫలాలు : ఈరోజు దత్తాత్రేయుని ఆరాధిస్తే.. పలు రాశులవారికి మంచిది..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 15, 2022 06:24 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? సెప్టెంబర్ 15వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలితాలు
నేటి రాశిఫలితాలు

Today Horoscope : నేటి రాశిఫలాలు (15-09-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

మేష రాశిఫలం

మేషరాశివారికి ఈ రోజు మధ్యస్తంగా ఉంది. ద్వితీయంలో కుజుని ప్రభావం ఉంటుంది. వాగ్వాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ధన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

వృషభ రాశిఫలం

ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. అవసరాల కోసం ధనమును ఖర్చు చేసెదరు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించుట మంచిది. ఈ రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది.

మిథున రాశిఫలం

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. అష్టమ శని ప్రభావం చేత ప్రతీ పనియందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ వ్యవహారాలయందు జాగ్రత్తలు వహించాలి. దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది.

కర్కాటక రాశిఫలం

ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. అనుకున్న ప్రతీ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి, అనుకూలత పొందెదరు. ఈ రోజు దక్షిణామూర్తిని పూజిస్తే ఇంకా మంచిది.

సింహ రాశిఫలం

ఈ రోజు మీకు మధ్యస్తంగా ఉన్నది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ప్రతి విషయమునందు ఆచితూచి వ్యవహరించండి. ఈ రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది.

కన్య రాశిఫలం

ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. పనులను చాకచక్యముతో పూర్తి చేస్తారు. ఈ రోజు దక్షిణామూర్తిని పూజించడం వలన ఆర్ధిక సమస్యలు తొలగుతాయి. ధనలాభ సూచన.

తుల రాశిఫలం

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ధనలాభం, వస్తులాభం కలుగే సూచనలు కనిపిస్తున్నాయి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశిఫలం

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. చేసే ప్రతీ పనియందు విజయము పొందుతారు. ధనలాభము, కీర్తి లాభము కలదు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలమైన రోజు.

ధనుస్సు రాశిఫలం

ఈరోజు చేసే ప్రతీ పనిలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మనస్సుని నియంత్రణలో ఉంచుకుంటే మంచిది. మరింత శుభ ఫలితాల కోసం ఈరోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది.

మకర రాశిఫలం

ఈ రోజు మీకు అనుకూల ఫలితముగా ఉన్నది. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ఏలినాటి శని ప్రభావంచేత పనుల యందు కొంత జాప్యం జరుగును. శత్రువర్గంతో జాగ్రత్తలు వహించాలి. ఈరోజు దత్తాత్రేయుని ఆరాధించడం వలన విజయము పొందెదరు.

కుంభ రాశిఫలం

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. ధన విషయంలో జాగ్రత్త వహించాలి. ఏలినాటి శని ప్రభావంచేత పనులలో కొంత ఇబ్బందులు కలుగును. మానసిక ధైర్యంతో ముందుకు సాగుతారు. ఈరోజు దక్షిణామూర్తిని పూజించాలి.

మీనం రాశిఫలం

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. చేసే ప్రతీ పనియందు విజయము పొందుతారు. ఖర్చులు తగ్గించుకొనుట మంచిది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఈరోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది.

<p>చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ</p>
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్