ఆగస్ట్ 24, నేటి రాశి ఫలాలు.. ఊహించని ఖర్చులు, ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి-today horoscope august 24th rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఆగస్ట్ 24, నేటి రాశి ఫలాలు.. ఊహించని ఖర్చులు, ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి

ఆగస్ట్ 24, నేటి రాశి ఫలాలు.. ఊహించని ఖర్చులు, ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి

HT Telugu Desk HT Telugu
Aug 24, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ24.08.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆగస్ట్ 24 నేటి రాశి ఫలాలు
ఆగస్ట్ 24 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 24.08.2024

వారం: శ‌నివారం, తిథి : పంచ‌మి,

నక్షత్రం: అశ్వ‌నీ, మాసం : శ్రావ‌ణ‌ము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. స‌మాజంలో పలుకుబడి పెరుగుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. స్థిరాస్తుల ద్వారా ఆదాయం సమకూ రుతుంది. కొత్త పనులు ప్రారంభించకుండా, చేతిలో ఉన్నవాటిని పూర్తి చేయడంపై దృష్టి సారించండి. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం ఉంది. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉండండి. స్నేహితులతో చర్చల సందర్భంగా సంయమనం పాటించడం అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

వృషభం

పనులు సజావుగా సాగుతాయి. రావలసిన సొమ్ము స‌మ‌యానికి చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల అండదండలు ఉంటాయి. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉన్నప్పటికీ ఖర్చులు అధికమవుతాయి. బంధుమిత్రులతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.

మిథునం

ప్రయాణాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదలతోపాటు సంయమనం అవసరం. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. సహోద్యోగుల సహకారంతో పనులు నెరవేరుతాయి. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. శివాలయాన్ని సందర్శించండి.

క‌ర్కాట‌కం

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి విద్యార్థులకు మంచి సమయం. శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. రాబడి పెరుగుతుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. అధికారులతో స్నేహపూర్వక వాతావరణం నెల కొంటుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. ఊహించని ఖర్చులు ముందుకురావచ్చు. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వివాహ‌ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.

సింహం

రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో కలిసి వస్తుంది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. కళాకారులకు అవకాశాలు లభిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేపీ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో మంచి సంబంధాలు ఉంటాయి. వాహనం, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందులకు హాజరవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గణపతి ఆలయాన్ని సందర్శించండి.

కన్య

తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. అదృష్టం కలిసివస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవాళ్లు శుభవార్త వింటారు. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు నిర్వి ఘ్నంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొం టారు. కొన్ని అనాలోచిత నిర్ణయాలతో చికాకులు కలుగుతాయి. విద్యార్థుల విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. సూర్యారాధన మేలు చేస్తుంది.

తుల

బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు, సాహితీవేత్తలకు అనుకూలం. కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. సాంస్కృ తిక కార్యక్రమాలకు హాజరవుతారు. పనులు పూర్తి కావడంలో జాప్యం జరగవచ్చు. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు పై అధికారులతో అభిప్రాయభేదాలు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. శివాలయాన్ని సందర్శించండి.

వృశ్చికం

విద్యార్థులు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరుతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. వివాహాది శుభకార్యాలను చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. రోజువారీ వ్యాపారం సజావుగా సాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహనిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.

ధనుస్సు

అధికారుల ఆదరణ లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. పదోన్నతి కారణంగా స్థానచలనం ఉంటుంది. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు అదృష్టం కలిసి వస్తుంది. సంతృప్తిగా ఉంటారు. భూమి కొనుగోలు చేస్తారు. తీర్థ‌యాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వేంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం.

మకరం

కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. భూ వ్యవహారంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులతో కార్యసిద్ధి ఉంది. రోజువారీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పనులలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదలతో పనులు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

కుంభం

ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. భూముల కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆస్తుల తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.

మీనం

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలి స్తాయి. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ, పనులు నెరవేర్చు కుంటారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయపరమైన కార్యక్రమాల్లో విజయం వరిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.