ఆగస్ట్ 22, నేటి రాశి ఫలాలు.. ఏ రాశి వాళ్ళు ఏ స్తోత్రం పఠిస్తే మంచిదో తెలుసుకోండి-today horoscope august 22nd 2024 rasi phalalu in telugu check your zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఆగస్ట్ 22, నేటి రాశి ఫలాలు.. ఏ రాశి వాళ్ళు ఏ స్తోత్రం పఠిస్తే మంచిదో తెలుసుకోండి

ఆగస్ట్ 22, నేటి రాశి ఫలాలు.. ఏ రాశి వాళ్ళు ఏ స్తోత్రం పఠిస్తే మంచిదో తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu
Aug 22, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ22.08.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆగస్ట్ 22 నేటి రాశి ఫలాలు
ఆగస్ట్ 22 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన‌ ఫలం) 22-08-2024

వారం: గురువారం, తిథి : త‌దియ‌

న‌క్ష‌త్రం: ఉత్తరాభాద్ర, మాసం: శ్రావ‌ణ‌ము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

నూత‌న కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. చేప‌ట్టిన ప‌నుల‌ను స‌మయానుగుణంగా పూర్తి చేస్తారు. స‌మాజంలో విశేష గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. సోదరులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. విద్యార్థులకు ఉత్త‌మ ఫ‌లితాలు అందుతాయి. ఆనందంగా గ‌డుపుతారు. వాహన సౌఖ్యం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులకు తగిన సమయం ఇది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి పట్టింద‌ల్లా బంగారమే. ఎరువు, నేరేడు రంగులు ధ‌రిస్తే శుభ ఫ‌లితాలు అందుతాయి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృషభం

వృష‌భ రాశి వారికి ఫ‌లితాలు అంతంత‌మాత్రంగా ఉన్నాయి. చేప‌ట్టిన ప‌నులను అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేయ‌డానికి స‌త‌మ‌త‌మవుతారు. కీల‌క‌ ప‌నులు కాస్త నెమ్మదిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు కాస్త‌ తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. ధన వ్యయం. గులాబీ, పసుపు రంగులు ధ‌రించండి. ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు బంధువులతో ముఖ్య విషయాలపై చర్చలు జ‌రుపుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. యుక్తితో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కుటుంబంలో స్వ‌ల్ప సమస్యలు ఉండొచ్చు. అనారోగ్య ప‌రిస్థితులు ఉన్నాయి. నీలం, ఆకుపచ్చ రంగులు శుభ ఫ‌లితాలు అందిస్తాయి. ఆదిత్య హృదయం పఠించండి. మంచి జ‌రుగుతుంది.

కర్కాటకం

ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. పట్టుదల, కృషితో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. సోదరుల నుంచి ఆస్తిలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూములు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు చేస్తారు. ఆరోగ్యం విష‌యంలో ఒకింత జాగ్ర‌త్త అవ‌స‌రం. ప‌నుపు, నేరేడు రంగులు ధ‌రించండి. విష్ణుధ్యానం చేయండి. మ‌న‌శ్శాంతి లభిస్తుంది.

సింహం

కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. గతంలో జరిగిన కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు ఉన్నాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం ఉంది. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి. ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండండి. పసుపు, ఆకుపచ్చ రంగులు సత్ఫ‌లితాలు అందిస్తాయి. కనకధారా స్తోత్రాలు పఠించండి. మంచి జ‌రుగుతుంది.

కన్య

పనుల్లో జాప్యం త‌గ‌దు. కీల‌క ప‌నులు వాయిదా వేస్తారు. ముఖ్య విష‌యాల్లో నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పకపోవచ్చు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు అధికంగా ఉన్నాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు ఎదురు కావ‌చ్చు. శ్రమకు త‌గిన‌ ఫలితం కనిపించదు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఆశించిన పెట్టుబడులలో అవాంతరాలు ఉన్నాయి. కళాకారులకు చికాకులు ఉన్నాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఓ శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. గులాబీ, పసుపు రంగులు ధ‌రించండి. శివాష్టకం పఠించండి. సత్ఫ‌లితాలు అందుతాయి.

తుల

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. శుభవార్తాలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కరించుకుంటారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావ‌ర‌ణం ఉంటుంది. రాజకీయ వర్గాలకు చిక్కులు తొలగుతాయి. గులాబీ, ఆకుపచ్చ రంగులు. శివాష్టకం పఠించండి.

వృశ్చికం

ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. భూములు, వాహనాలు కొంటారు. ఆనుకోని ఆహ్వానాలు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగుల‌కు ఉన్నతహోదాలు దక్కే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఆకుపచ్చ, నేరేడు రంగులు అనుకూలిస్తాయి. ఆదిత్య‌ హృదయం పఠించండి. శుభ ఫ‌లితాలు ఉన్నాయి.

ధనుస్సు

పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు కొంత కలసివస్తాయి. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ప్ర‌యాణాల వ‌ల్ల‌ వ్యయప్రయాసలు త‌ప్ప‌క పోవ‌చ్చు. మిత్రులతో వివాదాలు ఉండొచ్చు. ఎరుపు, నేరేడు రంగులు అనుకూల ఫ‌లితాలు అందిస్తాయి. అంగారక స్తోత్రాలు పఠించండి.

మకరం

ముఖ్యమైన పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. విద్యార్థుల్లో పట్టుదల పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. ఆకుపచ్చ రంగు ధ‌రించండి. హ‌నుమాన్ చాలీసా ప‌ఠించండి.

కుంభం

ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయంతో పనులు చక్కదిద్దుతారు. భూములు, వాహనాలు కొంటారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో కొన్ని సమస్యలు అధిగమిస్తారు. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చికాకులు తొందుతారు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. నీలం, ఆకుపచ్చ రంగులు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మంచి జ‌రుగుతుంది.

మీనం

నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరతాయి. ఎటువంటి బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. భూములు కొనుగోలు యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. గులాబీ, లేత ఎరుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కార్య‌సిద్ధి ఉంది.

ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ