ఆగస్ట్ 21, నేటి రాశి ఫలాలు.. వీరికి డబ్బు చేతికి అందక అప్పులు చేయాల్సి వస్తుంది-today horoscope august 21st rasi phalalu in telugu check your zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఆగస్ట్ 21, నేటి రాశి ఫలాలు.. వీరికి డబ్బు చేతికి అందక అప్పులు చేయాల్సి వస్తుంది

ఆగస్ట్ 21, నేటి రాశి ఫలాలు.. వీరికి డబ్బు చేతికి అందక అప్పులు చేయాల్సి వస్తుంది

HT Telugu Desk HT Telugu
Aug 21, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ21.08.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆగస్ట్ 21 నేటి రాశి ఫలాలు
ఆగస్ట్ 21 నేటి రాశి ఫలాలు (pixabay)

నేటి రాశి ఫలాలు (దిన‌ ఫలం) 21-08-2024

వారం: బుధవారం, తిథి : కృష్ణ పక్ష తదియ

మాసం: శ్రావ‌ణ‌ము, సంవత్సరం: శ్రీ క్రోధి నామ,

ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

మేష‌ రాశి వారికి ఈ వారంలో ప్రయత్నకార్య అనుకూలతలు ఉంటాయి. ఖర్చులకు అనుగుణంగా ఆదాయం ఉంటుంది. కీల‌క స‌మయాల్లో ధ‌నం స‌ర్దుబాటు అవుతుంది. ఆరోగ్యం బావుంటుంది. సంతానంలో ఒకరికి శుభము క‌లుగుతుంది. కీలక విష‌యాల్లో సమాచారం సేక‌రిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడులున్నా త‌ట్టుకుని నిల‌బ‌డ‌తారు. వ్యాపారులు చెల్లింపులు చేసుకుంటారు. భ‌విష్య‌త్తుకోసం నూత‌న ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశి వారికి గురు, శుక్ర, శని, ఆది, సోమ వారములు అనుకూలంగా ఉన్నాయి. సూర్యారాధ‌న మేలు చేస్తుంది.

వృష‌భం

ఈ వారంలో శారీరక అసౌకర్యములు, తరచూ ఒత్తిడికి గురి కావడం ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీదైన విధానంలో ప్రయాణం చేయగలుగుతారు. వస్తు జాగ్రత్తలకు ప్రాధాన్యత ఇచ్చుకోండి. సంతానపు తీరు, మీ ఆలోచనలు ఒకటయ్యేటట్లు జాగ్రత్తలు అవసరం. ఖర్చులు, ఆదాయం ఒకే విధంగా ఉంటాయి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు నియంత్రించుకోండి. విరోధుల‌కు దూరంగా ఉండండి. శని, ఆది, సోమ, బుధ వారములు అనువైనవి. హ‌నుమాన్ చాలీసా పఠించండి. మంచి జ‌రుగుతుంది.

మిథునం

ఈ వారంలో మనో ధైర్యములు చూపి వ్యవహరించుకోలేకపోతారు. స్థిరాస్తుల విక్రయ ఆలోచనలు అమలు చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగాలు ఆశాజ‌న‌కంగా ఉండ‌వు. కుటుంబ వ్యక్తులతో సాధారణ స్థితులు ఉంటాయి. నిరుద్యోగులు అవకాశాలు జార విడవకుండా జాగ్రత్త వహించుకోవాలి. వాహన, యంత్రాదుల మార్పులకై ఆలోచనలు చేసుకొంటారు. వారమంతా సాధారణ జాగ్రత్తలు అవసరం. అమ్మవారి ద‌ర్శ‌నం మేలు చేస్తుంది.

క‌ర్కాట‌కం

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మంచి అనుభూతులు, అభినందనలు పొందుతారు. నిత్యకృత్యముల్లో మంచి మార్పులకు శ్రీకారం చుట్టగలరు. ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకొంటారు. నూతన విషయాల పట్ల, వ్యక్తుల పట్ల అవగాహనలకు సరైన సమయం తీసుకోండి. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు వేతనవృద్ధి ఉంటాయి. అవివాహితులకు శుభాలు ఏర్పడగలవు. గురు, శుక్ర, శని వారములు అనువైనవి. ల‌లితాస‌హ‌స్ర నామం పఠించండి. కీల‌క ప‌నులు త్వ‌రితగ‌తిన పూర్త‌వుతాయి.

సింహం

సింహ రాశి వారికి ఎప్ప‌టిలాగానే మానసిక ఉత్సాహాలు, కుటుంబ సౌఖ్యం కొనసాగుతాయి. వృత్తి, ఉద్యోగాల పట్ల అంకిత భావాలు చూపి వ్యవహరించుకోగలరు. అధికారులచే ఒత్తిడులు చికాకుపరచగలవు. రుణాలు చేయవలసి రావచ్చు. వసూలవుతాయనుకొన్న డ‌బ్బు చేతికి అంద‌కపోవ‌చ్చు. కీల‌క ప‌నులు వాయిదా పడగలవు. కొన్ని పనులు వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య భావనలు వెంటాడు సూచనలు గలవు. వద్దనుకొన్నవారితో సంభాషణలు తప్పక పోవచ్చు. శని, ఆది, సోమ వారాలు అనువైనవి. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యాన్ని సంద‌ర్శించండి.

క‌న్య‌

ఈ వారంలో కుటుంబ స‌భ్యుల‌ సహకారాలుంటాయి. కొన్ని నిర్ణయాలు మానసిక ఒత్తిడులకు గురి చేయగలవు. ఆర్థికంగా బావుంటుంది. నిద్రలేని రాత్రుళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇతరుల విషయాలచే మానసిక ఒత్తిడులు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు ఉంటాయి. పోటీ పరీక్షలకు యత్నించుకొనువారు ఏకాగ్రచిత్తులై సాగాలి. గురు, శుక్ర, బుధ వారములు అనువైనవి. శివాల‌యాన్ని సంద‌ర్శించండి. మేలు జ‌రుగుతుంది.

తుల‌

కుటుంబ స‌భ్యుల‌తో ఉత్సాహంగా ఉంటారు. అన్ని విష‌యాల్లో పాలుపంచుకొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆలోచనలందు మంచి మార్పులు చేయగలరు. మీ సహాయంకోసం ఎదురుచూచు వారికి సాదరంగా సహకరించగలుగుతారు. ఆర్భాటాలకు కొంత మొత్తం ఖర్చు చేయవలసి రావచ్చును. అధికారులతో సామాన్య స్థితులు నెల కొంటాయి. వృత్తి, వ్యాపారాల్లో క్రమంగా అనుకూల స్థితులు ఏర్పరచుకొంటారు. శని, ఆది, సోమవారములు అనువైనవి. సుబ్ర‌హ్మ‌ణ్య స్వామిని ఆరాధించండి.

వృశ్చికం

ఈ వారంలో గ్రహసంచారములు మూడొంతులు అనుకూలం. తలపెట్టుకొన్న పనులు అనుకూలి స్తాయి. స్థిరాస్తులవంటి క్రయవిక్రయాలు పూర్తిచేసుకొంటారు. కుటుంబ వ్యక్తుల సహకారాలుంటాయి. ఊహించుకొన్న వివాహ విష యాల్లో కదలికలు అంతంతమాత్రంగా ఉంటాయి. నూతన వ్యాపార వ్యవహారాల్ని ప్రారంభించగల్గుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఏర్పడగలవు. వీరికి గురు, శుక్ర, బుధ వారములు అనువైనవి. శ్రీ‌వారి ద‌ర్శ‌నం శుభ‌ప్ర‌దం.

ధ‌న‌స్సు

ఈ వారంలో గ్రహసంచారాలు అనుకూలమైనా కొన్ని ప్రతికూల స్థితులను చూడవలసిరావచ్చును. ఖర్చులు కొన్ని అదనంగా ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో చిన్న తరహా జాగ్రత్తలు అవసరం. ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చును. కొన్ని చెల్లింపులను వాయిదా వేసుకోవలసిరావచ్చును. ఉద్యోగాల్లో అధి కారులతో సంయమనాలు అవసరం. విద్యార్థుల పోటీపరీక్షల్లో రాణించ గలుగుతారు. గురు, శుక్ర, శని, ఆదివారములు అనువైనవి. గ‌ణ‌ప‌తి ఆల‌యాన్ని సందర్శించండి.

మక‌రం

అనుకున్న‌ పనులు అంతరాయాలతో సాగుతాయి. కుటుంబ విషయాలలో సంయమనాలు అవసరం. స్థిరాస్తుల వ్యవహారాల్లో నూతన ఆలోచ నలు చేసుకొంటారు. ఉద్యోగాల్లో ఒత్తిడిని దూరం చేసుకోగలరు. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనలలో మార్పుచేర్పులుంటాయి. దూర ప్రయాణాల్ని ప‌ట్టుకోగలరు. అనాలోచిత వాగ్విషయాలచే బంధువులతో మాట పట్టింపు లేర్పడతాయి. వారమంతా సామాన్య అనుకూలతలు ఉంటాయి. హ‌నుమాన్ ద‌ర్శ‌నం మంచి ఫ‌లితాలు అందిస్తుంది.

కుంభం

నేటి రాశి ఫలాల ప్రకారం ఈ వారంలో గత ఇబ్బందులలో కొన్నిటిని దూరం చేసుకోగల్గుతారు. ఊహించుకొన్న వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెంచుకోగలరు. ఆర్థికంగా ఒకింత మంచిని పొందుతారు. ఆధ్యాత్మికతలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి సాగగలరు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆశించినవి పొందుతారు. స్వల్ప ఆర్థిక వృద్ధిని పొందుతారు. వీరికి గురు, శుక్ర వారముల్లో అన్ని విషయాలలో జాగ్రత్తలు అవసరం. ద‌క్షిణామూర్తిని ప్రార్థించండి. మంచి జ‌రుగుతుంది.

మీనం

ఈ వారంలో ఊహించుకొన్నవి మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు చికాకుపరచ గలవు. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడులు పెరిగి తొందరపాటుతనములు ఏర్పడు సూచనలు గలవు. ఇంటా బయటా మీ మాటకు వ్యతిరేకములు పెరుగు సూచనలున్నాయి. ప్రయాణాలు సౌకర్యవంతంగా సాగి ఉత్సాహమును ఏర్పరచగలవు. స్థిరాస్తి వ్యవహారాల్లో కదలికలు ఉత్సాహపరుస్తాయి. శని, ఆది, సోమ వారాలలో అన్నిటా జాగ్రత్తలు అవసరం. దుర్గాదేవిని ఆరాధించండి. స‌త్ఫ‌లితాలు అందుతాయి. ఆనంద‌మ‌య జీవితం ఆస్వాదిస్తారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ