ఏప్రిల్ 15, నేటి రాశి ఫలాలు.. ఈ ఐదు రాశుల వాళ్ళకి ఇబ్బందులు, వ్యాపారంలో సమస్యలు-today horoscope april 15th 2024 rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 15, నేటి రాశి ఫలాలు.. ఈ ఐదు రాశుల వాళ్ళకి ఇబ్బందులు, వ్యాపారంలో సమస్యలు

ఏప్రిల్ 15, నేటి రాశి ఫలాలు.. ఈ ఐదు రాశుల వాళ్ళకి ఇబ్బందులు, వ్యాపారంలో సమస్యలు

HT Telugu Desk HT Telugu
Apr 15, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ15.04.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 15, నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 15, నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 15.04.2024

వారం: సోమవారం, తిథి : సప్తమి

నక్షత్రం : పునర్వసు, మాసం : చైత్రం

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల సమయం. చాలాకాలంగా పూర్తికాని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. ప్రభుత్వ అధికారులతో పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. బంధువులతో అభిప్రాయభేదములు ఏర్పడు సూచనలున్నాయి. దీర్ఘకాలిక రుణబాధల నుండి క్రమంగా బయటపడతారు. మేష రాశివారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం శివపంచాక్షరీ మంత్రంతో శివుడిని అభిషేకించడం, పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. బంధుమిత్రులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం చంద్రశేఖర అష్టకం పఠించడం మంచిది. శివాలయాన్ని దర్శించడం వల్ల ప్రశాంతత లభించును.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొన్ని సమస్యల పరిష్కారంలో ముందడుగు వేస్తారు. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ధనవ్యయ సూచనలున్నాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివాలయాన్ని దర్శించి పుణ్యనదీ (గంగ, గోదావరి, కృష్ణ కావేరీ) జలాలతో అభిషేకం చేయటం మంచిది.

కర్కాటక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. అన్ని రంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. బిల్వపత్రాలతో శివున్ని పూజించండి. బిల్వాష్టకం పఠించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది లేదు. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు తప్పవు. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారస్తులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చుట్టు ప్రక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. దూరప్రయాణ సూచనలున్నాయి. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యనారాయణ మూర్తికి తర్పణాలు వదలండి. లింగాష్టకాన్ని పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన గృహ నిర్మాణానికి సకాలంలో ధనం అందుతుంది. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచామృతాలతో శివాభిషేకం చేసుకోవడం మంచిది. శివపురాణం పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. స్థిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. తెలివితేటలతో దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివాష్టకం పఠించండి. శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, శివారాధన మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండదు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదాపడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అధికమవుతాయి. అన్ని రంగాల వారికి కొత్త సమస్యలు తప్పవు. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో అభిప్రాయభేదములేర్పడును. కుటుంబ వ్యవహారాలు కొంత మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆర్థికంగా అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివారాధన చేయాలి. బిల్వాష్టకము పఠించటం మంచిది.

మకర రాశి

నేటి రాశి ఫలాలు మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆత్మీయులతో ఆనందముగా గడుపుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. అధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అనుకూల సమయం. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. కుంభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం బిల్వాష్టకం పఠించండి. శివారాధన చేయండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. రుణప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహానికి సంబంధించిన విషయంలో ఓర్పు వ్యవహరించండి. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారస్తులకు మధ్యస్థం. సోదరుల నుంచి ధన సాయం అందుతుంది. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుడిని పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel