ఏప్రిల్ 11, నేటి రాశి ఫలాలు.. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది-today horoscope april 11th 2024 rasi phalalu in telugu check your zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 11, నేటి రాశి ఫలాలు.. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది

ఏప్రిల్ 11, నేటి రాశి ఫలాలు.. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది

HT Telugu Desk HT Telugu
Apr 11, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ11.04.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 11, నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 11, నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 11.04.2024

yearly horoscope entry point

వారం: గురువారం, తిథి : తదియ,

నక్షత్రం : కృత్తిక

మాసం : చైత్రము

సంవత్సరం: క్రోది నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆప్తులతో సంభాషిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పిల్లల చదువులపై మరింత శ్రద్ద వహించాలి. కీలక పత్రాలు అందుకుంటారు. అలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు విపరీతమగును. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగపరంగా అనుకూలించును. నిరుద్యోగులు ఆశించిన దానికంటే ఎక్కువ శుభవార్తలు వింటారు. ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో అధికారయోగమున్నది. వృత్తి వ్యాపారాలు మధ్యస్థముగా ఉంటాయి. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలిస్తాయి. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. వాహనయోగముంది. వస్త్రప్రాప్తి. పరిచయాలు బలపడతాయి. పనులు వేగవంతమవుతాయి. వివాహ ప్రయత్నం ఫలిస్తుంది. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. మీ సిఫార్సుతో ఒకరికి మంచి జరుగుతుంది. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటకరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. చిన్న విషయాలకే అందోళన చెందుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు అధికమగును. అకాలభోజనం. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పత్రాలు అందుకుంటారు. సంతానం చదువులపై శ్రద్ద వహిస్తారు. అరోగ్య సమస్యలు తగ్గును. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీరామరక్షాస్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో విభేదాలేర్పడును. కొత్త సమస్యలు ఎదురేయ్య సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా జాగ్రత్తగా వహించాలి. సహనంగా వ్యవహరించాలి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సింహరాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా సత్ఫలితాలున్నాయి. ఉద్యోగంలో దూరప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశముంది. తోబుట్టువులకు అండగా నిలబడతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు కలసివస్తాయి. బంధువులతో అస్తి సంబంధమైన సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. మిత్రుల సహాయంతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శంకరాచార్య విరాచిత దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

తులా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. కొత్త పనులు చేపడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ జోక్యం అనివార్యం. ఖర్చులు అదుపులో ఉండవు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. అపరిచితులతో మితంగా సంభాషించండి. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్చించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. అరోగ్యం పట్ల జాగ్రత్త వహించలి. ఇంటి విషయాలపట్ల జాగ్రత్త వహించాలి. ఖర్చులు భారమనిపించవు. పెట్టుబడులకు మంచిది కాదు. ఫోన్‌ సందేశాలను నమ్మవద్దు. వృశ్చికరాశి మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలు ఊహించనట్లే జరుగుతాయి. మీ అభిప్రాయాలను తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తారు. మీ సొంత విషయాలలో ఇతరుల జోక్యం పనికిరాదు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆలోచనాలు కార్యరూపం దాల్చుతాయి. ఒక మంచి అవకాశాన్ని వదులుకుంటారు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం శ్రీరామరక్షాస్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. అందరితో మంచి సంబంధాలు నెలకొంటాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. పురస్కారాలు అందుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు డబ్బు ఖర్చు చేస్తారు. మాట నిలబెట్టుకుంటారు. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దత్తాత్రేయుడిని పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. బంధువుల వైఖరి అసహనం కలిగిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. సామరస్యంగా మెలగండి. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పత్రాలు అందుకుంటారు. వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రతి చిన్నదానికి అసహనం చెందుతారు. కుంభరాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుడిని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు అధికమగును. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. అప్రమత్తంగా ఉండాలి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పఠించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner