అక్టోబర్ 31, నేటి రాశి ఫలాలు- దీపావళి రోజు ఈ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ31.10.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 31.10.2024
వారం: గురువారం, తిథి : చతుర్దశి,
నక్షత్రం: చిత్త, మాసం : అశ్వయుజము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
మానసికమైన ఒత్తిడితో తొందరపాటుతోకూడిన పనులవల్ల శ్రమ, ధనము వంటివి ఎక్కువ ఖర్చుచేయవలసి రావచ్చు. బంధుమిత్రులు మొహం చాటువేయు సూచనలున్నాయి. ఆరోగ్యపరంగా ఔషధ సేవలు అవసరమవుతాయి. అవకాశాల్ని జారవిడుచుకుంటారు. కుటుంబ వ్యక్తుల తీరు సమిష్టిగా లేక ఇతరులకు అవకాశాలిచ్చు సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల్లో బాధ్యతాయుతంగా సాగండి.
వృషభం
ప్రయత్న కార్యాలను వేగవంతం చేసుకోగలరు. అవకాశాలు కలిసివస్తాయి. ఇతరుల వ్యాఖ్యానాలను అంతంత మాత్రంగా తీసుకుంటూ స్వనిర్ణయాలకే ప్రాధాన్యతనిచ్చుకోండి. ఖర్చులకు తగిన ఆదాయం ఉండి సంతృప్తి పొందుతారు. విశేష ప్రయోజనాలుంటాయి. ఊహించని ప్రయాణాలు చేయవలసి రావచ్చును. కుటుంబవ్యక్తులతో ఉత్సాహంగా వ్యవహరించుకో గలుగుతారు.
మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈరోజు ఒత్తిడికి గురి చేయు అంశాలు ఉండగలవు. కుటుంబవ్యక్తులు వృత్తి, ఉద్యోగాలలొ అధికారులు వంటివారు సహకరించగలరు. ఆదాయ, వ్యయాలు అనుకూలంగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చు సూచనలు ఉన్నాయి. ఒప్పందాలు, అగ్రిమెంట్లు తాత్కాలికంగా వాయిదా పడతాయి.
కర్కాటకం
ఆశించి తలపెట్టుకున్న పనులు నత్తనడకన సాగుతాయి. వ్యక్తిగతంగా ఒత్తిడికి గురి అవుతారు. కుటుంబవ్యక్తులు వారివారి వ్యవహారాలలో హడావిడిగా ఉండడం, యంత్ర వాహనాదులకు రిపేర్లు ఏర్పడుట ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతాయుతంగానే సాగండి. తీర్థయాత్రలు, దైవదర్శనములు వంటివాటికి ప్రాధాన్యత నిచ్చుకుంటారు. విద్యార్థులు ఏకాగ్రత చూపలేకపోతారు.
సింహం
పనులలో బిజిబిజీగా గడుపుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం, ఖర్చులు ఎక్కువ ఉంటున్నా మిగులు శాతములు చూస్తారు. కుటుంబంలో ఉత్సాహాలు చోటుచేసుకుంటాయి. ఇతరులకిచ్చిన సూచనలు గుర్తింపునేర్పరచగలవు. యంత్ర, వాహన వాడకాలయందు జాగ్రత్తలు పాటించుకోండి. ఆధ్యాత్మికతలకు ప్రాధాన్యతనిచ్చి సంతృప్తికర స్థితులను పొందగలరు.
కన్య
పనులను వేగవంతం చేసుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించుకుంటారు. సంతాన ఉన్నతి అవకాశాలు ఏర్పడతాయి. వివాహాది శుభకార్య యత్నములతో ఒత్తిడిని ఎదుర్కో వలసిరావచ్చును. ఆదాయ, వ్యయములు సంతృప్తినిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో గౌరవ-మర్యాదల్ని పెంచుకోగలరు. వ్యాపారాలలో నూతన ఒప్పందాలు చేసుకో గల్గుతారు.
తుల
నూతన పనుల చేరిక, రావలసినవి వసూలగుట వంటివి ఉంటాయి. గోప్యసహాయాలు చేస్తారు. మీపై ఏర్పడిన అపవాదములను దూరం చేసుకొనేందుకు అవకాశాలు ఏర్పడతాయి. నూతన ఉద్యోగ, వ్యాపారాలు వంటి అవకాశాలను ఏర్పరచుకోగలుగుతారు. కొందరు అద్దె ఇంటి మార్పులు వంటి వాటికి ప్రాధాన్యతనీయ వలసిరావచ్చును. స్వల్ప అనారోగ్యభావాలను ఎదుర్కోవలసి రావచ్చును.
వృశ్చికం
పెట్టుకున్న పనుల్ని పూర్తిచేసుకోగల్గుతారు. ఖర్చులను తగ్గించుకోగలరు. బంధువర్గపు రాకపోకలుంటాయి. వ్యాపార, వ్యవహారాలలో నిశ్చితమయిన అభిప్రాయాలతో సాగి అనుకూలతలు పెంచుకోగలరు. ఉద్యోగాలందు అధికారుల గుర్తింపులు పొందుతారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరిచేయండి. కోర్టు, లిటిగేషన్ పనులకు దూరంగా ఉండుట మంచిది.
ధనుస్సు
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మనోధైర్యంతో వ్యవహరించుకోవాలి. ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తిచేసుకోవాలి. బంధు వర్గం, కుటుంబ వర్గముల ప్రోత్సాహాలచే అదనపు పనులను చేపట్టుకోగలరు. సోదర- సోదరీ వర్గంతో స్వల్ప జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. వృత్తి, ఉపాధులకై యత్నించుకొనువారికి అనుకూలతలు సిద్ధించగలవు. వివాహాది నిశ్చయములలో తొందరపడకండి.
మకరం
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో మాటపట్టింపులు పెరుగుతాయి. ఆదాయ, ఆరోగ్యాలు అనుకూలం. విద్య, ఉద్యోగాది విషయాల్లో మంచి ఫలితాలు చూడగలరు. గుర్తింపులు పొందుతారు. అధికారిక హోదాల్లో ఉన్నవారికి బాధ్యతల మార్పులుంటాయి. ప్రత్యర్థి వర్గమును సమర్థించవలసిన సూచనలు గలవు. సొంత వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
కుంభం
గ్రహసంచారాలలో రవి- కుజ మార్పులచే కొన్నిట ఉత్సాహాలు ఏర్పడగలవు. కొన్ని ఊహించని అవకాశాలను ఏర్పరచుకుంటారు. వద్దు అనుకున్న వ్యక్తులతో మంతనాలు వద్దు. అనుకున్న పనులు చేపట్టవలసి వచ్చుటవంటివి ఉంటాయి. ఆరోగ్యపరంగా మంచిమార్పులు చూస్తారు. దూరపు వ్యక్తులచే దుర్వార్త వినవలసిరావచ్చును. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతగా సాగుతారు.
మీనం
అనారోగ్య భావనలు, సంతానమునకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఊహించుకున్నవాటిని ఆలస్యంగానైనా పూర్తిచేసుకో గలుగుతారు. మొహమాటాలకు, కార్యాచరణకు నోచుకొని పనులకు దూరంగా ఉండండి. ఆత్మీయుల రాకపోకలు ఉంటాయి. వస్తుమార్పిడి యత్నములు ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. పొదుపు చర్యల్ని పూర్తిచేసుకోగలుగుతారు.
అందించినవారు: ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ