ఫిబ్రవరి 29, నేటి రాశి ఫలాలు: లీప్ డే ఏ రాశి జాతకులకు ఎలా గడుస్తుందో తెలుసా?-today dina phalalu february 29th leap day check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఫిబ్రవరి 29, నేటి రాశి ఫలాలు: లీప్ డే ఏ రాశి జాతకులకు ఎలా గడుస్తుందో తెలుసా?

ఫిబ్రవరి 29, నేటి రాశి ఫలాలు: లీప్ డే ఏ రాశి జాతకులకు ఎలా గడుస్తుందో తెలుసా?

HT Telugu Desk HT Telugu

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ29.02.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు: ఫిబ్రవరి 29, 2024 గురువారం (Pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 29.02.2024

వారం: గురువారం, తిథి: పంచమి,

నక్షత్రం: చిత్తా, మాసం: మాఘం ,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు స్థాన చలన మార్పులుంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. అనారోగ్య సూచనలున్నాయి. జాగ్రత్త వహించండి. మేష రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పించండి.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. ఆకస్మిక ధనలాభ యోగమున్నది. అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. దూర బంధువుతో కలుస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుడిని పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందిపడతారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశముంది. లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి, ఉద్యోగ వ్యాపారపరంగా కలసివచ్చును. గతంలో వాయిదా పడిన పనులు పూర్తవుఅయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు ఆనందకరంగా ఉంటాయి. కొన్ని కష్టమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానసికంగా అనందంగా ఉంటారు. శ్రీరామరక్ష స్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. చిన్న విషయాలకు మానసిక అందోళన చెందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా జాగ్రత్తగా వహించాలి. సహనంగా వ్యవహరించాలి. అవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడును. సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

నేటి రాశి ఫలాల కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. బంధు మిత్రులతో ఆనందముగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. దీర్హకాలిక సమస్యలు తొలగిపోతాయి. అరోగ్యం అనుకూలించును. శత్రు బాధలు దూరమవుతాయి. అకస్మిక ధనలాభంతో రుణ సమస్యలు తీరతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. శంకరాచార్య విరాచిత దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పరించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక ఇబ్బందులుండవు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. స్నేహితులను కలుస్తారు. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. శెనగలు భగవంతునికి నివేదనగా సమర్చించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారస్తులు వ్యాపారంలో ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాలకు దూరంగా ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవటం అవసరం. తోటి వారితో విరోధం రాకుండా జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. వృత్తి, ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలంగా లేదు. కుటుంబములో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని వదులుకుంటారు. అకస్మిక ధననష్టం వల్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం శ్రీరామరక్షాస్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. మానసిక అందోళన, ఒత్తిళ్ళు ఇబ్బందిపెట్టును. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో భేదాభిప్రాయములు రాకుండా జాగ్రత్తపడటం మంచిది. పనులు సకాలంలో పూర్తిచేయలేరు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దత్తాత్రేయుడిని పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారంలో నష్టాలుంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిళ్ళు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. ప్రయాణాలు కలసివస్తాయి. కుంభరాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కొనవలసి వస్తుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులకు పై అధికారులచే సమస్యలు ఏర్పడే అవకాశమున్నది. విద్యార్థులకు మధ్యస్థ సమయం. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పఠించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ