నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల జాతకులకు అన్ని వైపుల నుంచి లాభాలే
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ25.02.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 25.02.2024
వారం: ఆదివారం, తిథి : పాడ్యమి,
నక్ష్మత్రం : పుబ్బ, మాసం : మాఘం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయణం
మేష రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మేష రాశి వారికి ఈ రోజు మధ్యస్థఫలితాలున్నాయి. తొందరపడి ఎవరినీ నమ్మవద్దు. అవసరానికి తగిన నిర్ణయాలు తీసుకుని అమలుచేయాలి. ఉద్యోగస్తులు అనుకున్నది సాధిస్తారు. మీరు ప్రయత్నించే విధానాన్ని బట్టి విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీవల్ల కొందరికి మేలు జరుగుతుంది. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. తొందరపడి ఎవరిని నమ్మవద్దు. ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్య నమస్కారం వంటివి చేయటం వలన శుభఫలితాలు కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి వారికిఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు అనుకున్నది సాధిస్తారు. విజయం లభిస్తుంది. వ్యాపారంలో కొంచెం శ్రద్ధ వహించాలి. తొందరపడి ఎవరినీ నమ్మవద్దు. అవసరానికి తగిన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి. నవగ్రహ జపం చేయటం మంచిది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. తొందరపాటు పనికిరాదు. మాట ఇవ్వబోయే ముందు ఒక్కసారి ఆలోచించండి. శక్తికి మించి పనిచేయవద్దు. ఒంటరిగా ఉండి ఆలోచించవద్దు. మేలు చేకూరుతుంది. పరిస్థితులను సహనంగా ఎదుర్కోవాలి. ధర్మమార్గంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఆచరణలో పెట్టండి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అరుణం పారాయణం చేయడం మంచిది. సూర్యభగవానుడికి తర్పణాలు వదలండి.
కర్కాటక రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. సమస్యలను అర్థం చేసుకుని పని చేయాలి. మనోబలంతో పనులు పూర్తి చేయాలి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. కుటుంబసభ్యుల సలహాలు తీసుకోండి. ఇతరులపై ఆధారపడవద్దు. ఎవరేమన్నా పట్టించుకోవద్దు. గంభీరంగా ఉండాలి. ధైర్యంగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవాలి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్య నారాయణమూర్తిని పూజించండి. చంద్రశేఖష్టకం పఠించండి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు మీకు వ్యాపారపరంగా అనుకూలమైన రోజు. మీరు చేయు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల ద్వారా కొన్ని పనులు జరుగుతాయి. కృషి చేస్తే విశేషమైన గుర్తింపు లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. సూర్యాష్టకాన్ని పఠించడం మంచిది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో స్నేహితుల సూచనలు పనిచేస్తాయి. దూకుడు స్వభావం వద్దు. ధర్మం కాపాడుతుంది. ఉద్యోగంలో అదృష్టం కలసివస్తుంది. ధర్మబద్ధంగా చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. అసూయాపరులు నిందలు మోపాలని చూస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. సూర్యభగవానుని పూజించి బెల్లం పరమాన్నాన్ని నివేదించడం మంచిది. ఆలయాలను దర్శించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారపరంగా ఈరోజు శుభ ఫలితాలున్నాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఆర్థికంగా మీరు చేసే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వల్ప ప్రయత్నంతోనే అధిక లాభాలు సమకూరతాయి. మీ తెలివితేటలతో పెద్దలను మెప్పిస్తారు. పెద్దలతో చర్చలు ఫలిస్తాయి. మీ బుద్ధి బలంతో ఆపద నుంచి బయటపడతారు. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. సూర్య నమస్కారాలు చేయాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు ఆర్థికపరంగా శుభఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. వాహన యోగాలు ఉన్నాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఆటంకాలు కలిగించేవారున్నారు. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించాలి. నవగ్రహా ఆలయాల్లో పూజలు వంటివి చేయాలి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కష్టపడకుండానే పనులు పూర్తవుతాయి. ఏ పని ప్రారంభించినా లాభముంటుంది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. చర, స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. న్యాయపరమైన లాభాలున్నాయి. ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. ఏవిధంగా చూసినా విజయమే గోచరిస్తుంది. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది.
మకర రాశి
మకర రాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయండి. కోరుకున్నదే జరుగుతుంది. బాధ్యతాయుతంగా చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. ఒత్తిడి కలిగించే వారున్నారు. ధార్మిక చింతనతో పనిచేయండి. వాగ్వివాదములకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. నవగ్రహశాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. వివాదాలకు దూరంగా ఉండండి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించండి. ప్రశాంతంగా ఆలోచించాలి. ఈరోజు మీరు అన్ని విషయాల్లోను జాగ్రత్త వహించాలి. అతిగా ఆలోచించవద్దు. మానవ ప్రయత్నంతోనే విజయం సాధించాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. వస్తు, వస్త్ర ప్రాప్తి. వివాదాలకు అతీతంగా వ్యవహరించాలి. వ్యాపారంగా అద్భుత లాభాలున్నాయి. పలు మార్గాల్లో పైకి వస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్త వింటారు. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000