Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు: ఈ రాశి వారు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.. వెనకడుగు వేయద్దు!
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 8.12.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 8.12.2024
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మార్గశిరం, వారం : ఆదివారం, తిథి : శు. సప్తమి, నక్షత్రం : శతభిషం
మేషం:
ఈ రాశి వారికి నేడు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు లబిస్తాయి. ధనలాభం సూచిస్తుంది. ఆత్మీయుల సాయం అందుతుంది. ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఓ మంచివార్త వింటారు. మరిన్ని మంచి ఫలితాల కోసం మేష రాశి వారు సూర్యనారాయణమూర్తిని స్మరించండి.
వృషభం:
ఈ రాశి వారికి ఈరోజు తొందరపాటు పనికిరాదు. లక్ష్యసాధనలో ఏకాగ్రత వహించండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అపార్థాలకు తావివ్వకండి. చాలా సందర్భాల్లో మౌనమే ఉత్తమం. ఉద్యోగంలో పదోన్నతి సూచనలు ఉన్నాయి. అవసరానికి డబ్బు అందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మొహమాటం వద్దు. ఓర్పు అవసరం. మరిన్ని మంచి ఫలితాల కోసం వృషభ రాశి వారు విష్ణుసహస్రనామ స్తోత్రం పఠించాలి.
మిథునం:
ఈ రాశి వారికి నేడు వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా లాభపడతారు. పెద్దలతో సత్సంబందాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు ఉత్తమ ఫలితాలు అందుతాయి. ప్రజా జీవితంలో ఉన్నవారికి అధికార లాభం సూచితం. మీదైన రంగంలో గుర్తింపు లభిస్తుంది. అదృష్ణయోగం ఉంది. చిన్నపాటి ప్రయత్నంతో ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ప్రయాణాలు చేస్తారు. సరస్వతీదేవిని ధ్యానించండి.
కర్కాటకం:
కర్కాటక రాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఏకాగ్రతతో ఉన్నత లక్ష్యాల్ని సాధిస్తారు. కఠిన నిర్ణయాలకు వెనకడుగు వేయకండి. నిజాయతీతో పనిచేయండి. బద్ధకాన్ని వదిలి పెట్టండి. అధికారులతో సత్సంబందాలు కొనసాగించండి. వారం మధ్యలో శుభవార్త వింటారు. ఊహించని ఖర్చులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరిన్ని మంచి ఫలితాల కోసం కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి.
సింహం:
ఈ రాశి వారు నేడు బుద్ధిబలంతో వ్యవహరించాలి. వ్యాపారం సజావుగా సాగుతుంది. లాభాలను అందుకుంటారు. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. శత్రుదోషం తొలగుతుంది. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది. చక్కని ప్రణాళికతో దాన్ని అధిగమించండి. మరిన్ని మంచి ఫలితాల కోసం సింహ రాశి వారు కుజగ్రహ స్తోత్రం చదువుకోవాలి.
కన్య:
నేడు మీరు తీసుకునే నిర్ణయాలు మేలు కలిస్తాయి. ఉత్తమకాలం నడుస్తోంది. వ్యాపారంలో సమయానుకూలంగా స్పందించండి. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. ఆత్మవిశ్వాసం అవసరం. ఎదుగుదలకు సరైన సమయం. భూ, గృహ యోగాలున్నాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది.మరిన్ని మంచి ఫలితాల కోసం శ్రీమహాలక్ష్మిని ఉపాసించండి.
తుల:
తులా రాశి వారు నేడు సాహసోపేతమైన నిర్ణయాల్లో ఘన విజయాలను అందిస్తాయి. వ్యాపార యోగం శుభప్రదం.. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఆర్థిక ప్రగతిపై దృష్టి సారించండి. మాటల్లో స్పష్టత అవసరం. ఓర్పుతో వ్యవహరించండి. కాలాన్ని వృథా చేసుకోవద్దు. ముఖ్య విషయాల్లో ఓ బృందంగా పనిచేయండి. ఇష్టదైవాన్ని పూజించండి.
వృశ్చికం:
ఈ రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు వద్దు. మానసిక స్థిరత్వం అవసరం, ప్రత్యర్థులు ఇబ్బందులు సృష్టి౦చే ఆస్కారం ఉంది. లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. అవసరానికి డబ్బు అందుతుంది. పొదుపు-మదుపు గురించి ఆలోచించాల్సిన సమయం. దైవబలం మిమ్మల్ని రక్షిస్తుంది. అనాలోచిత వాగ్దానాలు ఇవ్వకండి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి.మరిన్ని మంచి ఫలితాల కోసం గణపతిని ప్రార్ధించండి.
ధనుస్సు:
ధనస్సు రాశి వారు ఈ రోజు ఏకాగ్రతతో పనిచేస్తారు. అనుకున్నది సాధిస్తారు. అదృష్టయోగం ఉంది. దైవానుగ్రహంతో ఒక ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. వ్యాపార విస్తరణ విషయంలో దూకుడు వద్దు. మీ దృష్టిని మళ్లించే ప్రయత్నాలు జరుగుతాయి. మనోబలంతో ఆ కుట్రను చేధించండి. మరిన్ని మంచి ఫలితాల కోసం అమ్మవారి ఆలయాన్ని సందర్శించండి.
మకరం:
మకర రాశి వారు నేడు స్థిరచరాస్తుల కొనుగోలు దిశగా అడుగులు వేస్తారు. ఉత్తమకాలం నడుస్తోంది. ఆశించిన ఫలితాలు అందుతాయి. ధన, ధాన్యాభివృద్ధి ఉంది. అధికార యోగం సూచితం. నైపుణ్యాలను పెంచుకుంటారు. కళాకారులు పురస్కారాలు అందుకుంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.మరిన్ని మంచి ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వరుడిని ప్రార్ధించండి.
కుంభం:
ఈ రాశి వారు నేడు వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆత్మసంతృప్తిని కలిగించే పనులు చేస్తారు. పెట్టుబడులకు సరైన సమయం వ్యాపారంలో నిపుణుల సలహాలు అవసరం. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.మరిన్ని మంచి ఫలితాల కోసం లక్ష్మీదేవిని ధ్యానించండి.
మీనం:
మీన రాశి వారు ఈరోజు ఎవరినీ అతిగా విశ్వసించొద్దు. ఏకాగ్రతతో పనిచేయండి. మీరు నమ్మే ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. విఘ్నాల నుంచి బయటపడతారు. కొన్ని విషయాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. దైవబలాన్ని పెంచుకోవడం ద్వారా గ్రహ దోషాలను అధిగమించవచ్చు. కాలాన్ని వృథా చేసుకోవద్దు. వ్యాపారంలో కొద్దిపాటి దూకుడు అవసరం.మరిన్ని మంచి ఫలితాల కోసం నవగ్రహ శ్లోకాలు పఠించాలి.