మార్చి 1, 2024 నేటి రాశి ఫలాలు.. విదేశాలకు వెళ్ళే అవకాశం, ఉద్యోగంలో ప్రమోషన్
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ01.03.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 01.03.2024
వారం: శుక్రవారం, తిథి : షష్టి
నక్షత్రం : స్వాతి, మాసం : మాఘం
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయణం
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగపరంగా శుభ ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా విదేశీయానానికి కూడా అవకాశం ఉంది. సన్నిహితులతో, మిత్రులతో భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉంది. తోబుట్టువులతో ఆస్తి సమస్యలు ప్రారంభమయ్యే సూచనలున్నాయి. ఆరోగ్యం అనుకూలించును. శుభవార్తలు వింటారు. ఆర్థిక సమస్యల నుండి చాలావరకు బయటపడతారు. లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగపరంగా అనుకూలించును. నిరుద్యోగులు ఆశించిన దానికంటే ఎక్కువ శుభవార్తలు వింటారు. ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో అధికారయోగమున్నది. వృత్తి, వ్యాపారాలు మధ్యస్థముగా ఉంటాయి. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలిస్తాయి. శ్రీశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలం. ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది. వ్యాపారంలో భాగస్వాముల నుంచి సహకారం లభిస్తుంది. అనవసర ఖర్చులు పెరుగాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కుటుంబ, ఆర్థిక సమస్యలు ఇబ్బందిపెట్టును. అనవసర స్నేహాలకు, వ్యసనాలకు ఖర్చుల చేయాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్లో మెలకువగా వ్యవహరించాలి. అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యకు, మంచి ఉద్యోగాలకు అవకాశం. వాహనయోగం, గృహయోగమున్నది. ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే సూచనలున్నాయి. వృత్తి వాపారాల్లో ముందుకు దూసుకువెళతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధువుల్లో పలుకుబడి పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పఠించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. ఇంటా బయటా విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ద తీసుకోవాలి. దాంపత్య జీవితంలో అన్యోన్యత ఏర్పడుతుంది. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటివారు అనేక విధాలుగా వృద్ధిలోకి వస్తారు. ఎవరికీ హామీలు ఉండకపోవటం మంచిది. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపి పదార్జాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్చించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా సత్ఫలితాలున్నాయి. ఉద్యోగంలో దూరప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశముంది. తోబుట్టువులకు అండగా నిలబడతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు కలసివస్తాయి. బంధువులతో ఆస్తి సంబంధమైన సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. మిత్రుల సహాయంతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లలితా స్తోత్రాన్ని పఠించండి. లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠించడం ఆర్థిక సమస్యలు తొలగుతాయి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు, భాగస్వాములతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగపరంగా అనుకూల సమయం. కొంత డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. ఆహార విహారాల్లో విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగం సంపాదించుకునే అవకాశముంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. వాగ్దానాలు, హామీలకు దూరంగా ఉండాలి. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశముంది. సంపాదనలో ఆశించినంత పెరుగుదల ఉండకపోవటం వల్ల ఆర్థిక సమస్యలు ఇబ్బందిపెడతాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. కొన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. మనశ్శాంతి తగ్గవచ్చు. అతిథులకు తీపిపదార్జాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం, తీపి పదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.
ధనూ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈ రోజు ఉద్యోగపరంగా బాగా కలసివస్తుంది. అధికార యోగం ఉంది. అనుకోకుండా భారీ మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం అనుకూలించును. వృత్తి వ్యాపారాలలో కొత్త ఆదాయ మార్గాలు మీ దృష్టికి వస్తాయి. తోబుట్టువులు నిందలు వేసే సూచనలున్నాయి. నరఘోష ఎక్కువగా ఉంటుంది. విదేశీయాన సూచనలున్నాయి. మొండి బాకీలు వసూలవుతాయి. విహార యాత్రలకు కూడా అవకాశం ఉంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోరాదు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పఠించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. కొందరు మిత్రులు నమ్మించి మోసగించే అవకాశముంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. విదేశీ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో సంప్రదించడం మంచిది. ఆరోగ్య పరిస్థితులు అనుకూలించును. ఆనందముగా, ఆహ్లాదకరంగా గడుపుతారు. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.
కుంభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికమగును. శారీరక విశ్రాంతి అవసరం. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. మిత్రుల నుంచి సహాయం కోసం ఒత్తిడి పెరుగుతుంది. బంధువర్గంలో వివాహ శుభకార్య సూచనలున్నాయి. సంతానపరంగా కొన్ని ఇబ్బందులుండును. ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. కోర్టు కేసులు అనుకూలం. శత్రువుల మీద విజయం సాధిస్తారు. కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగంలో పై అధికారుల సహాయ సహకారాలుంటాయి. ఆకస్మిక ధనలాభముంది. వ్యాపారంలో రంగంలో ఉన్న వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. కొందరు సన్నిహితులు మోసగించే అవకాశముంది. కుటుంబపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆహార నియమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంపట్ల శ్రద్ద వహించాలి. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000