ఆగస్ట్ 4, నేటి రాశి ఫలాలు.. ఆషాడ అమావాస్య ఎవరికి అదృష్టాన్ని ఇచ్చిందో చూడండి
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ04.08.2024 అదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 04.08.2024
వారం: ఆదివారం, తిథి : అమావాస్య,
నక్షత్రం: పుష్యమి, మాసం : ఆషాఢము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేష రాశి
కీలక కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహనిర్మాణయత్నాలు సానుకూలంగా ఉన్నాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కారమవుతాయి. ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు తీరతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి అవకాశం.. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. గులాబీ, పసుపు రంగులు ధరించండి. ఆదిత్య హృదయం పఠించండి.
వృషభ రాశి
ఊహించని విధంగా వ్యతిరేకుల నుంచి కూడా మాట సాయం అందుతుంది. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పనిభారం కొంతమేర తగ్గే అవకాశం. పారిశ్రామిక వర్గాలకు చేసిన కృషికి ఫలితం కనిపిస్తుంది. మనస్సు కొంత ఆందోళనగా ఉంటుంది. పసుపు, ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మంచి జరుగుతుంది.
మిథున రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనుల్లో అనూహ్యంగా విజయం లభిస్తుంది. ఆప్తుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ మంచి ఫలితం ఇస్తుంది. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలను ముమ్మరం చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రావచ్చు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించవచ్చు. తెలుపు, లేత నీలం రంగులు కలిసి వస్తాయి. దేవీస్తుతి పఠించండి. సత్ఫలితాలు అందుకుంటారు.
కర్కాటక రాశి
విద్యార్థుల నైపుణ్యాన్ని అందరూ గుర్తిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక సమస్య తీరి మనస్సు తేలిక పడుతుంది. వ్యాపారాలను లాభాల బాటలో నడిపిస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం లభిస్తుంది. పారిశ్రామిక వేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. నలుపు, ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రాలు పఠించండి.
సింహ రాశి
కొద్దిపాటి చికాకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. నిరుద్యోగులు పడిన కష్టం ఫలించే సమయం. ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రతిబంధకాలు తొలగుతాయి. కళారంగం వారికి శుభవార్తలు అందుతాయి. శ్రమ అధికంగా ఉంది. ఎరుపు, బంగారు రంగులు ధరించండి. ఆంజనేయ దండకం పఠించండి.
కన్యా రాశి
నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తిచేస్తారు. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరినీ నొప్పించనిరీతిలో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణకు సమాయత్తమవుతారు. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పసుపు, నేరేడు రంగులు ధరించండి. శివస్తోత్రాలు పఠించండి.
తులా రాశి
అనుకున్న కార్యక్రమాలను ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి కాగలవు. కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఎంతటి వారినైనా వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దీర్ఘకాలిక కల ఫలిస్తుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలలో లాభాలు సూచితం. ఉద్యోగులకు శుభదాయకమైన కాలం. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. లేత ఎరుపు, బంగారు రంగులు. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి. సత్ఫలితాలు అందుతాయి.
వృశ్చిక రాశి
కొత్త పనులు ప్రారంభానికి సమాయత్తమవుతారు. ఆలోచనలు వెనువెంటనే అమలు చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలలో మీ అంచనాల మేరకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి రావచ్చు. కళాకారులకు ఉత్సాహవంతమైన కాలం. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. నీలం, తెలుపు రంగులు కలిసి వస్తాయి. గణేశాష్టకం పఠించండి.
ధనుస్సు రాశి
ఉద్యోగయత్నాలలో పురోగతి ఉంది. రావలసిన సొమ్మును సకాలంలో అందుకుంటారు. రుణ బాధల నుంచి విముక్తి. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులు ఊహించని అవకాశాలు పొందుతారు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు రావచ్చు. ఉద్యోగులకు మరింత అనుకూల సమయం. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. బంగారు, ఆకుపచ్చ రంగులు అనుకూల ఫలితాలు అందిస్తాయి. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.
మకర రాశి
మొదట్లో కొన్ని వివాదాలు ఏర్పడి సవాలుగా నిలుస్తాయి. అయితే చాకచక్యంగా బయటపడతారు. ఆలోచనలు అమలులో ముందడుగు వేస్తారు. స్థిరాస్తి విషయంలో ఒక అంగీకారానికి వస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు విస్తరించి లాభాల బాట పడతారు. ఉద్యోగులకు పనిఒత్తిడులు తగ్గవచ్చు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకుపచ్చ, నలుపు రంగులు ధరించండి. ఆదిత్య హృదయం పఠించండి.
కుంభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వాళ్ళు ఆర్థిక లావాదేవీలను పకడ్బందీగా నడిపిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు వచ్చే సూచనలు. రాజకీయవర్గాలకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు రావచ్చు. తెలుపు, లేత ఎరుపు రంగులు ధరించండి. గణేషుడిని పూజించండి.
మీన రాశి
అనుకున్న వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటాబయటా కొత్త సమస్యలతో కుస్తీపడతారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. ఎంత కష్టించినా ఫలితం అందుకోలేరు. వ్యాపారాలలో నిరుత్సాహమే. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు. ఒక కీలక వ్యవహారంలో విజయం చేకూరుతుంది. గులాబీ, బంగారు రంగులు, అంగారక స్తోత్రాలు పఠించండి.
సంబంధిత కథనం