ఆగస్ట్ 23, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి-today august 23rd 2024 rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఆగస్ట్ 23, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి

ఆగస్ట్ 23, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి

HT Telugu Desk HT Telugu
Aug 23, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ23.08.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆగస్ట్ 23వ తేదీ నేటి రాశి ఫలాలు
ఆగస్ట్ 23వ తేదీ నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన‌ ఫలం) 23-08-2024

వారం: శుక్ర‌వారం, తిథి: చ‌వితి,

న‌క్ష‌త్రం: రేవతి, మాసం: శ్రావ‌ణ‌ము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

మేష రాశి వారికి అనుకూల స‌మ‌యం న‌డుస్తోంది. పనులలో పురోగతి సాధిస్తారు. కీల‌క విష‌యాల్లో చేసే ప్రయత్నాలలో కొత్తవాళ్ల సలహాలు, సూచనలు మీకు మేలు చేస్తాయి. రాజకీయప‌రంగా మీకు మంచి ఫ‌లితాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక, సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఇష్ట దేవుళ్లకు మహాతీర్థం పొడితో అభిషేకం చెయ్యండి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అమ్మ‌వారి ద‌ర్శ‌నం అనుకూల ఫ‌లితాలు అందిస్తుంది.

వృషభం

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వాళ్ళు శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఏర్పడతాయి. సంతానానికి ఖ‌రీదైన‌ బహుమతులు ఇచ్చే సూచనలున్నాయి. కృషి, పట్టుదల కలిగి ఉంటారు. గతంలో దూరమైనవారు తిరిగి మీకు చేరువయ్యే సూచనలు ఉన్నాయి. ఆత్మీయుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. హ‌నుమాన్ చాలీసా ప‌ఠించండి. స‌త్ఫ‌లితాలు అందుతాయి.

మిథునం

ప్ర‌యాణం విష‌యంలో జాగ్రత్తలు పాటించండి. విదేశీ వస్తువులు కొనుగోలు చేస్తారు. భాషా పరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. న్యాయరంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. ఆరావళి కుంకుమ, శ్రీలక్ష్మీ చందనంతో అమ్మవారికి పూజ చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదం కాకుండా జాగ్రత్తలు పాటించండి. ల‌క్ష్మీదేవిని ఆరాధించండి. శుభ‌ఫ‌లితాలు అందుతాయి.

కర్కాటకం

రాజకీయాల ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. పలువురి పరిచయాలు అందుకు కారణం అవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. అనుకోని సమస్యలు కలుగుతాయి. విదేశాల్లో వున్నవారికి సొంత ఇంటి కల నెరవేరుతుంది. అరటినార వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. శివారాధ‌న మంచి చేస్తుంది.

సింహం

ఇంట్లోనూ, కార్యాలయంలోనూ పరపతి, పేరు కోసం తపిస్తారు. చేస్తున్న ప్రతి పనికీ వంకలు పెట్టేవారే కానీ మిమ్మల్ని గుర్తించేవారు అరుదుగా ఉంటారు. మీకు రావలసిన బాకీలు వసూలవుతాయి. కొత్త రుణాల కోసం ప్రయత్నిస్తారు. అనూహ్యంగా శుభకార్యాలు, పెళ్లిపనులు ముడిపడతాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగుల‌కు ప‌ద‌వీ ప‌ర‌మైన ఒత్తిడి పెర‌గ‌వ‌చ్చు. విష్ణు స‌హ‌స్ర నామ స్తోత్రాన్ని పారాయ‌ణం చేయండి.

క‌న్య‌

ఆర్థిక వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. రుణాలు కొంతవరకు తీరుస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశంలో సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. నరదృష్టి తొలగిపోతుంది. గతంలో దూరమైనవారు తిరిగి మీకు చేరువ అయ్యే సూచనలు ఉన్నాయి. ఆత్మీయుల స‌ల‌హాలు సూచ‌న‌లు పాటించండి. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ఆరాధించండి.

తుల

ఆర్థిక వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. రుణాలు కొంతవరకు తీరుస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. గతంలో దూరమైనవారు తిరిగి చేరువ అయ్యే సూచనలు ఉన్నాయి. డ్రైవింగ్లో జాగ్రత్తలు పాటించండి. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సంతాన పురోగతి బాగుంటుంది. గృహంలో సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. ప్రజా సంబంధాలతో కూడిన వ్యాపారాలు చేస్తారు. సుబ్ర‌హ్మ‌ణ్య స్వామిని ఆరాధించండి. మంచి జ‌రుగుతుంది.

వృశ్చికం

అనుకూల స‌మ‌యం న‌డుస్తుంది. పొలం కోసం రుణాలు చేస్తారు. అధిక పెట్టుబడులు తప్పకపోవచ్చు. పోటీ పరీక్షలలో పిల్లలకి మంచి మార్కులు వచ్చినప్పటికీ వాళ్ల ఆలోచనలు మరొక విధంగా వుండటం మీకు అయోమయం కలిగిస్తుంది. సౌర కంకణం ధరించండి. ఆరోగ్యం మెరుగు పడుతుంది. జీవిత ఆశయానికి చేరువవుతారు. కొన్ని ఘన విజయాలు నమోదు చేసుకుంటారు. న‌వ‌గ్ర‌హ స్తోత్రాలు పారాయ‌ణం చేయండి. మంచి ఫ‌లితాలు అందుతాయి.

ధనుస్సు

నేటి రాశి ఫలాల ప్రకారం మీకు రావలసిన వాటికి సంబంధించిన శుభవార్త వింటారు. కొన్ని కొత్త కార్యక్రమాలు చేపడతారు. ప్రయోగాత్మక సత్ఫలితాలు సాధిస్తారు. బ్యాంకు ఉద్యోగులు సకాలంలో టార్గెట్ రీచ్ అవుతారు. మహా పాశుపత కంకణం ధరించండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దేవీ దేవతలకు ప్రతిరోజు ప్రథమ తాంబూలం సమర్పించండి. పిల్లలకు అనుకూలమైన మార్పులు ఉంటాయి. స్నేహితులకు అందుబాటులో ఉంటారు.

మకరం

మీ ఆలోచనలలో మార్పులు కలుగుతాయి. వ్యక్తిగత అభివృద్ధి కోసం కృషి చేస్తారు. గొప్ప స్థానాల్లో ఉన్నవారితో స్నేహం కలిగి వుంటారు. తద్వారా అందరికన్నా ముందు మీకు ప్రయోజనాలు వస్తాయి. గోమతి చక్రాలతో అమ్మ వారికి పూజ చేయండి. ఉద్యోగంలో మార్పు కోసం పరితపిస్తారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఆ బొట్టును ధరించండి. స‌త్ఫ‌లితాలు అందుతాయి.

కుంభం

పిల్లల భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మీ పరపతి మీకు ఉపయోగపడకపోవచ్చు. ఊరికోసం చేసే న్యాయ ప్రయత్నాలు ఉపయోగపడతాయి. వ్యాపారాభివృద్ధి కోసం కొన్ని త్యాగాలు చేస్తారు. ఆశించిన ధన లాభం అందుతుంది. రెండోసారి రాసే పరీక్షలో మంచి ఫలితాలు వస్తాయి. రాజకీయాల్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

మీనం

పెద్దవారి అండదండలు పొందుతారు. మీడియా సహాయం లభిస్తుంది. కీళ్ల నొప్పులు బాధిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు చిరాకు కలిగిస్తాయి. కుక్కలకి చపాతీలు తినిపించండి. బ్యాంక్ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. పరిచయం లేని వ్యక్తులకు అధిక సమాచారం తెలియ చేయవద్దు. సంప్రదాయమైన కొన్ని అంశాలు, పూజలు, మొక్కుబడుల పైన శ్రద్ధ చూపిస్తారు. శుభవార్తలు వింటారు.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ