ఆగస్ట్ 20, నేటి రాశి ఫలాలు.. వీరికి మిశ్రమ కాలం నడుస్తోంది, జాగ్రత్తగా ఉండండి-today august 20th 2024 rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఆగస్ట్ 20, నేటి రాశి ఫలాలు.. వీరికి మిశ్రమ కాలం నడుస్తోంది, జాగ్రత్తగా ఉండండి

ఆగస్ట్ 20, నేటి రాశి ఫలాలు.. వీరికి మిశ్రమ కాలం నడుస్తోంది, జాగ్రత్తగా ఉండండి

HT Telugu Desk HT Telugu
Aug 20, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ20.08.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆగస్ట్ 20వ తేదీ నేటి రాశిఫలాలు
ఆగస్ట్ 20వ తేదీ నేటి రాశిఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 20-08-2024

వారం: మంగళవారం, తిథి: కృష్ణ పక్ష విదియ,

నక్షత్రం: ధనిష్ఠ‌, మాసం: శ్రావ‌ణ‌ము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

మేష‌ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు వరిస్తాయి. ఏకాగ్రతతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. వస్తు, వాహన యోగం ఉంది. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల‌ ఆదరణ లభిస్తుంది. మీ వల్ల కొందరు లాభపడతారు. కుటుంబ సభ్యుల అండ లభిస్తుంది. లక్ష్మీదేవిని ధ్యానించండి. మంచి జ‌రుగుతుంది.

వృషభం

అదృష్టయోగం ఉంది. సంకల్పం సిద్ధిస్తుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. ప్రణాళికా బద్ధంగా పనిచేస్తే మరిన్ని విజయాలు వరిస్తాయి. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. వ్యాపారంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ధన లాభం ఉంది. ఇష్టదైవాన్ని స్మరించుకోండి. మాన‌సిక ప్ర‌శాంతత ల‌భిస్తుంది. కుటుంబ‌స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

మిథునం

నేటి రాశిఫలాల ప్రకారం మిథున రాశి వారి అభీష్టం సిద్ధిస్తుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. ఆపదల నుంచి బయటపడతారు. అవగాహన సామర్థ్యంతో సమస్యల్ని పరిష్కరించుకుంటారు. మానవ సంబంధాలు బలపడతాయి. తల్లివైపు బంధువుల నుంచి సహాయం లభిస్తుంది. ధనలాభం ఉంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. మంచి జ‌రుగుతుంది.

కర్కాటకం

ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు వద్దు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఓర్పుతో వ్యవహరించండి. మిశ్రమ కాలం నడుస్తోంది. అందువల్ల ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. కీల‌క విష‌యాల్లో మంచి జరుగుతుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

సింహం

ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. పొదుపు, మదుపు గురించి ఆలోచించాలి. అన‌వ‌స‌రంగా ఆలోచనలు చేయ‌వద్దు. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయినా నిరాశ పడాల్సిన పన్లేదు. ధర్మాన్ని నమ్ముకోండి. ఇత‌రుల‌తో మితంగా సంభాషించండి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. స‌త్ఫ‌లితాలు అందుతాయి.

కన్య

వృత్తి నైపుణ్యం పెంచుకుంటారు. క్రమంగా పురోగతి సాధిస్తారు. కొన్ని శక్తులు మీకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తాయి. కొందరి విషయంలో అతిచనువు మంచిది కాదు. ఏకాగ్రతతో తక్షణ విజయం సాధ్యం. మీవల్ల కొందరికి మేలు కలుగుతుంది. ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్తపడండి. శివారాధన మేలు చేస్తుంది. కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

తుల

శుభప్రదమైన సమయం. మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. వృత్తి నైపుణ్యం పెంచుకుంటారు. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ప్రయత్నాలు సఫలం అవుతాయి. మీరు ఆచరిస్తున్న ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. మీ వల్ల మిత్రులకు మేలు జరుగుతుంది. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి.

వృశ్చికం

ఆశించిన ఫలితాలు ఉంటాయి. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయకండి. పాటు పనికిరాదు. నకారాత్మక ఆలోచనలను పక్కన పెట్టండి. లోతుగా ఆలోచించాకే కీలక నిర్ణయాలు తీసుకోండి. చిన్నపాటి పొరపాట్లు కూడా తీవ్రనష్టం కలిగిస్తాయి. ఓ సమస్య నుంచి బయటపడతారు. ఓ శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని ప్రార్ధించండి.

ధనుస్సు

అనుకూల స‌మ‌యం న‌డుస్తుంది. అదృష్ట యోగం సూచితం. ఆర్ధిక పురోగతి సాధిస్తారు. ధనధాన్య వృద్ధి ఉంది. దుబారా వద్దు. పొదుపు సూత్రాలు పాటించండి. మీ దీర్ఘకాలిక అన్వేషణ ఫలిస్తుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. కొందరి వల్ల ఉపకారం జరుగుతుంది. శత్రుదోషం తొలగుతుంది. కీర్తి ఇనుమడిస్తుంది. కులదేవతను ఆరాధించండి.

మకరం

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వాళ్ళు మ‌నోబలంతో పనులు ప్రారంభించండి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి మంచి జరుగుతుంది. సరైన ప్రణాళికతో ఒత్తిడిని అధిగమిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం వద్దు. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. శుక్రబలం వల్ల ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మొహమాటం కారణంగా ఖర్చులు పెరుగుతాయి. వినాయకుడిని ప్రార్ధించండి. గ‌ణ‌ప‌తి ఆల‌యాన్ని సంద‌ర్శించండి.

కుంభం

ఉద్యోగ విజయాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని అధిగమిస్తారు. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా నిరుత్సాహం వద్దు. పరిస్థితులను అర్థం చేసుకుని అడుగు ముందుకేయండి. తగిన జాగ్రత్తలతో వ్యాపార నష్టాలను అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. శుభవార్త వింటారు. నవగ్రహ స్తోత్రం పఠించాలి.

మీనం

వ్యాపారం లాభదాయకం. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ ప్రోత్సాహం లభిస్తుంది. మిత్రుల సహకారం అందుకుంటారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ముఖ్య నిర్ణయాల్లో ఆరంభ శూరత్వం పనికిరాదు. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. శుభవార్త వింటారు. గణపతిని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000