ఆగస్ట్ 15, నేటి రాశి ఫలాలు.. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ15.08.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 15.08.2024
వారం: గురువారం, తిథి : దశమి,
నక్షత్రం: జ్యేష్ట, మాసం: శ్రావణము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
కార్యసిద్ధి ఉంది. ఆకస్మిక ధనలాభం సూచితం. మీదైన రంగంలో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. పెట్టుబడులకు అనుకూలమైన కాలం. సన్నిహితుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. కీలక విషయాల్లో మీ జోక్యం అనివార్యం. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. తరుచూ వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. ఇష్టదేవతా ఆరాధన ఆనందాన్నిఇస్తుంది.
వృషభం
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ ఊహలు ఫలిస్తాయి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సాయం ఆశించవద్దు. అదృష్టయోగమే మిమ్ములను కార్యోన్ముఖుల్ని చేస్తుంది. పనులు మందకొడిగా సాగుతాయి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. లలితా సహస్ర నామాన్ని జపించండి.
మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. నిలిపివేసిన పనులు పునః ప్రారంభిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. అమ్మవారిని ఆరాధించండి.
కర్కాటకం
ఆశాజనకమైన కాలం నడుస్తుంది. ప్రధాన అంశాలపై పట్టు సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఆదాయం బాగుంటుంది. కుటుంబంలో వేడుకలకు సన్నాహాలు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. పాతమిత్రులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. అమ్మవారిని ధ్యానించండి.
సింహం
ప్రతికూలతలు అధికం అవుతాయి. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్నవిషయానికే ఆందోళన చెందుతారు. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అపరిచితులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు ఇతరులతో వెల్లడించవద్దు. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. దైవ దర్శనం మేలు చేస్తుంది.
కన్య
కార్యసాధనకు పట్టుదల ప్రధానం. శ్రమించినా ఫలితం ఉండదు. నిరుత్సా హం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టం మీద తీరుతాయి. మంగళవారం నాడు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. సన్నిహితులు కలయిక ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల్లో సవరణ అనివార్యం, ఆరోగ్యం బాగుంటుంది. లక్ష్మీదేవిని ఆరాధించండి.
తుల
నూతన వ్యక్తులతో సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు అనుకూల స్పందన లభిస్తుంది. చాక చక్యంగా వ్యవహరిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పురస్కారాలు అందుకుంటారు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ప్రయోజనాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. హనుమాన్ చాలీసా పఠించండి. సత్ఫలితాలు అందుతాయి.
వృశ్చికం
ఆర్ధిక లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమ అధికంగా ఉంటుంది. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉల్లాసంగా గడుపుతారు. శివారాధన శుభప్రదం.
ధనుస్సు
వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందు తుంది. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. పెద్దల సలహా తీసుకోండి. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. తరచూ విందుల్లో పాల్గొంటారు. అమ్మవారిని పూజించండి.
మకరం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహ పరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. సంకల్పబలమే మిమ్ములను కార్యోన్ముఖులను చేస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. కీలక పనులు వాయిదా వేసుకుంటారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. వేడుకకు హాజరవుతారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించండి.
కుంభం
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి కీలక వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధికంగా ఉంటుంది. విశ్రాంతి లేక ఇబ్బందిపడతారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. ధైర్యంగా యత్నాలు సాగించండి. ఆదాయం బాగుంటుంది. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. మానసికంగా కుదుటపడతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.
మీనం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యాపకాలు అధికమవుతాయి. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. లక్ష్మి దేవిని ఆరాధించండి.