ఆగస్ట్ 13, నేటి రాశి ఫలాలు.. వృశ్చిక రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ13.08.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 13-08-2024
వారం: మంగళవారం, తిథి : అష్టమి,
నక్షత్రం: విశాఖ, మాసం : శ్రావణము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
అదృష్టయోగం ఉంది. ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మంచి శకునాలు ఎదురవుతాయి. గృహ, వాహన యోగాలున్నాయి. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ముఖ్య నిర్ణయాల్లో స్వతంత్రంగా వ్యవహరించాలి. ఇష్టదైవాన్ని స్మరించండి. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అన్ని విధాలుగా మంచి జరుగుతుంది.
వృషభం
అనుకూల సమయం నడుస్తుంది. ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. కీలక విషయాల్లో మీ దీర్ఘకాలిక అన్వేషణ ఫలిస్తుంది. ఉద్యోగులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. కొత్త నైపుణ్యాలు పెంచుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పరిస్థితులను బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. శత్రుదోషం తొలగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో పొదుపు అవసరం. లక్ష్మీదేవిని ధ్యానించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.
మిథునం
ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. లక్ష్యసాధనకు మరింత కృషి అవసరం అవుతుంది. కనిపించని శత్రువులతో జాగ్రత్త అవసంర. ఎవర్నీ అతిగా విశ్వసించకండి. అంతరంగిక విషయాలు బహిరంగంగా చర్చించవద్దు. మిశ్రమ కాలం నడుస్తోంది. వ్యాపార నష్టాలను కట్టడి చేయాలి. ఓ సమస్య నుంచి బయటపడతారు. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి. మంచి జరుగుతుంది.
కర్కాటకం
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారిని అదృష్టం వరిస్తుంది. ధర్మదేవత అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉన్నాయి. శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. న్యాయ పరమైన చిక్కులు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలున్నాయి. మీ వల్ల నలుగురికీ మేలు జరుగుతుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. లక్ష్మీదేవిని ధ్యానించండి. సత్ఫలితాలు అందుతాయి.
సింహం
అవసరాలకు డబ్బు అందుతుంది. రుణ సమస్యలను అధిగమించండి. ఉద్యోగంలో మరింత శ్రద్ధ అవసరం. తెలియనివారిని నమ్మి మోసపోవద్దు. పరిస్థితులను బట్టి చాకచక్యంగా వ్యవహరించండి. శ్రమ అధికమైనా ఫలితం బావుంటుంది. ఓర్పుగా వ్యవహరించండి. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. పరమేశ్వర ధ్యానం శుభప్రదం. శివాలయాన్ని సందర్శించండి.
కన్య
ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. దైవబలం నడిపిస్తుంది. బలమైన ప్రయత్నం అవసరం. ఏకాదశంలో సూర్య సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ముఖ్య నిర్ణయాల్లో మనోబలం అవసరం. కుటుంబానికి ఓ శుభవార్త అందిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి.
తుల
మంచి భవిష్యత్తు గోచరిస్తోంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు. తగిన గుర్తింపు లభిస్తుంది. మీ కారణంగా నలుగురికీ మేలు జరుగుతుంది. బుద్ధిబలంతో వ్యాపార విజయాలు సాధిస్తారు. నైపుణ్యాలు పెంచుకుంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ధన, ధాన్యాది యోగాలున్నాయి. లక్ష్మీ అష్టోత్తరం పఠించాలి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృశ్చికం
అదృష్టం తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏకాగ్రత అవసరం. విఘ్నాలు తొలగిపోతాయి. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా నిరుత్సాహం వద్దు. సౌమ్యంగా సంభాషించండి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. అంతిమంగా మీ సంకల్ప బలమే మిమ్మల్ని గెలిపిస్తుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.
ధనుస్సు
నేటి రాశి ఫలాల ప్రకారం ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ధైర్యంగా కొత్త పనులను ప్రారంభించండి. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టుల్లో కదలిక వస్తుంది. ధనయోగం ఉంది. కొత్త పెట్టుబడులు లభిస్తాయి. ఓ ఆపద నుంచి సురక్షితంగా బయటపడతారు. మీ చుట్టూ నిందలు మోసేవారు ఉన్నారు జాగ్రత్త, సూర్యారాధన శుభప్రదం.
మకరం
మనోబలంతో అడుగు ముందుకేయండి. మానసిక దృఢత్వం అవసరం. దీర్ఘకాలిక స్వప్నం నిజం అవుతుంది. గతంలోని పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. గృహలాభం సూచితం. వాహన యోగం ఉంది. కొత్త ఆభరణాలు ధరిస్తారు. ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది. మొహమాటాలకు పోవద్దు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాదించండి. ప్రత్యేక పూజలు చేయండి. శుభ ఫలితాలున్నాయి.
కుంభం
ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. అంచెలంచెలుగా ఎదుగుతారు. అధికారుల అండ లభిస్తుంది. లక్ష్య సాధనకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. కుటుంబాన్ని విస్మరించకండి. ఆత్మీయులతో విభేదాలు వద్దు. పంతానికి పోవద్దు. వారాంతంలో ఓ మంచి ఫలితం ఎదురవుతుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.
మీనం
మనోబలంతో విజయాలు సాధిస్తారు. వైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగులకు సమయస్ఫూర్తి, అవసరం. వ్యాపారులు కొత్త రంగాలకు విస్తరించడానికి సరైన సమయం. మొహమాటం వల్ల కొత్త ఖర్చులు ఎదురవుతాయి. ఆర్ధిక ప్రణాళిక అవసరం. వారం మధ్యలో ఓ సమస్య నుంచి బయటపడతారు. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.