ఏప్రిల్ 4, నేటి రాశి ఫలాలు..అవరోధాలు అధిగమిస్తారు, పెట్టుబడులు లాభాలనిస్తాయి-today april 4th 2024 horoscope in telugu check your all zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 4, నేటి రాశి ఫలాలు..అవరోధాలు అధిగమిస్తారు, పెట్టుబడులు లాభాలనిస్తాయి

ఏప్రిల్ 4, నేటి రాశి ఫలాలు..అవరోధాలు అధిగమిస్తారు, పెట్టుబడులు లాభాలనిస్తాయి

HT Telugu Desk HT Telugu

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ04.04.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 4వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 04.04.2024

వారం: గురువారం, తిథి : దశమి,

నక్షత్రం : శ్రవణ, మాసం : ఫాల్గుణం

సంవత్సరం: శోభకృత్‌ నామ, ఆయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు శుభఫలితాలను ఇస్తాయి. ధైర్యంగా బాధ్యతలను పూర్తి చేయండి. సమిష్టి కృషి ఫలిస్తుంది. అపార్ధాలకు అవకాశం ఇవ్వవద్దు. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. ఒక ఆపద నుంచి బయటపడతారు. పలు మార్గాల్లో అభివృద్ధిని సాధించడానికి అనుకూలమైన సమయం. ఆర్థికంగా మేలు జరుగుతుంది. మేషరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పించండి.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబములో శుభకార్యాలు జరుగుతాయి. అధికారయోగమున్నది. కర్తవ్య నిర్వహణలో ఆలస్యం వద్దు. సంకల్పం సిద్ధిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. గృహ నిర్మాణాది కార్యాలు కలసివస్తాయి. పట్టువిడుపులతో ముందుకు సాగాలి. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుడిని పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

మిథున రాశి

మిథున రాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. వ్యాపారంలో శ్రద్ధ వహించాలి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. ఒక సమస్య నుంచి బయటపడతారు. అపార్థాలకు తావివ్వవద్దు. ఉద్యోగంలో పొరపాట్లు జరగనివ్వవద్దు. ఆపదలు తొలగుతాయి. కొన్ని సందర్భాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా శ్రద్ధ అవసరం. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రణాళికాబద్ధంగా తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. సొంతంగా నిర్ణయాలు తీసుకోకండి. మిత్రుల సూచనలతో మేలు జరుగుతుంది. తొందరపాటు చర్యల వల్ల కాలం వృథా అవుతుంది. వ్యాపారంలో ఆటంకాలు తొలగుతాయి. విఘ్నాలు ఎదురైనా శాంతంగా ఆలోచించాలి. మనోబలంతో పనులు ప్రారంభించండి. సింహరాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో అభిప్రాయభేదములేర్పడును. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరాదు. నిజాయితీగా పనిచేసి నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. అవరోధాలను అధిగమిస్తారు. కృషిని బట్టి ఫలితముంటుంది. దేనికోసం ఎదురుచూస్తారో అది దొరుకుతుంది. కన్యారాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శంకరాచార్య విరాచిత దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. భూ, గృహ, వాహనాది యోగాలున్నాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఏ పని ప్రారంభించినా విజయం లభిస్తుంది. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యులతో కలసి ఆనందముగా గడిపెదరు. కొన్ని సమస్యలు తీరతాయి. తులారాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పించండి.

వృశ్చిక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగంలో ఇబ్బందులు తొలగుతాయి. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. అవసరాలకు సరిపడా ధనం అందుతుంది. సకాలంలో పనులు ప్రారంభించండి. కొందరు కావాలని ఇబ్బంది కలిగిస్తారు. శాంతంగా వ్యవహరించాలి. మన పనులు మనం చేసుకోవాలి. కొంత ఒత్తిడి గోచరిస్తుంది. వృశ్చికరాశి మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుడిని పూజించాలి. దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. నూతన ప్రయత్నాలు సఫలవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. దూరదృష్టితో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. స్వయంకృషితో పైకి వస్తారు. అభివృద్ధి సాధిస్తారు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం శ్రీరామరక్షాస్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సమస్యలు పరిష్కారమవుతాయి. ఇతరులపై ఆధారపడవద్దు. న్యాయపరమైన లాభాలున్నాయి. ధర్మం గెలిపిస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. ప్రతిభతో అధికారులను మెప్పిస్తారు. పనిలో పురోగతి ఉంటుంది. కుటుంబ సమస్యలు, అర్థిక సమస్యలు ఇబ్బందిపెట్టును. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దత్తాత్రేయుడిని పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. తలపెట్టిన పనులను మధ్యలో ఆపవద్దు. వ్యాపారస్తులకు లాభదాయకం. తోటివారి నుండి తగిన సహకారం లభిస్తుంది. వివాదాలను దూరంగా ఉండాలి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మనోబలం నడిపిస్తుంది. ఎవరేమన్నా మనసుకు తీసుకోవద్దు. కుంభరాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పనులు సకాలంలో పూర్తిచేయాలి. దగ్గరి వారితో విభేదాలు వద్దు. ఎవరేమన్నా మనసుకు తీసుకోకుండా సర్దుకుపోవడం మంచిది. చెడు ఊహించవద్దు. అధైర్యపడవద్దు. సమిష్టి నిర్ణయాలు మేలుచేస్తాయి. లక్ష్యం నెరవేరుతుంది. సంకల్పంతో అనుకున్నది సాధిస్తారు. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000