ఏప్రిల్ 12, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులు విఘ్నాలు అధిగమించి విజయం సాధిస్తారు-today april 12th 2024 rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 12, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులు విఘ్నాలు అధిగమించి విజయం సాధిస్తారు

ఏప్రిల్ 12, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులు విఘ్నాలు అధిగమించి విజయం సాధిస్తారు

HT Telugu Desk HT Telugu
Apr 12, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ12.04.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 12, నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 12, నేటి రాశి ఫలాలు (freepik )

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 12.04.2024

వారం: శుక్రవారం, తిథి : చవితి,

నక్షత్రం : రోహిణి, మాసం : చైత్రము

సంవత్సరం: క్రోదినామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగులకు ప్రశంసలు ఉంటాయి. దగ్గరివారితో విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఆశయాలు నెరవేరతాయి. చేసే పనుల్లో స్పష్టత వస్తుంది. నైపుణ్యాలను పెంచుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలి. నూతన మార్గాలను అన్వేషించండి. ఏకాగ్రతతో ముందుకు సాగండి. పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఆర్థికంగా బాగుంటుంది. కాలం వృథా చేయకుండా లక్ష్యంపై దృష్టి నిలపండి. విశాలమైన దృక్పథంతో మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి. పనులు ప్రారంభించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. విఘ్నాలు ఎదురైనా సంకల్పబలంతో అనుకున్నది సాధిస్తారు. సహనం అవసరం. సున్నితమైన అంశాల్లో లోతుగా ఆలోచించవద్దు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మధ్యస్థ ఫలితాలుంటాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి ఫలితాలను సాధించాలి. ఆవేశంగా మాట్లాడితే సమస్యలు పెరుగుతాయి. కృషినిబట్టి ఫలితాలుంటాయి. కాబట్టి పరిస్థితులను అర్ధం చేసుకుంటూ ప్రయత్నాలను కొనసాగించాలి. పనుల్ని మధ్యలో ఆపవద్దు. దేనికీ వెనుకడుగు వేయవద్దు. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సమిష్టి కృషి చేయాలి. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యకార్యాల్లో ధైర్యంగా ఉండాలి. నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు వేయవద్దు. సంకోచం పనికిరాదు. కుటుంబసభ్యుల సూచనలు మేలుచేస్తాయి. లక్ష్మీఅష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలోనూ లాభాలు గోచరిస్తున్నాయి. శుభవార్త వింటారు. కుటుంబంతో ఆనందముగా గడుపుతారు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. అభీష్ట సిద్ధి కలుగుతుంది. గృహ వాహన భూ యోగాలు అనుకూలం. ఇప్పుడు తీసుకొనే నిర్ణయాలు ఆర్థిక శక్తినిస్తాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ పెద్దల సహకారం పొందుతారు. తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ పనులలో కాలయాపన జరుగుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా రావచ్చు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ స్తోత్రం పఠించండి.

తులా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. వృత్తిలో మంచి పేరు సంపాదిస్తారు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తాయి. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉటారు. పదోన్నతి, అనుకూల బదిలీ ఉండవచ్చు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పోటీతత్వంతో పనిచేయడం ద్వారా లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించాలి. ఉద్యోగం శుభప్రదం. ధన ధాన్యాది లాభాలున్నాయి. పెట్టుబడులు సత్ఫలితాన్నిస్తాయి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు వ్యాపారపరంగా లాభాలున్నాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలిస్తాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. మంచివార్త వింటారు. కృషి ఫలిస్తుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఏకాగ్రతతో పనిచేసి విజయాలు సాధించండి. గతంలో ఆగిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆశయ సాధనలో పురోగతి ఉంటుంది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగంలో ఒత్తిడికి లోనైతే పొరపాట్లు జరుగుతాయి. సహనాన్ని పరీక్షించే పరిస్థితులుంటాయి. ఓర్పు వహించండి. మనోబలంతో పనిచేయండి. విఘ్నాలను అధిగమించి విజయాలు సాధిస్తారు. సకాలంలో పనిచేయడం ద్వారా లక్ష్యం సిద్ధిస్తుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉందాలి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం పనికిరాదు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కొత్త అవకాశాలు వస్తాయి. అయితే వృథా ఖర్చులతో ఇబ్బందులు రావచ్చు. బరువు, బాధ్యతలు పెరిగినా సంతృప్తిగా ఉంటారు. వ్యాపారులకు ఒప్పందాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలుంటాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు ఉద్యోగపరంగా శుభఫలితాలున్నాయి. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. సమస్యలు తొలగుతాయి. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సుస్థిరత ఏర్పడుతుంది. ధనాన్ని పొదుపుగా వాడితే భవిష్యత్తు బాగుంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel