ఆగస్ట్ 30 నేటి రాశి ఫలాలు- ఈ రాశుల ఉద్యోగులకు ప్రమోషన్ దక్కే అవకాశం పుష్కలంగా ఉంది
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ30.08.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 30.08.2024
వారం: శుక్రవారం, తిథి: ద్వాదశి,
నక్షత్రం: పునర్వసు, మాసం: శ్రావణము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు కొంతవరకూ పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కుతాయి. కళాకారులకు సన్మానయోగం. ఖర్చులు అధికంగా ఉండొచ్చు. గులాబీ, తెలుపు రంగులు కలిసి వస్తాయి. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
వృషభం
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వాళ్ళు ఎంతటి కార్యాన్నైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. రావలసిన సొమ్ము అందుతుంది. వివాహ వేడుకల్లో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎరుపు, నేరేడు రంగులు ధరించండి. మంచి జరుగుతుంది. దేవీస్తోత్రాలు పఠించండి.
మిథునం
చేపట్టిన కార్యక్రమాలు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. సోదరులు, సోదరీల నుంచి సహాయం అందుతుంది. ఇంతకాలం వేధించిన సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. భూవివాదాలు తీరతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు ఆశించిన పోస్టులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఖర్చులు ఉండవచ్చు. గులాబీ, ఆకుపచ్చ రంగులు శుభ ఫలితాలు అందిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
కర్కాటకం
పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు నూతనోత్సాహం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి. వ్యయ ప్రయాసలు ఉన్నాయి. గులాబీ, లేత పసుపు రంగులు కలిసి వస్తాయి. కనకధారా స్తోత్రం పఠించండి.
సింహం
ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు అవార్డులు. ధనవ్యయం సూచితం. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. నలుపు, ఆకుపచ్చ రంగులు శుభ ఫలితాలు అందుతాయి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి.
కన్య
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలు ఎక్కువగా ఎదురు కావచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. నీలం, నేరేడు రంగుల దుస్తులు ధరించండి. శివపంచాక్షరి పఠించండి.
తుల
అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కొంత శ్రమపడాల్సిన సమయం. ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపార లావాదేవీలు కాస్త పుంజుకుంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి. ఉద్యోగులకు పనిభారం తగ్గే సూచనలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు చేయాల్సి రావచ్చు. వృథా ఖర్చులు ఉన్నాయి. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు మంచి ఫలితాలు అందిస్తాయి. దుర్గాదేవిని పూజించండి.
వృశ్చికం
అనుకున్న కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు సొమ్ము అందుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. ఆస్తి వివాదాలు కొంతమేరకు పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు మరింత హుషారుగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు తథ్యం. వివాదాలు ఎదురు కావచ్చు. ధనవ్యయం సూచితం. పసుపు, తెలుపు రంగులపై ఆసక్తి చూపించండి. శివస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు
ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇంటా బయటా ఒత్తిడులు ఎదురవుతాయి. అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు. నిరుద్యోగులకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. చిరకాల మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు అవకాశాలు నిరాశకలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. నీలం, లేత ఆకుపచ్చ రంగులపై దృష్టి పెట్టండి. విష్ణు ధ్యానం చేయండి.
మకరం
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వాళ్ళు ఈరోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. శ్రమాధిక్యం. పసుపు, లేత ఎరుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.
కుంభం
కొంత జాప్యం జరిగినా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది. విద్యార్థుల ప్రతిభ నిరూపించుకుంటారు. ఆస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు సన్మానాలు. వ్యయప్రయాసలు. గులాబీ, నేరేడు రంగులు, హనుమాన్ చాలీసా పఠించండి.
మీనం
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్య నిర్ణయాలలో లోపాలను సరిదిద్దుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఉద్యోగలాభం. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగల అవకాశాలు. కళాకారులకు అన్ని విధాలా కలసి వస్తుంది. వ్యయ ప్రయాసలు తప్పక పోవచ్చు. గులాబీ, ఆకుపచ్చ రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.