ఆగస్ట్ 28, నేటి రాశి ఫలాలు- ఈ రాశి వారికి ప్రత్యర్థులు సైతం చేయూతను అందిస్తారు
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ28.08.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 28.08.2024
వారం: బుధవారం, తిథి : దశమి,
నక్షత్రం: మృగశిర, మాసం : శ్రావణము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు పొందుతారు. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీ నిర్ణయాల కోసం మిత్రులు ఎదురుచూస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. నృసింహ స్తోత్రాలు పఠించండి.
వృషభం
విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. చేపట్టిన కార్యక్రమాలల్రా ముందడుగు వేస్తారు. ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారి చేయూతనిస్తారు. వాహన, కుటుంబ సౌఖ్యం. శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులు, కుటుంబసభ్యులు సూచనలు. పాటిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగాలు మరింత పురోగతి సాధిస్తారు. రాజకీయవేత్తలు కార్యసాధనలో విజయం పొందుతారు. మహిళలకు బంధువుల నుంచి కీలక సమాచారం. శివారాధన మంచిది.
మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి పలుకుబడి పెరిగి అందరిలోనూ గుర్తింపు పొందుతారు. చిరకాల ప్రత్యర్థులతో రాజీకి వస్తారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఉద్యోగయత్నాలు సానుకూలం ఫలితాలు అందిస్తాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళాకారులకు ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దుర్గా స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం
కొన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. మీపై వచ్చిన విమర్శల నుంచి చాకచక్యంగా బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. సోదరులు, సోదరీల నుంచి పిలుపు రావచ్చు. రియల్ఎస్టేట్ వారు కొంత నిరాశ చెందుతారు. ఆలోచనలు కలసివస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు ఉత్సాహవంతంగా గడుపుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి ఒడ్డున పడతారు. రాజకీయవేత్తలకు కొత్త అవకాశాలు. మహిళలకు ఆస్తుల లాభాలు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహం
అందరిలోనూ మీపై ఆదరణ పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. రాబడి మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తొలగుతాయి. శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. బంధువుల సలహాలు, తోడ్పాటుతో కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. మీ ఆలోచనలు అమలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. కళాకారులు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహిళలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. అన్నపూర్ణాష్టకం పఠించండి.
కన్య
కొన్ని నిర్ణయాలపై కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతారు. రాబడి మరింతగా పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. కళాకారులకు కీలక సందేశం అందుతుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. శివాష్టకం పఠించండి.
తుల
ఆశించినంత రాబడి దొరుకుతుంది. చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు మిత్రులతో పంచుకుంటారు. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య సయోధ్య నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి సహాయం పొందుతారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార లావాదేవీల్లో మరింత ఉత్సాహవంతంగా ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత పురోగతి కనిపిస్తుంది. మహిళలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కనక దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం
అనూహ్యమైన రీతిలో సొమ్ము భార్యాభర్తలు, సోదరీసోదరుల మధ్య విభేదాలు తొలగుతాయి. చేపట్టిన కార్యాలలో అవాంతరాలు తొలగి ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విశేష ఆదరణ పొందుతారు. వాహనాలు, స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వేడుకలకు డబ్బు వెచ్చిస్తారు. ఉద్యోగయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో సమస్యలు తీరతాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. మహిళలకు బంధువులతో సఖ్యత. శివుని స్తోత్రాలు పఠించడం మంచిది.
ధనుస్సు
వ్యయ ప్రయాసలు ఉండొచ్చు. అనుకున్న కార్యాలలో ఆటంకాలు ఎదురై ఎదురీదవలసిన సమయం. ఆరోగ్యం, కుటుంబసమస్యల మధ్య ఉక్కిరిబిక్కిరి కాగలరు. అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బందులు పడతారు. భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు నెలకొంటాయి. కొన్ని సమస్యల పరిష్కారానికి స్నేహితులను ఆశ్రయిస్తారు. ధార్మిక కార్యక్రమాలను చేపట్టి కొంత ఉపశమనం పొందుతారు. ముఖ్య నిర్ణయాలలో తడబాటు వద్దు, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు, సమస్యలు పెరిగినా ఆత్మవిశ్వాసంతో సాగుతారు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
మకరం
స్నేహితులు మీపట్ల ఆప్యాయత చూపుతారు. సమాజంలో మరింత పేరు, ప్రతిష్టలు పొందుతారు. రాబడి ఆశాజనకంగా ఉండి రుణాలు తీరుస్తారు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు మన్నించడంతో ఉత్సాహంగా సాగుతారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా కొనసాగుతాయి. వేడుకలకు హాజరవుతారు. కాంట్రాక్టర్లు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాల్లో అనుకున్న పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. హనుమాన్ చాలీసా పఠించండి.
కుంభం
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి కార్యక్రమాలలో అవాంతరాలు అధిగమిస్తారు. కొంతకాలంగా వేధిస్తున్న వివాదాలు పరిష్కారం. అనుకున్న రాబడి దక్కి అవసరాలు తీరతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. పరపతి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. భార్యాభర్తలు వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు అవకాశాలు ఊహించని విధంగా దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార లావాదేవీలలో మరింత ఉత్సాహంగా గడుస్తుంది. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు నూతనోత్సాహం. మహిళలకు మరింత అనుకూల సమయం. గణేశాష్టకం పఠించండి.
మీనం
ఎంతటి వారినైనా చాకచక్యంగా మీ వైపునకు ఆకట్టుకుంటారు. అనుకున్న కార్యాలలో విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశించిన రాబడి సమకూరి అవసరాలు తీరతాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు సమస్యలు తీరే సమయం. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు మానసిక ఆందోళన తొలగుతుంది. దత్తాత్రేయుని పూజించాలి.