Money Tips: ఏ 5 మందికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు? ఈ తప్పు చేస్తే పశ్చాత్తాపపడతారు చూసుకోండి
Money Tips: కష్టాల్లో ఉంటే వారికి తోడుగా ఉండాలి, ఆదుకోవాలి. కానీ కొంత మందికి అప్పు ఇవ్వడం వలన తరవాత మనమే బాధ పడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఏ 5 మందికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులను అప్పుగా ఇవ్వకూడదు చూసేద్దాం.

కొంతమంది కొన్ని కొన్ని సార్లు ఆర్థిక ఇబ్బందులు వలన అప్పు అడుగుతూ ఉంటారు. అప్పు తీసుకుని మళ్ళీ కొంతకాలం తర్వాత తిరిగి చెల్లిస్తూ ఉంటారు. కొంతమందికి అప్పు ఇచ్చినా పర్వాలేదు. కానీ, వీరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వకూడదు. మనందరం మానవులం.
ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఒకరు కష్టాల్లో ఉంటే వారికి తోడుగా ఉండాలి, ఆదుకోవాలి. కానీ కొంతమందికి అప్పు ఇవ్వడం చాలా తప్పు. మరి ఎటువంటి వారికి అసలు అప్పు ఇవ్వకూడదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
ఈ ఐదుగురికి అప్పు ఇవ్వకండి
1.తప్పులు చేసేవారు
కొంతమంది ఎప్పుడూ తప్పులు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి డబ్బు ఇచ్చినా, దానిని అనవసరంగా వృధా చేస్తారు. ఇలాంటి వారికి డబ్బు ఇస్తే ఆ డబ్బు అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులా మారిపోతుంది.
2.బాధ్యత లేని వారు
కొంతమందికి బాధ్యత ఉండదు. బాధ్యతగా ఉన్న వ్యక్తి సరిగ్గా డబ్బుని సద్వినియోగం చేసుకుంటారు. అదే బాధ్యత లేని వ్యక్తి డబ్బుని వృధా చేసుకుంటారు. అలాంటి వారికి కూడా అప్పు ఇవ్వడం మంచిది కాదు.
3.మత్తుకు బానిసలు
కొందరు మత్తు పదార్థాలకు బానిసలైపోతుంటారు. అలాంటి వారికి డబ్బు ఇస్తే అది గోడకు కొట్టిన సున్నంలా తిరిగి రాదు. కాబట్టి మత్తుపదార్థాలకు బానిసలు అయిన వారికి కూడా అప్పు ఇవ్వకపోవడంలో తప్పులేదు.
4.తెలియని వారు
కొంతమందికి మనం ఎవరో తెలియకపోయినా సరే అప్పు అడుగుతూ ఉంటారు. వారికి కావాల్సింది డబ్బు మాత్రమే. ఎవరు అనేది అవసరం లేదు. అలాంటి వారికి డబ్బు ఇస్తే అస్సలు వెనక్కి రావు. మనం పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. మన డబ్బు తిరిగి రాదు.
5.ఆధిపత్యం చెలయించే వారు
కొంతమంది ఆధిపత్యం చెలయిస్తూ ఉంటారు. ఇలా దృఢమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులకి రుణాలు ఇవ్వకూడదు. అలాంటివారికి అప్పుగా ఇచ్చిన డబ్బు రికవరీ చేయడం కష్టం. డబ్బు తిరిగి చెల్లించమంటే బెదిరించడం లాంటివి చేస్తారు. కాబట్టి అలాంటి వారికి కూడా అప్పు ఇవ్వకూడదు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం