Tortoise Ring: తాబేలు ఉంగరాన్ని ఏ వేలుకు ధరించాలి? ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు!-to which finger one should keep tortoise ring check the rules and get lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tortoise Ring: తాబేలు ఉంగరాన్ని ఏ వేలుకు ధరించాలి? ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు!

Tortoise Ring: తాబేలు ఉంగరాన్ని ఏ వేలుకు ధరించాలి? ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు!

Peddinti Sravya HT Telugu

Tortoise Ring: చాలా మంది తాబేలు ఉంగరాన్ని ధరిస్తారు. ఈ ఉంగరాన్ని పెట్టుకోవడం వలన అనేక లాభాలను పొందవచ్చు. ఎందుకు తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవాలి?, తాబేలు ఉంగరాన్ని పెట్టుకునేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి? వంటి ముఖ్య విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.

తాబేలు ఉంగరాన్ని పెట్టుకునేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి? (pinterest)

ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. కొంతమంది అదృష్టం రావాలని, అన్నీ కలిసి రావాలని అనుకుంటారు. అందుకోసం చేతికి ఉంగరాలు పెట్టుకోవడం, జ్యోతిష్య నిపుణుల సలహాలు తీసుకుని కొన్ని రకాల రంగు రాళ్ళను ధరించడం వంటివి చేస్తూ ఉంటారు.

చాలా మంది తాబేలు ఉంగరాన్ని కూడా పెట్టుకుంటారు. తాబేలు ఉంగరాన్ని ధరిస్తే ఎలాంటి లాభాలను పొందవచ్చు?, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఎందుకు తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవాలి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలు ఉంగరాన్ని శుభప్రదంగా భావిస్తారు. తాబేలు ఉంగరాన్ని ధరిస్తే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తాబేలు ఉంగరాన్ని పెట్టుకునేటప్పుడు చేయకూడని పొరపాట్లు తెలుసుకోండి. తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవాలని అనుకునేవారు సరైన విధంగా పెట్టుకోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి.

తాబేలు ఉంగరాన్ని పెట్టుకునేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి?

శుద్ధి చేసి: తాబేలు ఉంగరం పెట్టుకోవాలనుకునేవారు ముందు దానిని శుద్ధి చేయాలి. పాలు, గంగాజలంలో కొంచెం సేపు వదిలేసి ఆ తర్వాత ఆ పెట్టుకోవాలి.

లక్ష్మీదేవి అనుగ్రహం: తాబేలు ఉంగరాన్ని శుద్ధి చేసిన తర్వాత లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టి పూజ చేయడం మంచిది. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

ఏ రోజు ధరించాలి: తాబేలు ఉంగరాన్ని గురువారం లేదా శుక్రవారం నాడు పెట్టుకుంటే శుభ ఫలితాన్ని పొందవచ్చు.

ఏ వేలుకు ధరించాలి: తాబేలు ఉంగరాన్ని చూపుడు వేలుకి కానీ మధ్య వేలుకి కానీ పెట్టుకోవచ్చు. కుడి చేతికి మాత్రమే పెట్టుకోవాలి.

ఏ వైపు పెట్టుకోవాలి: తాబేలు ఉంగరాన్ని పెట్టుకునేటప్పుడు తాబేలు ముఖం మీ వైపు ఉండేటట్టు చూసుకోవాలి. రివర్స్ లో మాత్రం పెట్టుకోకూడదు.

వెండి ఉంగరం: తాబేలు ఉంగరం వెండితో తయారు చేసింది అయితే మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా బయటపడొచ్చు.

గురువారం నాడు తాబేలు ఉంగరాన్ని శుద్ధి చేసి, లక్ష్మీదేవికి ముందు పెట్టి పూజ చేసి, ఆ తర్వాత శుక్రవారం నాడు పైన చెప్పిన విధంగా పెట్టుకుంటే శుభ ఫలితాన్ని పొందవచ్చు. ఇలా ఈ ప్రకారం తాబేలు ఉంగరాన్ని పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. సంతోషంగా ఉండొచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం