Lucky zodiac signs: 2025 వరకు ఈ రాశుల వారికి ఆర్థిక సమస్యలే ఉండవు.. అంతా ఆనందక్షణాలే-till 2025 these zodiac signs get never face financial troubles ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lucky Zodiac Signs: 2025 వరకు ఈ రాశుల వారికి ఆర్థిక సమస్యలే ఉండవు.. అంతా ఆనందక్షణాలే

Lucky zodiac signs: 2025 వరకు ఈ రాశుల వారికి ఆర్థిక సమస్యలే ఉండవు.. అంతా ఆనందక్షణాలే

Gunti Soundarya HT Telugu

Lucky zodiac signs: 2025 వరకు కొన్ని రాశుల వారికి శనీశ్వరుడి అనుగ్రహంతో ఆర్థిక కష్టాలే ఉండవు. అంతా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏడాది మొత్తం శని కుంభ రాశిలోనే సంచరిస్తాడు.

2025 వరకు ఈ రాశుల వారికి ఆర్థిక సమస్యలే ఉండవు

Lucky zodiac signs: నవగ్రహాలలో శనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇస్తాడని అంటారు. ఒక వ్యక్తి పనికి అనుగుణంగా రెట్టింపు ప్రతిఫలం ఇవ్వగలుగుతాడు. అందుకే శని సంచారం అన్నీ రాశులపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. శని తన శుభ దృష్టిని ఉంచి వ్యక్తులకు అన్నీ సంతోషాలు ఇస్తాడు. అదే అశుభ దృష్టి ఉంటే జీవితం బాధలతో నిండి ఉంటుందని చెబుతారు.

శని గతేడాది కుంభ రాశిలోకి ప్రవేశించింది. ఇది శని సొంత రాశి. శని 2024 చివరి వరకు కూడా కుంభ రాశిలో ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రంలో శనిని పాపాత్మకమైన, క్రూరమైన గ్రహం అంటారు. శని గ్రహ అశుభాల వల్ల మనిషికి అనేక సమస్యలు ఎదురవుతుండగా, శనిగ్రహం వల్ల ఆ వ్యక్తికి శుభాలు కలుగుతాయి. శని ఒక రాశిలో 30 నెలలు సంచరిస్తాడు. డిసెంబర్ నెలాఖరు వరకు శనిదేవునికి కొన్ని రాశుల వారికి విశేష ఆశీస్సులు ఉంటాయి. డిసెంబర్ నెలాఖరు వరకు ఏయే రాశుల వారికి శనిదేవుడు దయగా ఉంటాడో తెలుసుకుందాం.

మేష రాశి

శని సంచారంతో మేష రాశి వారికి ఏడాది చివర వరకు అన్నీ మంచి రోజులే. ధనలాభం ఉంటుంది, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితులతో సమయం గడుపుతారు. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయాన్ని శుభప్రదంగా చెప్పవచ్చు.

మిథున రాశి

2025 వరకు మిథున రాశి వారికి ఆనంద క్షణాలే ఉంటాయి. ఆర్థిక కోణం బలంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీరు చాలా గౌరవం పొందుతారు. పదవులు, ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పనిలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వాహన సౌఖ్యం పెరుగుతుంది.

సింహ రాశి

సింహ రాశికి సూర్యుడు అధిపతి. ఈ రాశి వారికి శని ఆశీస్సులు ఏడాది మొత్తం లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలలో లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. గౌరవం, సమాజంలో మీ స్థానం, ప్రతిష్టలు పెరుగుతాయి. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో లాభసాటి అవకాశాలున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

శని అనుగ్రహం పొందే మార్గాలు

శనివారం శనీశ్వరుడికి ప్రీతికరమైన రోజు. అటువంటి శనివారం నాడు శని ఆశీస్సులు పొందేందుకు కొన్ని పనులు చేయాలి. అలాగే కొన్ని పనులు చేయకూడదు. జాతకంలో శని చెడుగా ఉంటే ఆ వ్యక్తి శనివారం పొరపాటున కూడా బూట్లు, చెప్పులు కొనుగోలు చేయకూడదు. ఇలా చేస్తే శని దేవుడి అనుగ్రహం పొందలేరు.

అయితే అవసరంలో ఉన్న వారికి బూట్లు, చెప్పులు దానం చేస్తే శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. ఇనుము దానం చేయడం వల్ల శని సంతోషిస్తాడు. కానీ శనివారం నాడు మాత్రం ఇనుము కొనుగోలు చేయడం అశుభంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకార శనివారం ఉప్పు కొనడం వల్ల ఆర్థిక పరిస్థితి మీద చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. శనివారం జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల శని దేవుడు అసంతృప్తి చెందుతాడని చెబుతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.