హిందూ మతంలో, జ్యోతిష్య శాస్త్రంలో రంగులకు, దారాలకు, గ్రహాలతో ప్రత్యేక సంబంధం ఉంటుంది. నలుపు రంగు శని దేవుడితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. శని దేవుడిని ఆరాధించేటప్పుడు శనివారం ఉత్తమమైన రోజు. శనివారం నాడు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే జీవితంలో ఆటంకాలు ఉండవు. ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. శని దోషాల నుంచి కూడా బయటపడవచ్చు.
చాలామంది కాళ్లకు నల్ల దారం కట్టుకోవడం మీరు చూసే ఉంటారు. బొటన వేలకు కూడా ఎక్కువగా నల్లదారాన్ని కట్టుకుంటారు. బొటన వేలికి నల్ల దారాన్ని కట్టుకోవడానికి శనివారం ఉత్తమమైన రోజు అని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. కాలి బొటన వేలికి నల్ల దారం కట్టుకోవడం వలన ఏమవుతుంది?, దాని వలన ఎటువంటి లాభాలను పొందవచ్చు?, ఎలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శని గ్రహానికి చిహ్నంగా నల్లదారాన్ని చెబుతారు. ఒక వ్యక్తి జాతకంలో శని అశుభ స్థానంలో ఉంటే, శనివారం నాడు కాలి బొటనవేలికి నల్ల దారాన్ని కట్టుకోవడం మంచిది. ఇలా చేయడం వలన శని దుష్ఫలితాల నుంచి బయటపడవచ్చు. ఆటంకాలు కూడా తొలగిపోతాయి.
బొటన వేలికి నల్ల దారాన్ని కట్టుకుంటే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఎడమ కాలి బొటన వేలికి నల్ల దారాన్ని కట్టుకుంటే సమతుల్యంగా ఉంచుతుంది. చెడు దృష్టి సమస్య కూడా ఉండదు. భయం నుంచి కూడా బయటపడవచ్చు.
కాలి బొటన వేలికి నల్ల దారాన్ని కట్టుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. శనివారం ఇలా దారాన్ని కట్టుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.
ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా, వ్యాపారంలో నష్టాలు కలగకుండా ఉండాలన్నా, ఉద్యోగం పోకుండా ఉండాలన్నా శనివారం నాడు ఎడమ కాలి బొటన వేలికి నల్ల దారాన్ని కట్టుకుంటే శుభ ఫలితాలను పొందవచ్చు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు తొలగిపోతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.