Lucky zodiac signs: జ్యోతిషశాస్త్రంలో దేవగురువు బృహస్పతి, కుజుడు రెండూ శుభానికి చిహ్నాలు. జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని ధైర్యం, శౌర్యం, భూమి, శక్తికి కారకంగా పరిగణిస్తారు. బృహస్పతి ఆనందం, సంపద, వైభవం, ఐశ్వర్యం, జ్ఞానానికి కారకుడిగా చెప్తారు.
ఏడాదికి ఒకసారి గురు గ్రహం తన రాశిని మార్చుకుంటుంది. అలా ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఏడాది మొత్తం ఇదే రాశిలో ఉంటాడు. ఇక కుజుడు 45 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. మరికొన్ని రోజుల్లో కుజుడు బృహస్పతి ఉన్న రాశిలోకి ప్రవేశిస్తాడు. పన్నెండు సంవత్సరాల తర్వాతదేవగురువు బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు అంగారకుడు జూలై 12, 2024 రాత్రి 07:12 గంటలకు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు.
కుజుడు ఏ రాశిలోనైనా దాదాపు 45 రోజుల పాటు ఉంటాడు. అటువంటి పరిస్థితిలో కొన్ని సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో కుజుడు, బృహస్పతి కలయిక ఏర్పడుతుంది. కుజుడు, గురుగ్రహం కలిసి ఏ రాశుల వారికి ప్రయోజనం చేకూరుస్తారో తెలుసుకుందాం.
గురు, కుజుడి కలయిక మేష రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కలయిక మీ డబ్బు ఇంట్లో ఏర్పడుతుంది. బృహస్పతి, కుజుడు కలిసి ఆకస్మిక ధన సంపదను తెచ్చిపెడ్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరవబడతాయి. మీరు పొదుపు చేయడంలో కూడా విజయం సాధిస్తారు. ఈ కాలం మీకు ఆర్థిక పురోగతిని కలిగిస్తుంది. మీ కలలలో ఏదైనా ఈ సమయంలో నిజం కావచ్చు. బృహస్పతి అనుగ్రహంతో సంపద పెరుగుతుంది. వైవాహిక జీవితంలోని సమస్యలు తగ్గిపోతాయి.
కర్కాటక రాశి వారికి కుజుడు, బృహస్పతి గ్రహాల కలయిక అనుకూల ఫలితాలను తెస్తుంది. పదకొండో ఇంట్లో ఈ గ్రహాల సంయోగం జరుగుతుంది. ఈ గ్రహాల కలయిక వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి సహాయంతో మీరు కొన్ని పనుల్లో విజయం సాధించగలరు. ఇది మాత్రమే కాదు మీరు కొత్తదాన్ని నేర్చుకోవాలనే ఆలోచనను కూడా చేయవచ్చు. 45 రోజుల పాటు మీ అదృష్టానికి అడ్డే ఉండదు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యం పనులు చేపట్టి విజయాలు సాధిస్తారు. సంతోషంతో జీవితం సాగిపోతుంది.
గురు, కుజుడు కలిసి సింహ రాశి వారికి శుభ ఫలితాలు అందజేస్తారు. సింహ రాశి పదో ఇంట్లో కుజ,గురు గ్రహాల కలయిక జరగబోతుంది. ఈ రాశి వారికి కూరుకుపోయిన ధనాన్ని పొందే అవకాశం వస్తుంది. ఈ రెండు గ్రహాల కలయిక మీ కెరీర్, ఉద్యోగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కష్టకాలంలో తండ్రి నుండి మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో డబ్బు ఆదా చేయడంతో పాటు మీరు కొత్త ఆదాయ వనరులను కూడా కనుగొనగలుగుతారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.