Trigrahi yogam: వారం తర్వాత మూడు గ్రహాలు కలిసి 3 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి
Trigrahi yogam: సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన వెంటనే శుక్రుడు, బుధుడు, సూర్యుని కలయిక ఉంటుంది. చంద్ర రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారు ధనవంతులు కాగలరు.
Trigrahi yogam: సంపదను ఇచ్చే శుక్రుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఇక గ్రహాల రాకుమారుడైన బుధుడు కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశిచక్రం చంద్రునికి చెందినది. త్వరలో కర్కాటక రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది.

జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. సుమారు ఏడాది తర్వాత సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దీన్ని కర్కాటక సంక్రాంతి అంటారు. ఈ సమయం నుంచి ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. కర్కాటక రాశిలో మూడు గ్రహాలైన శుక్రుడు, బుధుడు, సూర్యుని కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది.
ఇది మాత్రమే కాకుండా సూర్యుడి రాకతో మరో మూడు రాజయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. శుక్రుడు సూర్యుడు కలిసి శుక్రాదిత్య యోగం ఇస్తాయి. బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఇస్తాయి. ఇది మాత్రమే కాకుండా బుధుడు, శుక్రుడు కలిసి లక్ష్మీనారాయణ యోగాన్ని ఇస్తున్నాయి. ఈ రెండు గ్రహాలు జులై నెలలో రెండు సార్లు ఈ రాజయోగం ఇస్తాయి. కర్కాటక రాశిలో ప్రస్తుతం లక్ష్మీ నారాయణ యోగం జరుగుతుండగా, నెలాఖరున మరొకసారి సింహ రాశిలో ఇదే రెండు గ్రహాల కలయిక వల్ల మళ్ళీ యోగం ఏర్పడుతుంది.
కర్కాటకంలో మూడు పెద్ద గ్రహాల కలయిక జూలై 19 వరకు ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్ట సమయం ప్రారంభమవుతుంది. బుధ, శుక్ర, సూర్యుని సంచారం వల్ల ఏ రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుందో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
బుధుడు, శుక్రుడు, సూర్యుని కదలిక వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు అనేక కొత్త వనరులను ఎదురుపడతాయి. ఈ నెలలో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు కెరీర్ జీవితంలో కొన్ని కొత్త బాధ్యతలను పొందవచ్చు. అదే సమయంలో, మీరు మీ భాగస్వామి లేదా ప్రేమికుడితో మంచి సమయాన్ని గడుపుతారు.
మిథున రాశి
శుక్రుడు, సూర్యుడు, బుధ గ్రహాల కలయిక మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా సానుకూలంగా ఉంటారు. ప్రతి పనిలోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. అదే సమయంలో, మీరు పిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు. మూడు గ్రహాల కలయిక వల్ల వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి.
సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఫలితంగా ఈ రాశి వారికి సూర్యుడి కదలిక అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది. సింహ రాశి వారికి బుధుడు, శుక్రుడు, సూర్యుని కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రహాల కదలికలో మార్పు కారణంగా, ఈ రాశికి చెందిన వ్యక్తులు మతపరమైన కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం. ప్రేమ జీవితం శృంగారభరితంగా ఉంటుంది. కష్ట సమయాల్లో మీరు మీ కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.