జూన్ 9 నుంచి కొత్త వారం ప్రారంభం అయ్యింది. ఈ వారం అనేక గ్రహాల సంయోగం చోటు చేసుకోనుంది. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రం ఇది లాభాలను తీసుకు వస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూన్ 15న సూర్యుడు మిధున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే మిధున రాశిలో గురువు, బుధుడు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో సూర్యుడు, బుధుడు సంయోగం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.
ఇదే సమయంలో, జూన్ 13న శుక్రుడు భరణి నక్షత్రంలోకి, గురుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు. ఈ గ్రహాల సంచార ప్రభావం కొన్ని రాశులపై ఎంతో అనుకూలంగా ఉండనుంది. ఈ వారం మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. వారు కోరుకున్నవి పూర్తవుతాయి. వృత్తి పరంగా కూడా కలిసి వస్తుంది. మరి ఆ అదృష్ట రాశులెవరో ఇప్పుడు చూద్దాం.
ఈ వారం మిథున రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు ఇష్టపడే వ్యక్తి కుటుంబంలోకి వస్తారు. పాత పనుల నుంచి వచ్చే టెన్షన్ తొలగిపోతుంది. కెరీర్‌లో విజయాలు సాధిస్తారు. కష్టానికి తగిన ఫలితం అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ప్రేమగా, సంతోషంగా ఉండగలుగుతారు. వైవాహిక జీవితం మధురంగా మారుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ధనవర్షం కురిసే అవకాశముంది.
సింహ రాశి వారికి జూన్ నెల ఎంతో కలిసి వస్తుంది. ఈ వారం ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. భయాలు తొలగిపోతాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒత్తిడి తగ్గి, మనశ్శాంతి లభిస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కెరీర్‌లో మంచి ఫలితాలు కనపడతాయి. అభివృద్ధికి దారితీసే అవకాశాలు వస్తాయి.
ధనస్సు రాశి వారికి ఈ వారం ఎంతో బాగుంటుంది. క్రియేటివ్ పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. వారం రోజుల పాటు ఇంటికి దూరంగా ఉన్నవారు కుటుంబంతో కలసి ఆనందంగా గడుపుతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.