ఏ పూజ చేసినా మొట్టమొదట వినాయకుడిని పూజిస్తాము. వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలు అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చని, మనం చేసే పనిలో ఆటంకాలు తొలగిపోతాయని అందరూ నమ్ముతారు. అయితే వినాయకుడి ఆలయాలు చాలా ఉన్నాయి. శక్తివంతమైన వినాయక ఆలయాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు.
ఇది చాలా శక్తివంతమైన ఆలయం. ఇక్కడికి వెళ్లి వినాయకుడికి ఒక్క రూపాయి సమర్పిస్తే సరిపోతుంది. కోరికలన్నీ తీరిపోతాయి. మరి మన కోరికలన్నీ తీర్చేసే ఆ వినాయక ఆలయం ఎక్కడ ఉంది? ఈ రూపాయి గణపతి ఆలయానికి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
గణపతికి వివిధ రూపాలు ఉంటాయన్న విషయం మనకు తెలుసు, కానీ రూపాయి గణపతి ఉన్నారన్న విషయం మనకే తెలియదు. రూపాయి గణపతి అంటే రూపాయలతో చేసినది కాదు. ఈ ఆలయానికి వెళ్లి ఒక్క రూపాయి సమర్పిస్తే కోరికలను తీర్చే గణపతి ఆలయం ఇది. స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లాలంటే చేతిలో ఒక్క రూపాయి ఉంటే సరిపోతుంది. కోరికలన్నీ తీరిపోతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు, భయాలు ఇవన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.
తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న వడిసలేరు ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. రాజానగరం నుంచి సామర్లకోట వెళ్లే దారిలో వడిసలేరు ఉంటుంది. ఆ ఊరిలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో వినాయకుడికి ఒక్క రూపాయి వేసి మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఎవరైనా వారి కోరికలు నెరవేరిన తర్వాత మళ్లీ స్వామి వారి దగ్గరికి వచ్చి ఇంకో రూపాయి వేసి వెళ్తూ ఉంటారట. ఈ ఆలయం చుట్టూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కనుక కాసేపు కూర్చుంటే కూడా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.