బాబా వైద్యనాథ్ ధామ్ జార్ఖండ్‌లోని డియోఘర్‌లో ఉంది. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. మహాశివరాత్రి పర్వదినాన, డియోఘర్‌లోని ప్రసిద్ధ బాబాధామ్‌లో అనేక మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు, వీటిలో శివ వివాహము నుండి చతుష్ప్రహార్ పూజ వంటి ప్రత్యేక దృశ్యాలు కనిపిస్తాయి.
మహా శివరాత్రికి ముందు దేవఘర్ బాబాదామ్‌లో ఉన్న మొత్తం 22 దేవాలయాలలో పంచశూలాలను ఏర్పాటు శుద్ధి చేసి, ఆలయ శిఖరాలపై మళ్లీ ప్రతిష్టించారు. వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
పంచశూలం అంటే ఏంటంటే? శివుని ఆలయంలో ఉండే త్రిశూలంలో మూడు కోణాలు ఉంటాయి. త్రిశూలం శివునికి ఇష్టమైన ఆయుధం. మహాదేవుని విగ్రహం కానీ శివలింగం కానీ త్రిశూలంతో అలంకరించబడి ఉంటుంది. పంచశూలంలో అయితే ఐదు కోణాలు ఉంటాయి. ఐదు సంఖ్య శివునికి ఎంతో ఇష్టం. దేశంలో అనేక ప్రాంతాలలో అందుకే పంచముఖి మహాదేవ ఆలయాలు కనపడుతూ ఉంటాయి.
ఇక్కడ డియోఘర్‌లో ఉన్న బాబా వైద్యనాథ ఆలయం శిఖరంపై ఉండే పంచశూలం మనుషుల ఐదు దుర్గుణాలు నుంచి కాపాడుతుందని నమ్ముతారు. కామం, కోపం, దురాశ, లోభం, అసూయ నుంచి రక్షిస్తుందని నమ్ముతారు.
ఈ ఆలయంలో ప్రతిష్టించిన పంచశూలం అన్ని బాధల నుంచి కాపాడుతుందని ప్రజల విశ్వాసం. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. త్రేతాయుగంలో రావణుడు బంగారు నగరంలో పంచశూలాన్ని ప్రతిష్టించాడట. ఎందుకంటే ఎక్కడైతే ఇది ఉంటుందో అక్కడ రక్షణ కవచంగా మారుతుందని నమ్ముతారు.
ఈ రక్షణ కవచాన్ని ఎలా ఛేదించాలో రావణుడికి ఒక్కడికే తెలుసు. అటువంటిది శ్రీరాముడు అతని సైన్యం లంకలోకి ప్రవేశించడం కష్టం. విభీషణుడు సహాయంతో రాముడు లంకకి ప్రవేశించే సమాచారాన్ని తెలుసుకున్నాడు. లంకా ప్రవేశం చేసి రావణుడిని సంహరించాడు.
మహా శివరాత్రి శుభ సందర్భంగా, చతుష్ప్రహార్ పూజను డియోఘర్‌లో నిర్వహిస్తారు. బాబాకు సింధూరాన్ని సమర్పించే ఆచారం ఉంది. ఈ క్రతువుతో శివ కళ్యాణం సంప్రదాయం పూర్తవుతుంది. అలాగే ఈరోజు బాబాకు నెమలి కిరీటం కూడా సమర్పిస్తారు. పెళ్లి కానీ వారు బాబాకు నెమలి కిరీటం సమర్పిస్తే ఆటంకాలు తొలగి వివాహం అవుతుందని ప్రజల నమ్మకం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం