Lord Vinayaka: ఈ భారతీయ ఆలయంలో, వినాయకుడి నిజ ముఖంతో విగ్రహం ఉందని మీకు తెలుసా?
Lord Vinayaka: తమిళనాడులో ఒక చిన్న ఆలయంలో వినాయకుడు మనిషి తల కలిగి ఉంటాడు. చాలా మంది ఈ ముఖం ఆయన అసలు ముఖమని, శివుడు తన శరీరానికి జోడించింది కాదని పేర్కొన్నారు.
వినాయకుడిని మనం విఘ్నాధిపతి అని కూడా అంటాము. వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోయి, మనం తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయని నమ్ముతాము. గణనాయకుడు, లంబోదరుడు ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడిని ఆరాధించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ధనం కలుగుతుంది. అలాగే విఘ్నాలు తొలగిపోతాయి.

వినాయకుడు తల వెనుక ఉన్న కథ
వినాయకుడి యొక్క అత్యంత సాధారణ విచిత్రం ఏంటంటే ఆయన ఏనుగు తల కలిగి ఉంటాడు. ఆయన ఏనుగు తల కలిగి ఉండడానికి గల కారణం ఏంటి? ఈ కథ గురించి తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు వినాయకుడిని పార్వతి దేవి సృష్టిస్తుంది. ఆమె అతనికి జీవం పోసింది. పార్వతి దేవి స్నానానికి వెళ్ళినప్పుడు, వినాయకుడిని కాపలాగా పెట్టి వెళ్తుంది. శివుడు అక్కడికి చేరుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తాడు.
శివుడు ఎవరో తెలియక వినాయకుడుని లోపలికి అనుమతించలేదు. ఇది ఘర్షణకు దారితీస్తుంది. శివుడు కోపాన్ని పెంచుకున్నాడు. ఒక దెబ్బలో గణేష్ తలని నరికి అతని శరీరం నుంచి వేరు చేస్తాడు.
పార్వతి ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఆమె గణేశుడికి జీవితాన్ని పునరుద్దించాలని, శివుడికి చెప్పింది. ఆ పై శివుని మనుషులు సజీవ శిరస్సు కోసం వెతకడానికి బయలుదేరుతారు. ఏనుగు పిల్లను కనుగొని గణేషుడికి శరీరానికి జోడించడానికి తలను తీసుకువచ్చారని చెప్తారు.
అసలు తలతో ఆలయం
తమిళనాడులో ఒక చిన్న ఆలయంలో వినాయకుడు మనిషి తల కలిగి ఉంటాడు. చాలా మంది ఈ ముఖం ఆయన అసలు ముఖమని, శివుడు తన శరీరానికి జోడించింది కాదని పేర్కొన్నారు.
తమిళనాడులోని కూతనూరు సమీపంలో తిలతర్పణపురిలో వినాయకుడి ఆలయంలో నర ముఖ వినాయకుని విగ్రహం ఉంటుంది. ఈ వినాయకుడు మానవ తలతో కలిగి ఉంటాడు. ఈ ఆలయంలో గ్రానైట్ తో చెక్కబడిన 5 అడుగుల ఎత్తు అయిన వినాయకుడి విగ్రహం ఉంది. ఇది ఒక అద్భుతమైన కళాఖండం అని చెప్పొచ్చు.
చాలా మందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే, శివుడు కోపంతో నరికిన గణేశుడు అసలు తల ఉందట. ఇతిహాసాల ప్రకారం ఉత్తరాఖండ్ లో ఒక ఆధ్యాత్మిక గుహలో గణేశుడు నిజమైన తల ఇప్పటికీ ఉంచబడిందని చెప్తారు.
గణేశుడు గురించి ప్రజలకు ఉన్న అతిపెద్ద సందేహం ఏంటంటే, ఆయనని గణపతి లేదా గజపతి రెండిటిలో ఏమనాలి అని.. హిందీలో గజా అంటే ఏనుగు. అతను నిజానికి సూచించబడినది గణపతిగా. అంటే, గణాల నాయకుడు. అయితే, గణేశుడుని గణపతి అనే అనాలి. శివుని గణాలలో ఒక దాని తల అతని శరీరానికి జోడించబడినది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం