Shiva puja: శివలింగానికి ఇవి సమర్పించారంటే.. మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి!
Shiva puja:శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసాలలో కార్తీక మాసం ఒకటి. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం భక్తులు ఉపవాస దీక్ష పూనుకుని పరమశివుడిని ఆరాధిస్తారు. కార్తీక మాసంలో శివ లింగానికి కొన్నింటిని సమర్పిస్తే శివ అనుగ్రహం పొంది మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దోషాలన్నీ తొలగిపోతాయి.
కార్తీకమాసం అంటేనే శివుడికి ప్రీతికరమైన మాసం. ఈ నెల అంతా ఉపవాసాలు, పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ దేవతల అనుగ్రహం పొందేందుకు తపిస్తుంటారు. చాలా మంది కార్తీకమాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ పరమశివుడిని ఆరాధిస్తుంటారు. ముఖ్యంగా ఈ మాసంలో శివలింగానికి కొన్నింటిని సమర్పించడం వల్ల పరమశివుడిని సులభంగా ప్రసన్నం చేసుకోచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల శివ అనుగ్రహం పొంది చాలా కాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కాలసర్ప దోషం, రాహు దశ, చెడు కర్మ ఫలితాలు వంటివి దోషాలన్నీ తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు దూరమవడంతో పాటు బంధాలు బలోపేతం అవుతాయి. దేవుడి ఆశిస్సులు లభించి శుభఫలితాలు కలుగుతాయని నమ్మిక. కార్తీకమాసంలో శివ లింగానికి సమర్పించాల్సిన పదార్థాలేంటో తెలుసుకుందాం.
1. పాలు:
స్వచ్ఛతకు చిహ్నంగా భావించే పాలను శివ లింగానికి సమర్పించడం వల్ల అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తీరుతాయి. పాలు మనస్సు, బుద్ధితో పాటు ఆత్మశుద్ధికి సహాయపడతాయి. కాలసర్ప దోషంతో ఇబ్బంది పడుతున్న వారు, రాహు దశలో ఉన్నవారు, రాహు చంద్రుల దశలో ఉన్నవారు కార్తీకమాసంలో శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే శుభఫలితాలు కలుగుతాయి.
2. బిల్వ పత్రం:
పరమశివుడికి పంచభక్ష పరమాన్నాలు కలిగించని ఆనందం బిల్వ పత్రంతో కలుగుతుందట. కార్తీకమాసంలో శివలింగానికి వీటిని సమర్పించడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుందని నమ్మిక.
3. తేనె:
తీయదనానికి, సంపదకు తేనె ప్రతీకగా చెబుతుంటారు. పరమశివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే కార్తీకమాసంలో శివలింగానికి తేనెతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల సంతోషం, ఆర్థిక వృద్ధి కలుగుతాయి.
4. పెరుగు:
పెరుగుతో అభిషేకం చేయడం వల్ల అదృష్టం, సమృద్ధి కలుగుతాయి. చంద్రగ్రహంతో పీడించబడుతున్న వారు కార్తీకమాసంలో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల అదృష్టం వరిస్తుంది.
5. నెయ్యి:
నెయ్యిని స్వచ్ఛతకు ప్రతీకగా చూపిస్తుంటాయి హిందూ పురాణాలు. నెయ్యి దీపాలు వెలిగించడం, నెయ్యితో అభిషేకాలు చేయడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. కార్తీకమాసంలో నెయ్యితో శివలింగాన్ని అభిషేకించడం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోతాయని నమ్మిక.
6. చెరుకు రసం:
చెరుకురసంతో దేవుళ్లని పూజించడం శుభ్రప్రదంగా భావిస్తారు. తీపికి చిహ్నంగా చెప్పుకునే చెరుకు రసం జీవితంలోకి తీయదనాన్ని, సంతోషాన్ని ఆహ్వానిస్తుందని నమ్మిక. ముఖ్యంగా ఈ కార్తీకమాసంలో శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల మీ జీవితం సంతోషంతో నిండిపోతుంది.
7. గంగాజలం:
దేవుళ్లను పూజించేందుకు అత్యంత పవిత్రమైన జలం గంగాజలం. నదీ లేదా పుష్కరిణి నుంచి అప్పుడే తెచ్చిన గంగాజలంతో దేవుడిని అభిషేకించడం అత్యంత పుణ్యకార్యంగా చెబుతుంటారు. కార్తీకమాసంలో పవిత్ర గంగాజలంతో శివలింగాన్ని అభిషేకించడం వల్ల చెడు కర్మ ఫలితాలన్నీ తొలగిపోతాయి. పరమశివుడు మీ పాపాలన్నింటినీ ప్రక్షాలన చేస్తడని నమ్మిక.
8. గంధం(చందనం:
గంధం(చందనం) శాంతికి, శ్రేయస్సుకు ప్రతీక. కుజదోషంతో ఇబ్బంది పడుతున్న వారు కార్తీకమాసంలో శివలింగానికి ఎర్ర చందనంతో అభిషేకం చేయడం వల్ల దోషాలు తొలగిపోయి శాంతి చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి.
9. ఐత్ర:
భక్తికి, స్వచ్ఛతకు ప్రతీక ఐత్ర. కార్తీకమాసంలో శివలింగానికి ఐత్రతో అభిషేకం చేయడం వల్ల ప్రేమ, వైవాహిక జీవితం బలపడతాయని శివ పురాణం చెబుతోంది.
10. బూరా( షుగర్ పౌడర్):
తిపికి ప్రతీక అయిన చక్కెర పొడిని పంచామృతంతో కలిపి అభిషేకం చేయడం వల్ల సుఖసంతోషాలు సమృద్ధిగా ఉంటాయి.