జన్మనిచ్చిన తల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరూ కూడా తల్లిని ఎక్కువగా ప్రేమిస్తారు. తల్లి బాధపడితే చూడలేరు. కానీ చాలా తక్కువ మంది మాత్రం తల్లి చెప్పినవి చేయరు, తల్లి చెప్పిన దానికి విరుద్ధంగా మాట్లాడటం వంటివి చేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు తల్లిని ఎక్కువగా ఇష్టపడతారు. తల్లి పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉంటారు. పైగా మొట్టమొదట అందరికంటే ఎక్కువ ఇష్టపడేది తల్లినే. తల్లి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు.
మరి ఏ రాశుల వారు తల్లి కోసం ఏమైనా త్యాగం చేయగలరు, ఆ రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం ఒక విధంగా ఉంటుంది. కొన్ని రాశుల వారు మాత్రం కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశుల వారికి తల్లి అంటే చాలా ఇష్టం, అమ్మపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు. మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు కుటుంబ బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. తల్లి అంటే ఎంతో ప్రాణం. తల్లి పట్ల ప్రేమ ఎల్లప్పుడూ చూపిస్తూ ఉంటారు. “తల్లి కంటే ఏదీ ఎక్కువ కాదు” అని అంటారు. సంతోషమైనా, బాధైనా తన తల్లితోనే మొదట చెప్పుకుంటారు.
తల్లికి ఆరోగ్యం బాగోకపోతే ఏ మాత్రం అశ్రద్ధ చేయరు. వారికి ఇష్టమైన వారు ఎంతమంది ఉన్నా, తల్లికి మాత్రం ఎక్కువ విలువ ఇస్తారు. తల్లికి ఏమైనా అయితే తట్టుకోలేరు. తల్లిని ఎవరైనా ఏమైనా అంటే సహించలేరు.
మీన రాశి వారు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. తల్లి బాధపడితే చూడలేరు. తల్లికి సమస్య వస్తే ఆమెకు తోడుగా ఉంటారు. ఆమె సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. తల్లితో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. తల్లి మనసును అర్థం చేసుకుని, ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటారు. తల్లిని దైవ స్వరూపంగా భావించి ఎల్లప్పుడూ గౌరవిస్తారు.
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు తల్లిని ఎక్కువగా ప్రేమిస్తారు. తల్లికి అందమైన జీవితం ఇవ్వాలని అనుకుంటారు. అమ్మకు ఉన్న ఎలాంటి కోరికనైనా తీరుస్తారు. తల్లితో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. తల్లిని దేవతగా భావిస్తారు. తల్లితో ప్రేమగా మాట్లాడడం కంటే ఎక్కువగా, ఆమెకు కావలసినవి ఇచ్చి సంతోషంగా చూసుకుంటారు. ఎలాంటి త్యాగానికైనా రెడీగా ఉంటారు.