ఈరోజు శారదయ పౌర్ణమి లేదా శరత్ పూర్ణిమ. ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే సంతోషంగా ఉండవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్లయితే డబ్బుకి లోటు ఉండదు, ఏ ఆర్థిక ఇబ్బంది ఉండదు.
శారదయ పూర్ణిమ చాలా విశేషమైన రోజు. చంద్రుని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. దీపావళి కంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ రోజు కొన్ని పరిహారాలను పాటిస్తే మంచిది. అయితే ఈ రోజు కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది కూడా. ఈ రాశుల వారు లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద, సంతోషాన్ని పొందబోతున్నారు. మరి అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడే తెలుసుకుందాం.
శారదయ పౌర్ణమి నాడు పూజలు, మంత్రాలను జపించడం వంటి వాటిని ఫాలో అయితే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, ప్రత్యేక ఫలితాలను పొందవచ్చు. ఈరోజు పౌర్ణమి వేళ చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. రెండున్నర రోజులు వరకు అదే రాశిలో సంచారం చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి, ఆర్థికపరంగా బావుంటుంది. మరి అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి వారికి శారదయ పౌర్ణమి వేళ బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. మరో రెండున్నర రోజులు పాటు ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా బావుంటుంది. విజయాలను అందుకుంటారు. ఎప్పటినుంచో కన్న కలలు ఈ సమయంలోనే నెరవేరుతాయి. శారదయ పౌర్ణమి వేళ వీళ్ళు లక్ష్మీదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా పెడితే మంచిది.
తులా రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం, చంద్రుని అనుగ్రహం ఉంటాయి. ఈ రాశి వారు కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. పచ్చి పాలను ఈరోజు నైవేద్యంగా పెడితే మంచిది. జాతకంలో చంద్రుడి స్థానం కూడా బలంగా మారుతుంది.
కుంభ రాశి వారికి శారదయ పౌర్ణమి వేళ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఈ రాశి వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. డబ్బుకి లోటు ఉండదు. జీవితంలో మరిన్ని శుభ ఘడియలు మొదలవుతాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది.
శారదయ పౌర్ణమి వేళ మీన రాశి వారు సకల సంతోషాలను పొందుతారు. మరో రెండు రోజులు పాటు మీన రాశిలోనే చంద్రుడు ఉంటాడు కనుక ఈ రాశి వారు ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు. దేనికి లోటు ఉండదు. పౌర్ణమి వేళ ఈ రాశి వారు గంగాజలం, తెల్లటి పూలను చంద్రుడికి సమర్పిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి.