Sun Transit: సూర్యుని కదలికలో మార్పు, ఈ రాశుల వారు లక్కులో కాలేసినట్టే, ఈ రాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండక తప్పదు
Sun Transit: రాశిచక్ర మార్పులు అన్ని రాశులపై శుభ మరియు అశుభ ప్రభావాలను కలిగి ఉంటాయి. నవంబర్ 16న సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. వృశ్చిక రాశిలో సూర్యుని ప్రవేశం కొన్ని రాశులకు అత్యంత శుభదాయకంగా ఉంటుంది. అలాగే కొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం, రాశిచక్ర మార్పులు అన్ని రాశులపై శుభ మరియు అశుభ ప్రభావాలను కలిగి ఉంటాయి. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు నెలకోసారి రాశులను మారస్తుంటారు. ఈ నవంబర్ 16న సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. వృశ్చిక రాశిలో సూర్యుని ప్రవేశం కొన్ని రాశులకు అత్యంత శుభదాయకంగా ఉంటుంది. అలాగే కొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. ఏయే రాశుల వారికి ఎలా ఉందో చూద్దాం.
మేష రాశి - ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది, కానీ మనస్సు చంచలంగా ఉంటుంది. ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి. ఉద్యోగంలో అధికారులతో సఖ్యత పాటించండి. ఎదుగుదలకు అవకాశాలు లభిస్తాయి.
వృషభ రాశి - మనస్సు చంచలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కుటుంబంతో కలిసి ధార్మిక ప్రదేశానికి యాత్రకు వెళ్లవచ్చు. మిత్రుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.
మిథునం - స్వీయ నియంత్రణ కలిగి ఉండండి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. వ్యాపారంలో ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. విదేశీ ప్రయాణాలు లాభసాటి అవకాశాలను అందిస్తాయి.
మకర రాశి - మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో పని ప్రాంతంలో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అధికారులు, మిత్రుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి.
సింహం - మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు, కానీ మనస్సు కాస్త చంచలంగా ఉంటుంది. సంయమనం పాటించండి. అతిగా మాట్లాడటం మానుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ సహకారం లభిస్తుంది.
కన్యారాశి:- మనస్సులో ప్రశాంతత, సంతోషం ఉంటాయి కానీ ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఉద్యోగానికి పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి.
తులా రాశి - మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఉద్యోగ ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఎదుగుదలకు అవకాశాలు ఉంటాయి.
వృశ్చికం - మనస్సు చంచలంగా ఉంటుంది. అర్థరహితమైన కోపాన్ని మానుకోండి. సంభాషణలో సమతూకం పాటించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. హార్డ్ వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
ధనుస్సు రాశి - ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మనసు కూడా కలత చెందుతుంది. స్వీయ నియంత్రణతో ఉండండి. కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. జీవన పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉంటాయి. హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది.
మకర రాశి - మనసు సంతోషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. పఠనం పట్ల ఆసక్తి ఉంటుంది. విద్యాపరమైన పనులు ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తాయి. ప్రభుత్వ సహకారం లభిస్తుంది. వ్యాపారంలో మరింత హడావిడి ఉంటుంది.
కుంభం - మనస్సు సంతోషంగా ఉంటుంది, కానీ ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. స్వీయ నియంత్రణతో ఉండండి. అనవసర కోపానికి, వాదోపవాదాలకు దూరంగా ఉండండి. అకడమిక్ పనిలో విజయం సాధిస్తారు. మిత్రుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి.
మీనం - మనస్సు అశాంతిగా ఉంటుంది. స్వీయ నియంత్రణతో ఉండండి. అనవసర కోపానికి, వాదోపవాదాలకు దూరంగా ఉండండి. పఠనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యాపరమైన పనులు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతాయి. సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆదాయం పెరుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్