Shani jayanti 2024: శని జయంతి ఈ రాశుల వారికి అశుభ కాలాన్ని ఇవ్వబోతుంది.. కెరీర్ లో ఆడ్డంకులు
Shani jayanti 2024: జూన్ 6వ తేదీ శని జయంతి వచ్చింది. ఈ సమయం కొన్ని రాశుల వారికి అశుభ కాలాన్ని ఇచ్చింది. ఆర్థిక విషయాలు, కెరీర్ లో అడ్డంకులు ఎదురవుతాయి.
శని దేవుడిని న్యాయానికి అధిపతిగా సూచిస్తారు. శని దేవుడు ప్రజల జీవితాల్లో ప్రతికూల లితాలు ఇస్తాడని భయపడతారు. కానీ శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని జయంతి రోజు చాలా శ్రేయస్కరం. అయితే వివిధ రాశుల వారికి ఈ కాలం అశుభం.

హిందూ పంచాంగం ప్రకారం శని జ్యేష్ఠ అమావాస్య రోజున జన్మించాడు. ఈ ఏడాది శని జయంతి జూన్ 6వ తేదీ గురువారం వచ్చింది. శని జయంతిలో రాహు శని కలయిక వల్ల ద్వాదశ యోగం ఏర్పడుతుంది. అదే విధంగా కుజుడు మేష రాశిలో ఉంటాడు. దీని వల్ల శని జయంతి కొన్ని రాశుల వారికి అశుభకరంగా మారనుంది. అవి ఏ రాశులో చూద్దాం.
మేష రాశి
శని జయంతి మేష రాశి వారికి చాలా అశుభకరమైనది. ఈ కాలంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారం, కుటుంబ జీవితంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. పెట్టుబడుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఆపరేషన్ కోసం ప్లాన్ చేస్తుంటే దాన్ని కొంత కాలం పాటు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ కాలంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అవసరం.
కర్కాటక రాశి
శని జయంతి 2024 కర్కాటక రాశి వారికి అనుకూలమైన సమయం కాదు. ఇది వారికి చాలా కష్టమైన కాలం. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శని ప్రభావం వల్ల మనస్సులు ప్రతికూల ఆలోచనలతో నిండిపోతాయి. కుటుంబానికి సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. శని జయంతి సందర్భంగా తల్లి ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి.
సింహ రాశి
శని జయంతి సింహ రాశి వారికి అశుభకరమైనది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ సమయం నిర్ణయం కాదు. ఈ కాలంలో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. శని దుష్ప్రభావాల కారణంగా ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే అందుకు తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. ఈ సమయంలో కుటుంబ జీవితంలో నిరంతరం ఇబ్బందులు ఉంటాయి. భాగస్వామి ఆరోగ్యం చెడిపోవచ్చు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శని దేవుడు శుభ ఫలితాలు అందించడు. ఈ కాలంలో డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నివారించకూడదు. పొరపాటున కూడా వాటిని విస్మరించకూడదు. కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు. అది వారిని అసంతృప్తికి గురి చేస్తుంది. ఒత్తిడికి దూరంగా ఉండాలి లేదంటే సమస్యలు వస్తాయి.
మీన రాశి
మీన రాశి వారికి శని జయంతి కలిసి రాలేదు. వారి జీవితంలో ఆశించిన ఫలితాలు ఉండవు. మానసిక సమస్యలతో పోరాడాల్సి వస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ వంటివి ఇబ్బంది పెడతాయి. మనసు చంచలంగా ఉంటుంది. కోపాన్ని, మాటలు నియంత్రించుకోవాలి. ఈ కాలంలో మీన రాశి వారు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.
శని ఆశీర్వాదం కోసం శని జయంతి నాడు కొన్ని చర్యలు తీసుకుంటే మంచిది. శని జయంతి రోజు ఆవులకు రొట్టెలు తినిపించాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంపై శని దేవుడి ఆశీర్వాదం లభిస్తుంది. జాతకంలో శని, రాహువు అశుభ ప్రభావాలు తగ్గించుకునేందుకు కర్పూరం నల్ల వస్త్రంలో వేసి ఇంటి తలుపుకు వేలాడదీయాలి. ఇటువంటి చర్యలు శని దేవుడి ఆశీర్వాదం ఇస్తాయి. అప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.