హిందూ క్యాలెండర్ ప్రకారం ఏడాది మార్చి 8న మహాశివరాత్రి జరుపుకోనున్నారు. సుమారు 300 సంవత్సరాల తర్వాత శివరాత్రి రోజు అద్భుతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. అనేక గ్రహాలు, నక్షత్రాల కలయిక జరగనుంది. శివరాత్రి రోజు సర్వార్థ సిద్ధి యోగం, సిద్ధి యోగం, శివయోగం, ధనిష్ట నక్షత్రం వంటి అద్భుతాల కలయిక ఏర్పడుతుంది. శివరాత్రి రోజునే శుక్ర ప్రదోష వ్రతం కూడా వచ్చింది. ఈ విశేషాలతో శివరాత్రి మరింత ప్రత్యేకత సంతరించుకుంది.
శివరాత్రి రోజు శివుడు, పార్వతి దేవి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివ పూజ చేసే సమయంలో ప్రత్యేక నియమాలు పాటించాలి. అద్భుతమైన యోగాల కలయిక ప్రభావంతో ఈ మహా శివరాత్రి నుంచి కొన్ని రాశుల వారికి స్వర్ణ యుగం ప్రారంభం కాబోతుంది. ఈ నాలుగు రాశుల జాతకులకు మార్చి 8 నుంచి శివుని ఆశీస్సులతో జీవితంలో కష్టాలు తొలగిపోతాయి.
మేష రాశి వారికి మహా శివరాత్రి నుంచి మంచి రోజులు మొదలుకాబోతున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.
పరమేశ్వరుడి అనుగ్రహంతో వృషభ రాశి జాతకులు భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. శివుని ఆశీస్సుల ప్రభావంతో వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కొనసాగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవితాన్ని సౌకర్యవంతంగా గడుపుతారు.
పనిలో అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. విదేశాలు ప్రయాణించాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.
వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పనికి సంబంధించి ప్రయాణాలు చేస్తారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
శివరాత్రి రోజు శివలింగానికి తప్పనిసరిగా అభిషేకం చేయాలి. ఆరోజు మీరు ఈ ఒక్క ఆకు శివలింగానికి సమర్పించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. శివుడికి ఇష్టమైన బిల్వపత్రంతోపాటు శమీ ఆకులు సమర్పించవచ్చు. వీటితో పాటు రావి చెట్టు ఆకులు కూడా శివలింగానికి సమర్పిస్తారు. రావి ఆకులపై గంధంతో రామనామం రాసి హనుమంతుడికి, శివుడికి నైవేద్యాలుగా సమర్పిస్తారు. శివలింగానికి శమీ ఆకుల సమర్పించడం వల్ల శివుడితో పాటు శని దేవుడు అనుగ్రహం కూడా లభిస్తుంది. మహాశివరాత్రి రోజు పూజ, అభిషేకం చేసి ఉపవాసం ఉండి జాగరణ చేయడం వల్ల ఎన్నో రెట్ల పుణ్యఫలం దక్కుతుంది.
శివలింగానికి గంగాజలంతో అభిషేకించిన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయాలి. మీకు వీలైతే గుడిలో రుద్రాభిషేకం చేయించడం మంచిది. మీ జీవితంలోని ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ ప్రత్యేకమైన రోజున రుద్రాభిషేకం చేయడం పుణ్యంగా భావిస్తారు.