Hanuman jayanthi 2024: హనుమాన్ జయంతి నుంచి ఈ రాశుల వారి జీవితంలో అన్నీ ఆనందక్షణాలే
Hanuman jayanti 2024: హనుమాన్ జయంతి నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. అప్పటి నుంచి వాళ్ళకు అన్నీ మంచి రోజులే. ఏయే రాశుల వారికి అంజనేయుడి ఆశీర్వాదాలు లభించాయో చూడండి.
Hanuman jayanti 2024: కలియుగ దైవంగా హనుమంతుడిని పూజిస్తారు. బలం, ధైర్యం ఇవ్వమని కోరుకుంటూ ఆంజనేయ స్వామిని మంగళవారం పూజిస్తారు. హనుమాన్ ని పూజించడం వల్ల జీవితంలో ఎటువంటి సమస్యలు, సంక్షోభాలు ఎదురుకావని నమ్ముతారు.
అంజనేయుడి అనుగ్రహం ఉంటే శని ఆశీస్సులు కూడా లభిస్తాయి. రాముడి పట్ల అచంచలమైన భక్తిని కలిగి ఉన్న వ్యక్తి హనుమంతుడు. జైశ్రీరామ్ అనే పదాలు నిత్యం జపించడం వల్ల ఆంజనేయుడి అనుగ్రహం ఎప్పుడూ మీమీద ఉంటుంది.
ఆంజనేయ స్వామి జన్మించిన రోజునే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 23 హనుమాన్ జయంతి జరుపుకోనున్నారు. హనుమాన్ జయంతి రోజు అనేక గ్రహాల కలయిక వల్ల శుభ దినంగా మారింది. మీనంలో గ్రహాల కలయిక వల్ల పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. అలాగే మేష రాశిలో బుధాదిత్య రాజయోగం, కుంభ రాశిలో శని యోగం ఉన్నాయి. అది మాత్రమే కాకుండా ఈ ఏడాది హనుమాన్ జయంతి మంగళవారం వచ్చింది.
మంగళవారం హనుమంతుడికి అంకితం చేసిన రోజు. ఇన్ని శుభకార్యాల మధ్య హనుమాన్ జయంతి కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. వృత్తి వ్యాపార జీవితంలో ఆశించిన విజయాలు పొందుతారు. ఏయే రాశుల వారికి ఈ అదృష్టం కలగబోతుందో తెలుసుకుందాం. అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి.
మేష రాశి
మేష రాశి వారికి హనుమంతుడి ఆశీస్సులు పుష్కలంగా అందనున్నాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ధైర్యం, బలం, దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలతో అందరి ప్రశంసలు పొందుతారు. హనుమాన్ జయంతి సందర్భంగా మేష రాశి వారికి ఆంజనేయ స్వామి శక్తి, ధైర్యం, దైవిక రక్షణ లభిస్తుంది.
సింహ రాశి
సింహ రాశికి సూర్యుడు అధిపతి. హనుమాన్ ఆశీస్సులతో ఈ రాశి జాతకులు ధైర్యం, విశ్వాసం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం వంటి ఆశీర్వాదాలు పొందుతారు. విజయం వరిస్తుంది. ఇతరులను సులభంగా ఆకర్షించగలుగుతారు. అదృష్టం పెరగడం వల్ల వృతి జీవితంలో విజయాలను పొందుతారు. వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశిని బృహస్పతి పాలిస్తాడు. జ్ఞానం, ఆధ్యాత్మిక వృద్ధి ఉంటుంది. హనుమంతుడి ఆశీర్వాదంతో జ్ఞానం లభిస్తుంది. ఆధ్యాత్మికంగా బలపడతారు. హనుమాన్ జయంతి రోజు ఏర్పడే యోగాల వల్ల ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారంలో విజయాలు, లాభాలు లభిస్తాయి. శుభవార్తలు అందుకుంటారు.
మిథున రాశి
మిథున రాశికి బుధుడు అధిపతి. తెలివితేటలు, కమ్యూనికేషన్ కి బుధుడు ప్రసిద్ధి చెందాడు. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉంటారు. హనుమాన్ జయంతి రోజు మిథున రాశి వారు తమ ప్రయత్నాలతో వ్యాపారాల్లో అనేక ఒప్పందాలు పొందుతారు. తెలివితేటలతో పనులు ముందుకు సాగుతాయి. జీవితంలో సంతోషం, శాంతి పెరుగుతాయి.
కుంభ రాశి
హనుమాన్ జయంతి రోజు కుంభ రాశి వారికి కొత్త ఉద్యోగం పొందడంలో విజయం లభిస్తుంది. వ్యాపారంలో డబ్బులు పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు గడిస్తారు. బంధుమిత్రుల నుంచి వచ్చే శుభవార్త మీ మనసుని సంతోషంతో నింపేస్తుంది.