Sensitive zodiac signs: ఈ రాశుల జాతకులు చాలా సెన్సెటివ్, ఇట్టే భావోద్వేగానికి లోనవుతారు
Sensitive zodiac signs: కొందరు చాలా సున్నితమనస్కులుగా ఉంటారు. వారితో ఏ విషయం మాట్లాడినా కష్టమే అవుతుంది. సరదాగా అనే విషయాలు కూడా ఒక్కోసారి సీరియస్ గా తీసుకుని భావోద్వేగానికి లోనవుతారు.
Sensitive zodiac signs: కొంతమంది చిన్న దానికే భావోద్వేగానికి గురైపోతూ ఉంటారు. వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. అయితే ఇది కొన్ని సార్లు వాళ్ళకు ప్రమాదాన్ని కూడా తీసుకొస్తుందనే విషయం గ్రహించలేరు. సున్నిత మనసు ఏది త్వరగా తట్టుకోలేదు. ఎవరైనా తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తే అసలు తట్టుకోలేక ఏడ్చేస్తారు.
కొన్ని రాశి చక్ర గుర్తులు అధికంగా సున్నితంగా ఉంటారు. ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మేలు చేస్తే మరొకటి హాని చేస్తుంది. మనసు సున్నితంగా ఉంటే ఇతరులతో లోతుగా కనెక్ట్ అవడానికి సహాయపడుతుంది. అలాగే కొన్ని సార్లు హాని చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం అత్యంత సున్నితంగా ఉండే రాశులు ఏవో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులు అత్యంత సున్నితమైన స్వభావం కలిగిన వారిగా చెప్తారు. చంద్రుడు ఈ రాశిని పాలిస్తాడు. వీరికి సానుభూతి ఎక్కువ. తమ చుట్టూ ఉన్న వారి భావోద్వేగాలను ఇట్టే పసిగడతారు. తరచుగా తమ అవసరాల కంటే ఇతరుల అవసరాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రతి చిన్న విషయానికి అతిగా భావోద్వేగానికి గురవుతారు. వీరి మనసు గాయపడినప్పుడు ఎదుటి వారి నిజమైన భావాలను అర్థం చేసుకోలేరు. అటువంటి సమయంలో ఎదుటి వారిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
మీన రాశి
దయగల స్వభావానికి ప్రసిద్ది చెందిన వాళ్ళు మీన రాశి జాతకులు. ఇతరుల పట్ల చాలా సానుభూతి చూపిస్తారు. తరచుగా వారి చుట్టూ ఉన్న వారి భావోద్వేగాలను గ్రహిస్తారు. వారికి ఏదైనా కష్టం వస్తే వీళ్ళు విలవిల్లాడిపోతారు. ఇది ఒక్కోసారి మంచి చేయవచ్చు కానీ మరొకసారి మాత్రం ప్రమాదం కావచ్చు. వీరి అతి ఎమోషన్ ని అడ్డం పెట్టుకుని స్వార్థం కోసం ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి. చాలా సున్నితమైన మనసు ఉండటం వల్ల ఏదైనా కఠినంగా మాట్లాడిన వాళ్ళని తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక వాళ్ళు చెడ్డవాళ్ళు అనే ట్రాన్స్ లో ఉంటారు. కలలు ఎక్కువగా కనే స్వభావం వీరికి ఉంటుంది. సానుభూతితో జీవిస్తారు. తమకు తాము హద్దులు ఏర్పరుచుకోవడంలో కొన్ని సార్లు విఫలమవుతారు. వారి శక్తిని ఎలా కాపాడుకోవాలో తెలియని సందిగ్ధ పరిస్థితిలో పడిపోతారు.
వృశ్చిక రాశి
కుజుడు వృశ్చిక రాశి పాలక గ్రహం. అసమానమైన తీవ్రతతో భావోద్వేగాలు కలిగి ఉంటారు. పైకి గంభీరంగా కనిపించినప్పటికీ లోతుగా చూస్తే వాళ్ళు చాలా సున్నితమనస్కులు. చాలా సహజంగా ఉంటారు. చుట్టుపక్కల ఉన్న సూక్ష్మ నైపుణ్యాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. చాలా విధేయులుగా ఉంటారు. కానీ ఒక్కోసారి వీరి భావోద్వేగాలు వీరి మనసుకు గాయం అయ్యేలా చేసశతాయి. సంకిష్ట పరిస్థితులను ఎదుర్కోలేక ఏడ్చేస్తారు.
కన్యా రాశి
బుధుడు కన్యా రాశికి అధిపతి. ఈ రాశుల వాళ్ళు తమ చుట్టూ ఏం జరుగుతుందో అనే విషయాల గురించి చాలా శ్రద్దగా గమనిస్తారు. ఇతరుల గురించి ఆలోచిస్తారు. మనసు సున్నితంగా ఉండటం వల్ల చిన్న బాధను కూడా భరించలేరు. అలాగే తమ శ్రేయస్సు గురించి ఆలోచిస్తూ తరచుగా ఆందోళన చెందుతారు. ఈ సున్నితత్వం అతిగా ఆలోచించడం, స్వీయ విమర్శలకు దారి తీస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.