ఈ రాశుల వాళ్ళకు కష్టాలు ఎక్కువ విజయం తక్కువ
కొన్ని రాశుల వాళ్ళకు విజయం అంత త్వరగా దక్కదు. అందుకోసం చాలా శ్రమించాల్సి వస్తుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
కొందరికి ఎక్కువ శ్రమ పడకుండా అనుకున్న పనులన్నీ జరుగుతాయి. విజయం సొంతం అవుతుంది. లక్ అంటే వీరిదేనేమో అనేట్టుగా ఉంటారు. కానీ కొందరికి మాత్రం ఎంత కష్టపడినా కూడా విజయం సాధించలేకపోతారు. ఇటువంటి వారికి చూసినప్పుడు దురదృష్టం వెంటాడుతుందేమో అని అనిపిస్తుంది. వాళ్ళను చూస్తే జాలి కలుగుతుంది.

రాశి లేదా లగ్నం ప్రకారం జీవితంలో ఫలాలు పొందుతాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దాని ప్రకారమే ఒక వ్యక్తి లక్షణాలు, వ్యక్తిత్వం అంచనా వేస్తారు. రాశిచక్రంతో పాటు వ్యక్తి భవిష్యత్ కూడా అతని కర్మపై ఆధారపడి ఉంటుంది. చాలాసార్లు అలా ఎంత కష్టపడిన విజయ తీరం చేరుకోలేని కొన్ని రాశుల గురించి తెలుసుకుందాం. ఈ రాశుల వాళ్ళు ఎక్కువగా కష్టపడతారు కానీ తక్కువ విజయాన్ని పొందుతారు. ప్రకృతి కూడా కొన్ని సార్లు వీళ్ళకు సహరించదు. సవాళ్ళు ఎక్కువ. ఆ రాశులు ఏంటో చూసేయండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వాళ్ళు సున్నితంగా, భావోద్వేగానికి లోనవుతారు. ఈ కారణంగానే వాళ్ళు త్వరగా ఇతరులతో మమేకమవుతారు. సున్నితంగా ఉండటం వల్ల ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటారు. దీని వల్ల చాలా సార్లు మానసిక క్షోభ అనుభవిస్తారు. చెడు సంబంధాలు వదిలించుకోవడం చాలా కష్టం. వృత్తి, ఉద్యోగం, కెరీర్ ఎందులోనైనా వీరికి అనుకూల ఫలితాలు అంత త్వరగా రాకపోవచ్చు. అనేక శ్రమలు దాటుకున్న తర్వాత అందుతాయి.
కన్యా రాశి
కన్యా రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని అతిగా విశ్లేషిస్తారు. తమపై తాము చాలా విమర్శలు కూడా చేసుకుంటారు. జీవితానికి ఏం కావాలి అనే విషయాన్ని తెలుసుకోలేరు. ఒకే విషయం గురించి అతిగా ఆలోచిస్తారు. ఒకే విషయం గురించి రెండు విధాలుగా ఆలోచనలు చేసి తమకు తాము ఇబ్బందులు సృష్టించుకుంటారు. ఏదైనా పని తల పెడితే అందులో విజయం సాధించాలన్నా, దాన్ని పూర్తి చేయాలన్నా చాలా కష్టపడాల్సి వస్తుంది. వీళ్ళ కష్టాలు చూస్తే ఎదుటి వాళ్ళకు కూడా జాలి కలుగుతుంది.
మకర రాశి
మకర రాశి వారికి తొందరపాటు ఎక్కువ. అది వాళ్ళకు జీవితంలో సవాళ్లను కలిగిస్తుంది. ఏదైనా పని తల పెట్టకముందే అది ఫెయిల్ అవుతుందేమోనని భయపడిపోతారు. వాళ్ళ గురించి వాళ్ళు చాలా తక్కువ అంచనాలు వేసుకుంటారు. విజయం కోసం చాలా ఎదురుచూస్తారు. ఫెయిల్ అవుతామనే భయం పని చేయాలనే ఒత్తిడి కారణంగా చాలా సార్లు ఒంటరితనంగా ఫీలవుతారు.
మీన రాశి
మీన రాశి వారికి దయగల స్వభావం. అతిగా భావోద్వేగాలకు గురవుతారు. ఎవరైనా వీళ్ళను సెంటిమెంటల్ గా వినియోగించుకోగలుగుతారు. భావోద్వేగంగా వీళ్ళు తీసుకునే కొన్ని నిర్ణయాలు వీరికి సమస్యలు కలిగిస్తుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఏదైనా పొరపాటు జరిగితే తీవ్ర నిరాశకు గురవుతారు. జీవితంలో రాణించడానికి అధికంగా శ్రమ పడతారు. ఒక పట్టాన విజయం దరిచేరదు. అందుకు వీరి చేసే తప్పులు కూడా ఒక కారణంగా ఉంటాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.