Kalagnanam: బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2025 మార్చి నుంచి జరగనున్నవి ఇవే!-these will happen from march 2025 according to brahmam gari kalagnanam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kalagnanam: బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2025 మార్చి నుంచి జరగనున్నవి ఇవే!

Kalagnanam: బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2025 మార్చి నుంచి జరగనున్నవి ఇవే!

Peddinti Sravya HT Telugu

Kalagnanam: మార్చి 2025 ద్వితీయార్థంలో పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పిన కొన్ని విషయాలు జరగబోతున్నాయట. మరి ఈ నెల నుంచి ఏం జరుగుతాయి దాని గురించి ఇప్పుడే తెలుసుకుందాం.

బ్రహ్మం గారి కాలజ్ఞానం (pinterest)

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ముందే చూసి, వాటిని తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. ఇప్పుడు కూడా జరుగుతున్న చాలా విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు ఎప్పుడో రాసారు.

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందే గ్రహించి, వాటిని చెప్పడం జరిగింది. ఆయన వారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి. ఇక ఇదిలా ఉంటే మార్చి 2025 ద్వితీయార్థంలో పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పిన కొన్ని విషయాలు జరగబోతున్నాయట.

మార్చిలో ఇవి జరుగుతాయని కాలజ్ఞానంలో ఉంది

  1. 2025 ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి ప్రపంచ దేశాల్లో కల్లోలం మొదలవుతుందని చెప్పారు.
  2. యుద్దాల కారణంగా బంగారం, ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. దీంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయట.
  3. యుద్ధాలు, ప్రజల మధ్య వైరంతో దేశాలు విలవిలాడుతాయట.
  4. ఒక పక్క ప్రజలు తుఫాను వరదలతో సతమతమవుతుంటే, మరో పక్క ప్రజలు చుక్క నీరు కూడా లేకుండా అవస్థ పడుతూ ఉంటారట.
  5. వింత పోకడాలతో అగ్రరాజ్యం చులకన అయిపోతుంది.
  6. 2025 సెప్టెంబర్ లో భారతదేశానికి తూర్పు ఉన్న సముద్రంలో సుడిగాలి పుట్టి అది ఉప్పెనగా మారుతుందట. ఇది తూర్పు ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుందట.
  7. కాసు బంగారం లక్ష రూపాయలు దాటుతుందని కాలజ్ఞానంలో చెప్పారు.
  8. ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి మొదలై చాప కింద నీరులా అన్ని దేశాలకు వ్యాపిస్తుందట.

విశ్వావసు నామ సంవత్సరంలో ఏం జరుగుతాయి?

  1. ఆషాడ శుద్ధ అమావాస్య నుంచి దేశంలో వింతలు జరుగుతాయి. సముద్రం ఉన్నట్టే ఉండి ముందుకు వస్తుందట. రాత్రికి రాత్రి తీర ప్రాంతం మునిగిపోతుందట.
  2. అధికారం కోసం ఒక పార్టీతో మరొక పార్టీ గొడవలు పెట్టుకుంటుందట.
  3. ఆకాశంలో రంగులు మారడం, పిడుగులు పడి జనం చనిపోవడం లాంటివి కూడా చోటు చేసుకుంటాయట.
  4. ఆగస్టు నాటికి దేశంలో సంక్షోభం ఏర్పడుతుందట.
  5. సౌర తుఫాన్లు భూమిపై విరుచుకు పడడం, ఒక్కసారిగా దేవాలయాల్లో విగ్రహాలు మాయం అవ్వడం, మధుర మీనాక్షి అమ్మవారు మనుషులతో మాట్లాడడం, శ్రీశైల మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్లిపోవడం, తిరుమల వెంకన్న భుజం అదరడం వంటివి జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం