Mantras: ఎన్ని ప్రయత్నాలు చేసినా కష్టాలు తీరనట్లయితే ఈ 6 మంత్రాలను పఠించి చూడండి
Mantras: ఒక్కోసారి త్వరగా కష్టాల నుంచి తేరుకుంటాము. కానీ, కొన్ని కొన్ని సార్లు ఆ పరిస్థితుల నుంచి ఈదడం చాలా కష్టంగా ఉంటుంది. కష్టాలని ఎదుర్కోవడం నిజంగా ఎంతో కష్టంతో కూడుకున్నది. అలాంటప్పుడు ఈ మంత్రాలను చదవండి.
జీవితమంటే కష్ట సుఖాల సమరం. ఓ రోజు కష్టం ఉంటే, ఒక రోజు ఆనందంగా ఉంటుంది. ఏది ఎప్పుడు ఉంటుంది అనేది ఎవరు కూడా అస్సలు ఊహించలేము. అప్పటి వరకు ఉన్న సంతోషనాలు ఒక్కసారిగా బాధగా మారిపోవచ్చు. ఒక్కోసారి త్వరగా కష్టాల నుంచి తేరుకుంటాము. కానీ, కొన్ని కొన్ని సార్లు ఆ పరిస్థితుల నుంచి ఈదడం చాలా కష్టంగా ఉంటుంది. కష్టాలు ఎప్పుడు తీరిపోతాయి అని చాలా మంది భగవంతుడ్ని ఆరాధిస్తూ, కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉంటారు. కష్టాలని ఎదుర్కోవడం నిజంగా ఎంతో కష్టంతో కూడుకున్నది.
సరిగ్గా నిద్ర పట్టదు సరి కదా అసలు ఏం చేస్తున్నామో కూడా తెలియదు. కష్టాలు ఉన్నప్పుడు దేవుడిని ఆరాధించేటప్పుడు ఈ మంత్రాలని గుర్తుపెట్టుకోండి. ఈ మంత్రాలని పఠిస్తే కష్టాల నుంచి త్వరగా గట్టెక్కొచ్చు. ధైర్యంగా ఉంటుంది.
కష్టాలు తీరిపోవాలంటే ఈ మంత్రాలని పఠించండి
హనుమాన్ చాలీసా
కష్టాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బలహీనంగా మారిపోతారు. అలాంటి క్షణాల్లో ధైర్యం కలగడానికి హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడి జీవితం గురించి హనుమాన్ చాలీసాలో తులసీదాస్ చెప్పారు. హనుమాన్ చాలీసా చదివితే దృఢంగా ఉండొచ్చు. రక్షణ కలుగుతుంది. భయాలన్నీ తొలగిపోతాయి. ధైర్యంగా ఉండొచ్చు. కనీసం రోజుకి రెండుసార్లు హనుమాన్ చాలీసా చదవడం మంచిది. బ్రహ్మ ముహూర్తం సమయంలో ఒకసారి సాయంత్రం పూట ఒకసారి చదివితే విశేష ఫలితాలు అందుకోవచ్చు.
కాలభైరవ అష్టకం
కాలభైరవ అష్టకం చదివితే సానుకూల ఎనర్జీ ప్రవహిస్తుంది. సంతోషంగా ఉండొచ్చు. చాలా ధైర్యంగా అనిపిస్తూ ఉంటుంది. కాలభైరవ అష్టకం చదవడం వలన కష్టాల నుంచి త్వరగా బయటపడొచ్చు. సంతోషంగా ఉండొచ్చు.
మహా మృత్యుంజయ మంత్రం
అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మహా మృత్యుంజయ మంత్రాన్ని రోజూ చదువుకోవడం మంచిది. 108 సార్లు మహా మృతంజయ మంత్రాన్ని చదివితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మానసిక శక్తి పెరుగుతుంది.
పంచముఖి హనుమాన్ కవచం
ఒక్కోసారి చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది. పీడకలలు రావడం, ప్రతికూల శక్తి మన చుట్టూ ఉన్నట్లు అనిపించడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు పంచముఖి హనుమాన్ కవచాన్ని రోజూ చదవడం వలన ఎలాంటి ప్రతికూల శక్తినైనా తొలగించి సంతోషంగా ఉండొచ్చు.
కనకధార స్తోత్రం
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి కనకధార స్తోత్రం చదవండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా కొత్త అవకాశాలు వస్తాయి. అప్పుల బాధల నుంచి కూడా బయటపడవచ్చు. సంతోషంగా ఉండొచ్చు.
గాయత్రీ మంత్రం
రోజూ గాయత్రి మంత్రాన్ని చదవడం వలన మానసికంగా దృఢంగా ఉండవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రశాంతత కలుగుతుంది. చాలా సంతోషంగా ఉండొచ్చు. కష్టాల్లో ఉన్నప్పుడు గాయత్రి మంత్రాన్ని రోజూ చదువుకుంటే ఈ ప్రయోజనాలన్నిటినీ పొందవచ్చు.
ఓంకారం
త్రిమూర్తి స్వరూపంగా ఓంకారం చెప్పబడుతుంది. ఓం అనేది అక్షరం. అవినాశ స్వరూపం. సంపూర్ణ జగత్తు ఓం ఉపవాక్యానమే. ఓంకారాన్ని పదేపదే చెప్పడం వలన ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ పెరుగుతుంది. సానుకూల శక్తి ప్రవహిస్తుంది.
సంబంధిత కథనం