Venus Transit: ఏప్రిల్ 13 నుంచి ఈ రాశులకు అదృష్టం.. శుక్రుడు మీన రాశి సంచారంతో ఊహించని లాభాలు-these rasis will get luck from april 13th and venus transit effects their life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Venus Transit: ఏప్రిల్ 13 నుంచి ఈ రాశులకు అదృష్టం.. శుక్రుడు మీన రాశి సంచారంతో ఊహించని లాభాలు

Venus Transit: ఏప్రిల్ 13 నుంచి ఈ రాశులకు అదృష్టం.. శుక్రుడు మీన రాశి సంచారంతో ఊహించని లాభాలు

Peddinti Sravya HT Telugu

Venus Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని ప్రత్యేకమైన గ్రహంగా భావిస్తారు. శుక్రుడు అనుగ్రహం ఉంటే తిరిగే ఉండదు. కీర్తి, ఐశ్వర్యం, సంపద వైభవాన్ని తీసుకువస్తాడు. ఏప్రిల్ 13న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. మరి ఆ రాశుల వారి గురించి ఇప్పుడే తెలుసుకుందాం.

ఏప్రిల్ 13 నుంచి ఈ రాశులకు అదృష్టం

శుక్రుడు త్వరలో మీనరాశిలోకి అడుగుపెట్టనున్నాడు. శుక్రుడు రాశి మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. మీనరాశిలోకి శుక్రుడు అడుగుపెట్టడంతో ఈ రాశుల వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని ప్రత్యేకమైన గ్రహంగా భావిస్తారు. శుక్రుడు అనుగ్రహం ఉంటే తిరిగే ఉండదు. కీర్తి, ఐశ్వర్యం, సంపద వైభవాన్ని తీసుకువస్తాడు. ఈ గ్రహం అనుగ్రహం ఉంటే సంపదకి లోటు ఉండదు. ఏప్రిల్ 13న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. మరి ఆ రాశుల వారి గురించి ఇప్పుడే తెలుసుకుందాం.

1.మిధున రాశి

మిధున రాశి వారికి శుక్రుడి అనుగ్రహం ఉంటుంది. శుక్రుడు మీనరాశిలోకి అడుగుపెట్టడంతో ఈ రాశి వారికి పలు ప్రయోజనాలు ఉంటాయి. ఈ సమయంలో మిధున రాశి వారికి కొత్త అవకాశాలు రావడంతో పాటుగా ఆదాయం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో కూడా మార్పు వస్తుంది. ఆనందం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మొత్తానికి ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది.

2.ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి శుక్రుడి సంచార మార్పుతో సంతోషం, సంపద కలుగుతాయి. ఏప్రిల్ 13న ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. సంతోషాన్ని పొందుతారు. ఆర్థికంగా కూడా ఈ రాశి వారికి బాగుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆగిపోయిన పనులు పూర్తవడంతో పాటుగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

3.కుంభ రాశి

కుంభ రాశి వారికి కూడా మేలు కలుగుతుంది. ఈ సమయంలో ఆర్థిక సమస్యలు తీరుతాయి. మునుపటి కంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారులకి కూడా కలిసి వస్తుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోయి, సంతోషంగా ఉంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం