ఈ రాశుల వారు రూబీని ధరిస్తే ఎన్నో లాభాలు.. అదృష్టం బంగారంలా మెరిసిపోతుంది.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది!-these rasis recieves lots of benefits by wearing ruby their luck shines like gold and see progress in career ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ రాశుల వారు రూబీని ధరిస్తే ఎన్నో లాభాలు.. అదృష్టం బంగారంలా మెరిసిపోతుంది.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది!

ఈ రాశుల వారు రూబీని ధరిస్తే ఎన్నో లాభాలు.. అదృష్టం బంగారంలా మెరిసిపోతుంది.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది!

Peddinti Sravya HT Telugu

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రత్నం అన్ని రాశుల వారికి సెట్ అవ్వదు. ఒకవేళ కనుక రత్నం ఆ రాశికి సరిపోయినట్లయితే ఊహించని మార్పులను జీవితంలో చూస్తారు. పురోగతి ఉంటుంది, వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. మరి సూర్యుడి రత్నమైన రూబీని ఏ రాశి వారు ధరిస్తే మంచిది?

రూబీ రత్నాన్ని ధరించడం వలన ఈ రాశుల వారికి అనేక లాభాలు (pinterest)

చాలా మంది రకరకాల రాళ్లను ధరిస్తూ ఉంటారు. రాళ్లను ధరించడం వలన అదృష్టం కలిసి వస్తుందని కూడా నమ్ముతారు. రత్నశాస్త్రం ప్రకారం, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాళ్లు శుభ ఫలితాలను తీసుకువస్తాయి. అలాంటి రాళ్లలో రూబీ కూడా ఒకటి. రూబీని ధరించడం వలన జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. పైగా ఇది సూర్యుడుతో సంబంధం కలిగి ఉంటుంది.

సూర్యుడు నమ్మకం, శక్తి, విజయాలకు కారకుడు. ఈ రత్నాన్ని ధరించడం వలన చాలా మార్పులను చూడొచ్చు. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రత్నం అన్ని రాశుల వారికి సెట్ అవ్వదు. ఒకవేళ కనుక రత్నం ఆ రాశికి సరిపోయినట్లయితే ఊహించని మార్పులను జీవితంలో చూస్తారు. పురోగతి ఉంటుంది, వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. మరి సూర్యుడి రత్నమైన రూబీని ఏ రాశి వారు ధరిస్తే మంచిది? ఏ రాశుల వారికి ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రూబీ రత్నాన్ని ధరించడం వలన ఈ రాశుల వారికి అనేక లాభాలు:

1. సెల్ఫ్ కాన్ఫిడెన్స్:

రూబీ రత్నాన్ని ధరించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రత్నాన్ని ధరించడం వలన వారిపై వారికి సందేహం ఉండదు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువ అవుతాయి.

2. డబ్బు, ఐశ్వర్యం:

రత్నాన్ని ధరించడం వలన ఐశ్వర్యం, డబ్బు కలుగుతాయి. ఆర్థికపరంగా ఇబ్బందులు ఉండవు. ధరించడం వలన కెరీర్‌లో కూడా ఊహించని మార్పులు చూస్తారు. వ్యాపారంలో సక్సెస్ ఉంటుంది. ధనప్రవాహం ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

3. ఒత్తిడి, డిప్రెషన్:

రూబీ రత్నాన్ని ధరించడం వలన ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది. డిప్రెషన్ వంటి బాధలనుంచి బయటపడొచ్చు.

4. ఆరోగ్యం:

రూబీ రత్నాన్ని ధరించడం వలన ఆరోగ్యం బాగుంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది, జీర్ణ సమస్యలు ఉండవు, కంటి సమస్యలు ఉండవు. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.

5. క్రియేటివిటీ:

కళలు, సంగీతం, రైటింగ్ వంటి రంగాల వారికి ఇది కలిసి వస్తుంది. ఈ రూబీ రత్నాన్ని ధరించడం వలన కొత్త ఆలోచనలు కూడా వస్తాయి.

ఏ రాశి వారు రూబీ రత్నాన్ని ధరిస్తే మంచిది?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రూబీ రత్నాన్ని మేష రాశి, సింహ రాశి, ధనుస్సు రాశి, కర్కాటక రాశి, మీన రాశి వారు ధరిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. జ్యోతిష్యుడిని సంప్రదించి మాత్రమే ఈ రత్నాన్ని ధరించండి. తులా రాశి, మిథున రాశి, కుంభ రాశి వారు ఈ రత్నాన్ని ధరించడం మంచిది కాదు. వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

రూబీ రత్నాన్ని ఎలా ధరించాలి?

ధరించే ముందు గంగాజలంతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత బంగారు ఉంగరంలో వేసుకుని కుడి చేతి ఉంగర వేలికి ధరించాలి. ఆదివారం నాడు ధరిస్తే మరీ మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.