రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికీ శబరి గురించి తెలుసు. శ్రీరామ పరమ భక్తురాలైన శబరి తన జీవితాన్ని రామ దర్శనం కోసం గడిపింది. నిష్కల్మషమైన భక్తికి మరో పేరు శబరి. తన జీవితమంతా శ్రీ రామ ధ్యానంలో మునిగిపోయింది.
పురాణ కథల ప్రకారం, త్రేతాయుగ ఫాల్గుణమాసం, కృష్ణపక్షం ఏడవ రోజున శబరి శ్రీరామను కలుస్తుంది. ఆ రోజున శబరి మోక్షం పొందిందని చెబుతారు. అనేక సంవత్సరాల శబరి ఎదురుచూపు ఆ రోజు ముగిసింది. శ్రీ రామ చరణ కమలంలోనే శబరికి ముక్తి లభించింది.
శబరి పేరు శ్రమణ అని చెబుతారు. శబరి భిల్ సమాజానికి చెందిన శబర జాతికి చెందినది. ఆమె తండ్రి పేరు అజ, తల్లి పేరు ఇందుమతి. శబరి తండ్రి భిల్ సమాజ ముఖ్యుడు. శబరి తండ్రి ఆమెను భిల్ రాకుమారుడితో వివాహం చేయాలని నిశ్చయించాడు. ఆ కాలంలో వివాహ సమయంలో జంతు బలులు ఇవ్వడం ఆచారం. తన వివాహ సమయంలో జంతు బలులను శబరి వ్యతిరేకించింది.
ఈ ఆచారం అంతం కావాలనే ఉద్దేశంతో శబరి వివాహాన్ని తిరస్కరించింది. ఈ ఘటన తర్వాత శబరి అడవికి వెళ్లి మాతంగ ఋషి ఆశ్రమంలో నివసించడం ప్రారంభించింది. ఆమె సేవతో సంతోషించిన మాతంగ ఋషులు, ఒక రోజు శ్రీరామే నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పారు. ఈ నమ్మకంతోనే శబరి తన జీవితమంతా రాముడు కోసం ఎదురు చూడడం ప్రారంభించింది.
శబరికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. వాటిలో కొలను నీరు ఎరుపు రంగులోకి మారిన కథ చాలా ప్రజాదరణ పొందింది. ఒకసారి శబరి నీరు తెచ్చుకోవడానికి తన ఆశ్రమం దగ్గర ఉన్న కొలనుకు వెళ్ళింది. అప్పుడు అక్కడ ఒక ఋషి శబరిని చూసి అవమానించాడు.
ఆమెకు ఆ కొలను నీరు తీసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. ఆ ఋషి శబరిపై రాళ్ళు విసిరాడు. శబరికి రాళ్ళు తగిలి గాయమై రక్తం కారడం ప్రారంభమైంది. ఒక చుక్క రక్తం ఆ కొలనులో పడింది. దీని వల్ల మొత్తం కొలను నీరు రక్త వర్ణంలోకి మారింది. దీనికి కూడా ఆ ఋషి శబరినే నిందించాడు.
తర్వాత ఋషులు అందరూ కొలను నీటిని స్వచ్ఛంగా చేయడానికి చాలా ప్రయత్నించారు. అయినా కొలను నీరు ఎరుపు రంగులోనే ఉంది. అనేక సంవత్సరాల తర్వాత, రామ లక్ష్మణులు సీతను వెతుకుతూ అక్కడికి వచ్చాడు. అక్కడ రాముడికి ఈ ఘటన గురించి తెలిసింది. రాముడు కొలను దగ్గరికి వెళ్లి నీటిలో తన పాదాలను ఉంచాడు. అయినా కొలను నీరు శుద్ధి కాకపోవడంతో రాముడు శబరిని ఇక్కడికి తీసుకురావడానికి ఋషులను కోరాడు.
శబరి రాముడు ఉన్న చోటుకు వస్తుండగా కొలను దగ్గర పడడం వల్ల ఆమె కాళ్ళ దగ్గర ఉన్న కొంత మట్టి కొలనులో పడింది. వెంటనే కొలను నీరు స్వచ్ఛంగా మారింది. ఈ కథ ద్వారా శబరి మహా తపస్విని అని తెలుస్తుంది. నిష్కల్మషమైన ఆమె భక్తికి దేవుడు స్వయంగా మోక్షం ఇవ్వడానికి ఆమె దగ్గరికి వచ్చాడు.
శబరికి సంబంధించిన ప్రజాదరణ పొందిన కథ అంటే శబరి శ్రీరామకు పండు ఇచ్చిన కథ. శ్రీరామ స్వయంగా శబరిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు జరిగిన కథ ఇది. రామ భక్తిలో మునిగిపోయిన శబరి, తన రామకు తీపి పండు ఇవ్వాలని ప్రతీ పండును పరీక్షించి ఇచ్చింది. మధ్యలో లక్ష్మణుడికి కూడా తినడానికి పండు ఇచ్చింది. కానీ లక్ష్మణుడు ఆ పండ్లు శబరి తిందని తెలుసుకుని వాటిని తినకుండా విసిరాడు.
ఇది చూసిన రాముడికి ఇది తన భక్తురాలైన శబరికి చేసిన అవమానం అని అనిపించింది. దానికి రాముడు లక్ష్మణుడితో, నువ్వు తినకుండా విసిరిన పండ్లు ఒక రోజు నీ ప్రాణాలను కాపాడతాయి అని చెప్పాడు. రామ, రావణుల మధ్య యుద్ధ సమయంలో, మేఘనాధుని బాణం వల్ల లక్ష్మణుడు మూర్ఛ పోయాడు. అప్పుడు ఆ పండ్లే సంజీవని రూపంలో లక్ష్మణుడికి ప్రాణాలు ఇచ్చాయి.
శబరికి తన జీవితంలో ఒకే ఒక కోరిక ఉంది. అదే రాముడిని చూడటం. నేటి గుజరాత్ రాష్ట్రం డాంగ్ జిల్లా సుబీర్ గ్రామంలో రామ, శబరి కలిశారని నమ్ముతారు. ఆ ప్రదేశంలో శబరి జ్ఞాపకార్థం ఒక దేవాలయం ఉంది. అదే శబరిధామ దేవాలయం. ఇక్కడికి ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం